Take a fresh look at your lifestyle.

ఆన్‌లైన్‌ ‌తరగతులతో ప్రైవేట్‌ ‌దందా

“విద్యాసంస్థలు ప్రారంభమైన తరువాత ఆన్‌లైన్‌ ‌క్లాస్‌ల్లో బోధించిన పాఠ్యంశాలను మళ్ళీ ఉండవని యాజమాన్యాలు తల్లిదండ్రులకు స్పష్టం చేస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లలకు ఆన్‌లైన్‌ ‌తరగతులకు అంగీకరిస్తున్నారు. అయితే ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ ‌తరగతులు దాదాపు అన్ని క్లాస్‌ల్లో కొనసాగుతున్నాయి. అయితే సర్కారు విద్యాసంస్థల విద్యార్థులు మాత్రం దీనికి దూరంగా ఉంటున్నారు. ఫలితంగా రానున్న కాలంలో ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల వైపు  స్థోమత ఉన్న కొంత మంది విద్యార్థులు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థిక భారం భరించలేని మెజార్టీ పేద, మధ్య తరగతి విద్యార్థులు మాత్రం విద్యకు దూరం కానున్నారు.”

  • ఫీజులు కడితేనే యాప్‌లింక్‌ ‌తల్లిదండ్రులపై ఆర్థిక భారం
  • విద్యా రంగంలో మొదలవుతున్న అసమానతలు

రాష్ట్రంలో కొరోనా కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌విద్యా సంస్థలు అధికారికంగా ప్రారం భించడానికి అవకాశం లేకుండా పోయింది. విద్యాసంస్థలు మొదలైతే కొరోనాను కట్టడి చేయడం సాధ్యం కాదనే లక్ష్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థలను తెరిచేందుకు అనుమతించలేదు. దీనిని అసరాగా తీసుకొని ప్రైవేట్‌ ‌పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ ‌తరగతులకు శ్రీకారం చుట్టాయి. ఏప్రిల్‌లో కొద్ది రోజులు కొన్ని సబ్జెక్టులకే ఆన్‌లైన్‌లో క్లాస్‌లు పరిమితం చేశారు. విద్యా సంవత్సరం జూన్‌ 15 ‌నుండి ప్రారంభమైన తరువాత నర్సరీ నుంచి పిజి వరకు ఆన్‌లైన్‌ ‌తరగతులను ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలు నిర్వ హిస్తున్నాయి. టర్మ్ ‌ఫీజు కడితేనే యాప్‌ ‌లింక్‌లో విద్యార్థి పేరు చేరుస్తున్నారు. లేదంటే లింక్‌ ఇవ్వడం లేదు. ఇక ఆన్‌లైన్‌ ‌తరగతులే ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులను బెది రిస్తున్నారు. విద్యాసంస్థలు ప్రారంభమైన తరువాత ఆన్‌లైన్‌ ‌క్లాస్‌ల్లో బోధించిన పాఠ్యంశాలను మళ్ళీ ఉండవని యాజమాన్యాలు తల్లిదండ్రులకు స్పష్టం చేస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లలకు ఆన్‌లైన్‌ ‌తరగతులకు అంగీకరిస్తున్నారు. అయితే ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ ‌తరగతులు దాదాపు అన్ని క్లాస్‌ల్లో కొనసాగుతున్నాయి. అయితే సర్కారు విద్యాసంస్థల విద్యార్థులు మాత్రం దీనికి దూరంగా ఉంటున్నారు. ఫలితంగా రానున్న కాలంలో ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల వైపు స్థోమత ఉన్న కొంత మంది విద్యార్థులు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థిక భారం భరించలేని మెజార్టీ పేద, మధ్య తరగతి విద్యార్థులు మాత్రం విద్యకు దూరం కానున్నారు. ఫలితంగా సమాజంలో పేద, ధనిక వర్గ విద్యార్థుల మధ్య వ్యత్యాసాలు ఏర్పడేందుకు ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలు దోహదం చేసే పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

