Take a fresh look at your lifestyle.

ప్రైవేట్‌ ‌టీచర్ల గోస పట్టదా!

“ఒక టీచర్‌ ‌కి 10 వేల జీతం ఇస్తే అందులో సగం జీతం, అంటే 5000/- ఇస్తున్నారు. ఇక్కడ ఒక్క సారి చూస్తే, టీచర్‌ ఇం‌టి దగ్గర నుంచి పాఠశాలలకు వెళ్లి చెప్పాలి అంటే రోజు రవాణా ఖర్చులు 60 /- అంటే 20 రోజులు తీసుకున్న 1200/- రూపాయలు మరియు వారి భోజన ఖర్చు 100/- రూపాయలు వేసుకున్న 20రోజులకి 2000/- రూపాయలు అవుతుంది, మొత్తం 3200/- ఒక్కరికి, మిగిలింది 1800/- మాత్రమే. మరి వారి ఇంటి అద్దె, కరెంట్‌ ‌బిల్లు, నిత్యావసరాలు, వారి పిల్లల ఆలనాపాలనా ఏమిటి? ఎలా బ్రతికేది? ఒక్క సారి ఆలోచించండి. ఇలాంటి జీతాలతో టీచర్లు మానసికంగా కొందరు కృంగిపోతుంటే, ఉద్యోగాలు పోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారు మరికొందరు.ఎందరో ఊరి తాళ్ళు వేసుకొని చనిపోయారు.అభం శుభం తెలియని వారి పిల్లల భవిష్యత్‌ ఏమిటి ?”

తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా నష్టపోయింది ప్రైవేట్‌ ‌విద్యా సంస్థల్లో పని చేస్తున్నటువంటి టీచర్లు మాత్రమే. రాష్ట్రంలో పాఠశాల విద్యను అందిస్తున్న 11026 ప్రైవేట్‌ ‌పాఠశాలలో 3.5 లక్షల మంది ఉపాధ్యాయులకు(బోధన/బోధనేతర) సాధారణ రోజులలో చాలీచాలని జీతాలు చెల్లించి, విద్యా హక్కు చట్టం 1994,జీవో.ఎంఎస్‌.‌నెంబర్‌.1 అమలు చేయకుండా వారిని శ్రమ దోపిడీకి గురి చేశారు. కొరోనా పరిస్థితులలో కనీసం ఏ మాత్రం పట్టించుకోకుండా, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొరోనా ఆరంభంలో మార్చ్ 22,2020 ‌నాడు జీవో.ఎంఎస్‌.‌నెంబర్‌.45, ‌విడుదల చేస్తూ అందులోని పాయింట్‌.14 ‌లో ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని లేదంటే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.కానీ యాజమాన్యాలు అది ఎక్కడ అమలు చేయాలేదు.దీనితో ఎంతో మంది టీచర్లు రోడ్డు మీద పడ్డారు. కొంత మంది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మ హత్యలూ చేసుకొని చనిపోయారు.కొరోనా రెండవ వేవ్‌ ‌పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం మరొక జీవో జారీ చేసింది జీవో నెంబర్‌.102 అది కూడా ప్రైవేట్‌ ‌విద్య సంస్థల యాజమాన్యాలు మాకు పట్టనట్టు వ్యవహరించారు.దానితో టీచర్లు రోడ్డు పై పండ్ల బండ్లు, చాయ బండ్లు, టిఫిన్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేసుకొని కాలం వెల్లదిస్తున్నా తరుణంలో పూర్తి లాక్‌ ‌డౌన్‌తో మరింత ఆర్థికంగా, మానసికంగా కృంగి పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కానీ యాజమాన్యాలు మాత్రం పట్టించుకోవడం లేదు.రాష్ట్ర ప్రభుత్వం కొరోనా పరిస్థితులలో టీచర్ల ఆత్మ హత్యలూ చూసి, టీచర్లకు కొరోనా ఆపత్కాల సాయం కింద ప్రతి ఒక్కరికి 2000/- రూపాయలు, 25 కేజీల బియ్యం ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం గా ఏప్రిల్‌ (‌మొదటగా 1,24,704, రెండవ విడుత 83,993 అంటే 2,08697), మే(2,08697 మంది టీచర్లకు), జూన్‌ ‌నెలలో 2.04 లక్షల మంది టీచర్లకు సహయం అందించారు.కానీ కొన్ని ప్రైవేట్‌ ‌కార్పొరేట్‌ ‌పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరించి, జీతాలు చెల్లించారు. టీచర్లకు ఆ సాయం కూడా అందకుండా వారి వివరాలను పంపకుండా వ్యవహరించాయి. దానితో చాలా మంది టీచర్లు ఆ సహాయాన్ని కూడా కోల్పోయారు. ఈ విషయం చూస్తే మీరీవ్వరు, మేమే (ప్రభుత్వం) ఇస్తాం వివరాలు ఇవ్వండి అంటే అది కూడా ఇవ్వనీ పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే పూర్తిగా అధికారుల వైఫల్యమే అని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం టీచర్ల వివరాలు లేకుండా అనుమతులు ఎలా ఇచ్చారో తెలియని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి సహాయం చేస్తాం వివరాలు ఇవ్వండి అంటే, అప్పుడు ఉరుకులు పరుగులు పెట్టే వివరాలు సేకరించిన వారు మన విద్యాశాఖ అధికారులు.అంటే వారు ప్రవేట్‌ ‌పాఠశాల పైన ఏ విధంగా పర్యవేక్షణ ఉందో అర్థం చేసుకోనవచ్చు. రాష్ట్రంలో ఉన్న విద్యా హక్కు చట్టాలు అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకోవడం జరుగుతుంది కానీ టీచర్లను తొలగించి, జీతాలు చెల్లించకుండా అతి కొద్ది మంది టీచర్లను పెట్టుకొని(70% తొలగించారు) వారికి కూడా ఇచ్చే తాత్కాలిక జీతంలో 40 శాతం అని, 50 శాతం అని చెల్లుస్తు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

