Take a fresh look at your lifestyle.

‌రైల్వే మార్గాల ప్రవేటీరకణను రద్దు చేయాలి: ఇప్టూ

రైల్వే మార్గాల ప్రవేటీకరణను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని  ఇప్టూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.‌మధుసూదన్‌రెడ్డి  డిమాండ్‌ ‌చేశారు.శుక్రవారం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా మణుగూరు రైల్వే స్టేషన్‌ ‌మందు నిరసన తేలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రంలో బిజేపి ప్రభుత్వం నేతృత్వంలోని మెడి ప్రభుత్వం కోవిడ్‌ ‌విపత్తును ఉపయోగించుకొని ప్రజావ్యతిరేఖ విధానాలను అలంభిస్తుందన్నారు.

దానిలో భాగంగానే ఇప్పుడు రైలు మార్గాలు ప్రవేటీకరణ చేపట్టిందన్నారు. 151 రైల్లు నడుస్తున్న 109 మార్గాలను ప్రవేటు సంస్థలకు అప్పగించడం దారుణమన్నారు. ప్రజల ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో వుంచుకొని రైల్ల మార్గాల ప్రవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి.గౌస్‌, ఎం. శ్రీ‌నివాస్‌రెడ్డి, బి. లక్ష్మణ్‌, ‌సీతారాములు, ప్రతాప్‌, ‌కొమరం సమ్మయ్య, మణిబాబు, ఏ.రాజశేఖర్‌, ‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!