Take a fresh look at your lifestyle.

‌నా వెతలను చూసి

తన వెతలుగా భావించి
ధైర్యాన్ని నింపింది స్నేహం.
నా తోడుగా ఎవరూ లేక
వంటరినైన నాడు
నాతో నడిచింది స్నేహం
నిరాశలో కూరుకున్న
నా మదికి సానుకూల
దృక్పధాన్ని ఇచ్చింది స్నేహం..
నా సంతోషాన్ని తన
సంతోషంగా స్వీకరించింది స్నేహం.
రక్త సంబంధాలు పలుచనైన
వేళ మనసు బంధంగా
సాక్షాత్కరించింది స్నేహం..
పోటీ తత్వంలో వెనుకబడ్డ
నాకు స్పూర్తిని ఇచ్చింది స్నేహం..
మనసు భావాలను పంచుకునే
విశాల హృదయ వేదిక స్నేహం..
ఏ బంధమో తెలియని
సంబంధమే మన స్నేహం..
ఆస్తులు.. అంతస్తులు
అనే అంతరాలను
దరి చేరనివ్వని స్నేహం.
అపార్ధాలకు తావులేకుండా
అజరామరంగా నడిచేది స్నేహం.
ఇవన్నీ మేళవించి పుష్పించింది.
ఒక ఆత్మీయ పుష్పం..
దాని పరిమళాలు ఎంతో మధురం.
అదే స్నేహం ఒక మధురం..

– ప్రియ గోలి…85008 81385
గుంటూరు..

Leave a Reply