ఉదాహరణకు ఒక టీచర్‌ ‌కి 10 వేల జీతం ఇస్తే అందులో సగం జీతం, అంటే 5000/- ఇస్తున్నారు. ఇక్కడ ఒక్క సారి చూస్తే, టీచర్‌ ఇం‌టి దగ్గర నుంచి పాఠశాలలకు వెళ్లి చెప్పాలి అంటే రోజు రవాణా ఖర్చులు 60 /- అంటే 20 రోజులు తీసుకున్న 1200/- రూపాయలు మరియు వారి భోజన ఖర్చు 100/- రూపాయలు వేసుకున్న 20రోజులకి 2000/- రూపాయలు అవుతుంది, మొత్తం 3200/- ఒక్కరికి, మిగిలింది 1800/- మాత్రమే. మరి వారి ఇంటి అద్దె, కరెంట్‌ ‌బిల్లు, నిత్యావసరాలు, వారి పిల్లల ఆలనాపాలనా ఏమిటి? ఎలా బ్రతికేది? ఒక్క సారి ఆలోచించండి. ఇలాంటి జీతాలతో టీచర్లు మానసికంగా కొందరు కృంగిపోతుంటే, ఉద్యోగాలు పోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారు మరికొందరు.ఎందరో ఊరి తాళ్ళు వేసుకొని చనిపోయారు.అభం శుభం తెలియని వారి పిల్లల భవిష్యత్‌ ఏమిటి ?

జీతాలు లేవు .. బిల్లులతో మోత :

కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీలలో వారు ఇల్లు ఉంటే వారు ఇంటి టాక్సీ లను కట్టలేనటువంటి పరిస్థితి. జీతాలు లేవు, ఈఎంఐలే కట్టా లేక పోతున్నాం. టాక్సీ ఎలా కట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఉదాహరణకి ఒక టీచరు ఇంటి టాక్సీ సంవత్సరానికి 8000/- అయితే ఆర్థిక సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు ఒకవేళ కట్టనట్టు అయితే దానికి ఇంట్రెస్ట్ ‌కూడా పడుతుంది.కానీ జీతం మాత్రం రాదు, మా గోస పట్టదా మీకు అని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు టీచర్లకు ఆపత్కాల సాయం కింద 2000/- ఇచ్చారు.అది మూడు నెలలకి 6000/- అంటే తిరిగి అట్టి సహయని రాష్ట్ర ప్రభుత్వనికి కట్టడం జరుగుతుంది,లేని పక్షంలో నిబంధనలు అని అధికారులు ఆర్డర్లు అని సామాన్యులైన టీచర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంటి కరెంట్‌ ‌బిల్లు లు కట్టుకొలేని పరిస్థితి.దీనితో కరెంట్‌ ‌వారు వారి వృత్తిలో భాగంగా కరెంట్‌ ‌కట్టు చేసే పరిస్థితి ఏర్పడింది.

అదే పాఠశాల జీతం లేదు, పిల్లల ఫీజులు మాత్రం కట్టాలి లేదంటే లింక్‌ ‌కట్టు
నగరంలోని ఒక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్‌కి జీతం ఇవ్వడం లేదు, కానీ అదే పాఠశాలలో టీచర్‌ ‌పిల్లలు 8వ, 10వ తరగతి చదువుతున్నారు, వారికి ఫీజులు కట్టా లేదని ఆన్‌లైన్‌ ‌తరగతులు కట్టు చేసారు. ఇలాంటీ పరిస్థితి ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలలో పనిచేస్తున్న టీచర్లది.

ప్రభుత్వ సహాయం కొనసాగించాలి బోర్డు ఏర్పాటు చేయాలి:
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యకు చట్టాలను పటిష్టంగా చేసి విద్యార్థులు నష్టపోకుండా వారికి నాణ్యమైన విద్యను అందించేలా వారికి చదువు చెప్తున్న టీచర్లకు ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి నెల జీతాలు వారికి అందేలా చూడాలని కోరుతున్నాం. కొరోనా పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం కొరోనా సహాయం కింద బడులు తెరిచే అంతవరకు టీచర్లకు ఇస్తామన్నా సహాయం కొనసాగించాలని, ప్రైవేట్‌ ‌టీచర్లు కూడా తెలంగాణ బిడ్డలే, వారిని ఇబ్బంది నుంచి బయట పడేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వనీ కోరుతున్నాం.

– అయినేని.సంతోష్‌ ‌కుమార్‌
‌రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ స్కూల్స్ ‌టెక్నికల్‌ ‌కాలేజెస్‌ ఎం‌ప్లాయిస్‌ అసోసియేషన్‌ (TSTCEA), 9618927732

 

Leave a Reply