గత విద్యా సంవత్సరం క్రింది స్థాయి తరగతులకు చివరి దశలో భోదన జరగలేదు, పరీక్షలు నిర్వహించలేదు. కరోనా వైరస్‌ ‌సోక కుండా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌విదిచింది,దాదాపుగా చివరి ఘట్టం అంతా కూడా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు మూసివున్న పరిస్థితి అందరికి తెలిసిన విషయమే, కాని ఇదే అదనుగా భావించి ప్రైవేటు యజామాన్యలు నర్సరీ నుండి ఇంటర్‌ ‌వరకు ఆన్‌ ‌లైన్‌ ‌తరగతులకు శ్రీకారం చుట్టాయి. వాస్తవానికి ఆన్‌లైన్‌ ‌క్లాసులు మాద్యమిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు అర్ధం కాదు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు ఉన్నత విద్య చదువుతున్నప్పటికి చాలా మందికి స్మార్ట్ ‌ఫోన్లు లేవు. టీనేజి విద్యార్థులకు, యువ విద్యార్థులకు కొంత కష్టమైన , తల్లిదండ్రులకు ఆర్థిక భారమై లేని కొత్త కష్టాలను తెచ్చిపెట్టె ప్రమాదం ఉంది. ప్రభుత్వ విద్యా సంస్థలు ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. అయితే ప్రైవేటు విద్యా సంస్థలు ఒక అడుగు ముందుకేసి, ఆన్‌ ‌లైన్‌ ‌పాఠాల పేరుతో అప్పుడే దందా మొదలు పెట్టారు.10వ తరగతికే పరీక్షలు లేకుండా తప్పని పరిస్థితిలో దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు ఉత్తీర్ణులను చేశారు. డిగ్రీ, పిజి, ప్రోఫెషనల్‌ ‌కోర్సుల పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్‌, ‌పాస్‌ ‌చేయడానికి నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరంలో అసలు విద్యా సంస్థలు తెరుస్తారా లేదా అనే ఆయోమయ పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు దేశ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరిగిపోతున్నాయి. విద్యాసంస్థలను తెరువకుండా జీరో ఇయర్‌ ‌చేస్తారనే చర్చ కొనసాగుతుంది. దీనిని పట్టించుకోకుండా ప్రైవేట్‌ ‌య•మాన్యాలు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తూ ఆన్‌లైన్‌ ‌తరగతులను కొనసాగిస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ ‌తరగుతుల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాలలో నెట్‌ ‌వర్క్ ‌సౌలభ్యం లేక, సిగ్నల్‌ ‌రాక, ఆన్‌లైన్‌ ‌క్లాసులకు సరిపడ ఇంటర్‌నెట్‌ ‌సపోర్ట్ ‌చే•యక, విద్యార్థులు ఆగచాట్లు పడుతున్నారు. ప్రతి విద్యార్థి ట్యాబ్‌, ‌మోబైల్‌, ‌టివి, కొనుక్కోవడం తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. చాలి చాలని వేతనాలతో కొందరు చదివించే స్థోమత లేక మరికొందరు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదేకాకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే దీర్ఘకాలికంగా ఫోన్‌, ‌ట్యాబ్‌, ‌చూసిన పక్షంలో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. మరికొంత మంది టీనేజ్‌ ‌విద్యార్థులు సోషల్‌ ‌మీడియా బానిసలు అయ్యే ప్రమాదకర పరిస్థితి ఉంది. ఇప్పటికే అత్యధిక మంది విద్యార్థులు చిన్నప్పటి నుండే స్మర్ట్‌ఫోన్లకు, టివిలు చూస్తున్నారు. దీనిని చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాటి నుండి తమ పిల్లలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మళ్ళీ ఆన్‌లైన్‌ ‌క్లాస్‌ల పేరుతో తల్లిదండ్రులే స్మార్ట్ ‌ఫోన్లు, ట్యాబ్‌లు పిల్లలకు కొని ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. సర్కారు సంస్థల విద్యార్థులు మాత్రం తమ పరిస్థితికి దిగాలు పడి ఉన్నారు. ఏ పని లేక అర్ధం కాని పరిస్థితిలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఆన్‌లైన్‌ ‌తరగతుల వల్ల విద్యార్థులకు పెద్దగా ఉపయోగాలు లేవని పలువురు తల్లిదండ్రులు, వైద్యులు, విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. నేరుగా క్లాస్‌ ‌రూంలో ఉన్నప్పుడే విద్యార్థులు పాఠ్యాంశంపై అత్యధిక మంది దృష్టి పెట్టడం లేదు. ఆన్‌లైన్‌ ‌తరగతులపై ఇంట్లో అత్యధిక విద్యార్థులు అంతగా దృష్టి సారించడం లేదు. టైం పాస్‌కు తరగతులను కొందరు విద్యార్థులు వింటున్నారు. మరికొందరు మాత్రం తాము వెనుకబడి పోతామనే భయంతో తరగతులపై దృష్టి పెడుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ సమాజంలో తీవ్ర అసమానతలు, అనారోగ్య వాతావరణం సృష్టించే ఆన్‌లైన్‌ ‌తరగతులను నియంత్రించాల్సిన అవసరం పాలకులపై ఉంది.కొరోనా కారణంగా ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న పాలకులు ఆన్‌లైన్‌ ‌తరగతులతో ఏర్పడే భయానక పరిస్థితులను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై పూర్తిగా ఉంది. గ్రామీణ ,పట్టణ ప్రాంతాల పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్‌లైన్‌ ‌తరగతులకు కాకుండా ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహించాల్సి ఉంది. ఇది సాధ్యం కానప్పుడు గతంలో జీరో ఇయర్‌ ‌చేసినట్లు ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యం కానప్పుడు సిలబస్‌ను సగానికి సగం తగ్గించి కొరోనా తీవ్రత తగ్గిన తరువాత ఆఫ్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించి బంగారు బాట వేయాల్సిన అవసరం ఉంది.

malleswar sangaani
డా।। మల్లేశ్వర్‌ ‌సంగాని
జర్నలిస్టు డిపార్ట్‌మెంట్‌ ‌హెడ్‌, ‌కాకతీయ యూనివర్సీటీ, వరంగల్‌, 9866255355

Leave a Reply

error: Content is protected !!