Take a fresh look at your lifestyle.

అయిన వారికి ప్రైవేట్‌ ‌యూనివర్సిటీలా?

  • ఉన్నత విద్యను అంగడి సరుకు చేస్తారా
  • ప్రభుత్వ వర్సిటీల్లో పోస్టులను
  • ఎందుకు భర్తీ చేయరు?
  • మండిపడ్డ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క

ప్రజలంతా కరోనా ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్‌ ‌మాత్రం సందట్లో సడెమియాలా వ్యవహరిస్తున్నారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రైవేట్‌ ‌యూనివర్సిటీలకు అనుమతిస్తూ వాటిని సొంతవారికి కట్టబెట్టారని మండిపడ్డారు. సోమవారం డియాతో మాట్లాడిన ఆయన.. స్వార్థంతోనే సీఎం కేసీఆర్‌ ఐదు ప్రైవేట్‌ ‌యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారన్నారు. అవన్నీ అతనికి ఆర్థిక వనరులు సమకూర్చే వారికే ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీలకు స్టాఫ్‌ని, నిధులని కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని.. ఉన్నత విద్యను బజారులో పెట్టి అమ్ముతున్నారని మండిపడ్డారు. మంత్రి మాల్లారెడ్డికి, పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డికి యూనివర్సిటీలు పెట్టుకునే అధికారం ఇవ్వడం అధికార దుర్వినియోగమే అని భట్టి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాకు యూనివర్సిటీ కేటాయించి..
ఉన్నత విద్యను ప్రోత్సహించామని కెసిఆర్‌ ‌చెప్పారన్న విషయం గుర్తు చేశారు.

పేద విద్యార్థులు చదువుకోవడం కేసీఆర్‌కు ఇష్టం లేదన్న భట్టి.. ప్రైవేట్‌ ‌యూనివర్సిటీల వల్ల ఎస్సి, ఎస్టీ విద్యార్థులు నష్టపోతారన్నారు. ఉన్న యూనివర్సిటీలను అప్‌ ‌గ్రేడ్‌ ‌చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఉద్యోగావకాశాలు కల్పించే కోర్సులను ప్రవేశ పెట్టాలన్నారు. ఎస్సి,ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా పోతుందని.. బాంచెన్‌ ‌దొర సంస్క•తికి తెరలేపడానికే కేసీఆర్‌ ‌ప్రైవేట్‌ ‌యూనివర్సిటీలను తెస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు.

Leave a Reply