Take a fresh look at your lifestyle.

ప్రైవేటు దవాఖానలు….కొరోనా పేరుతో దోపిడీ చేస్తే అనుమతులు రద్దు

కొరోనాకు రూ.1000లోపు ఔషధాలు చాలు
ప్రజలెవరూ భయపడొద్దు : మంత్రి ఈటల

కొరోనా చికిత్సల పేరుతో బాధితుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు దవాఖానల అనుమతులు రద్దు చేస్తామని  రాస్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. మానవత్వాన్ని మరచి డబ్బులు గుంజే ప్రయత్నం చేయొద్దనీ,  కోవిడ్‌-19 ‌రోగుల విషయంలో ప్రైవేటు దవాఖానలు ఇకనైనా పద్దతి మార్చుకోవాలని పేర్కొన్నారు. మంగళవారం ఆయన కోఠిలోని కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో
రాష్ట్రంలో కొరోనా పరిస్థితి, ప్రైవేటు దవాఖానలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన  డియా ప్రతినిధులతో  మాట్లాడారు.. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను కొన్ని ప్రైవేటు దవాఖానలు దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. సంపాదించు కోవడానికి ఇది సమయం కాదన్నారు. ప్రజలను భయపెట్టి లక్షల రూపాయలు వసూలు చేయడం సరికాదనీ, ఇప్పటికే ఓ దవాఖానపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.  చిన్న వైద్యానికే రూ.లక్షల బిల్లులు వసూలు చేయడం హీనమైన చర్య అన్నారు. కొన్ని ప్రైవేటు దవాఖానలు చికిత్సల విషయంలో అనుసరిస్తున్న తీరు బాధాకరమనీ, దీనిపై ఎన్నోసార్లు హెచ్చరించామని ఇప్పటికి మారకపోతే ప్రైవేటు దవాఖానలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు రోజుకు గరిష్ఠంగా రూ. 9 వేలకు మించి తీసుకోవద్దని ప్రైవేటు దవాఖానలకు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.

అనారోగ్య లక్షణాలు కనబడితే హాస్పిటల్‌కు వెళ్లకుండా ఎవరూ దాచుకోవద్దనీ,  ఇప్పటికే ఎన్నో రకాల వైరస్‌లను ఎదుర్కొన్న అనుభవం మన వైద్యులకు ఉందన్నారు.  కరోనా వైరస్‌ ‌మానవాళికి అతిభయంకరమైన మహమ్మారి గనక  వంతుగా ప్రజలకు విశ్వాసం, ధైర్యం ఇవ్వండని ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలను గతంలో చాలాసార్లు కోరాం. సాటి మనిషికి ఆపన్న హస్తంఅందించాలని విజ్ఞప్తి చేశాం. వ్యాపార దృక్పథంతో చూడొద్దన్నాం. మేం కోరిన విధంగా కాకుండా కొన్ని దవాఖానలు అనేక రకాలుగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు మాకు వందల, వేల ఫిర్యాదులు వస్తున్నాయి. హాస్పిటల్‌కు పోగానే రూ.2లక్షలు డిపాజిట్‌ ‌చేయిండి అనడం.. చికిత్స జరగాలంటే రోజుకు రూ.లక్ష కట్టాలనడం.. 15 రోజులు ఉంటే రూ.15లక్షలు కట్టండి అంటూ వేధింపులకు పాల్పడటం వంటి ఫిర్యాదులు అందాయి. మనిషి చనిపోతే మృతదేహాన్ని అప్పగించడానికి రూ.4లక్షలు కట్టాలని వేధించే పద్ధతి మానవ సమాజానికే ఓ కళంకంగా మారిపోయింది. అత్యంత హీనమైన చర్య. మేం మాట్లాడిన తర్వాత కూడా ఆస్పత్రులు వాటి పద్ధతులు మార్చుకోకపోతే మాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నియమించిన కమిటీలు అన్నీ పరిశీలిస్తున్నాయి. ఇంకా పద్ధతి మారకపోతే ఆ ప్రైవేటు దవాఖానాల అనుమతులు రద్దు చేస్తాం. ప్రజలను భయపెట్టి లక్షల కొద్దీ వసూలు చేయడం సరికాదని తీవ్రంగా హెచ్చరించారు.

కొరోనాకు ఇస్తున్న మందులు 15 పైసల ట్యాబ్‌లెట్లు, రూ.10ల ఇంజెక్షన్లే తప్ప వేలాది ఖరీదు చేసే ఇంజెక్షన్లు లేవు. నిన్న నిపుణుల కమిటీ చెప్పిందేమిటంటే..అసలు ఈ చికిత్స అంతా కలిపితే రూ.1000లకు మించదంటున్నారు. పెద్ద పెద్ద ఇంజెక్షన్లు, పెద్ద పెద్ద దవాఖానాలు, వెంటిలేటర్ల వరకు జనం ఆలోచిస్తున్నారు. అంత అవసరం లేదు. సకాలంలో ట్రీట్‌మెంట్‌తో పాటు ఆక్సిజన్‌ అవసరం. ఆక్సిజన్‌ ‌కూడా 10 రోజుల పాటు ఒక పేషెంట్‌కు పెడితే.. రోజుకో సిలిండర్‌వాడినా కూడా 10 రోజుల కాలంలో ఒక పేషెంట్‌పై రూ.2500 మాత్రమే ఖర్చవుతుంది.ఇదీ అసలు చికిత్స. వేరే రోగాల్లో లాగా కాదు. కార్పొరేట్‌ఆస్పత్రి అయినా, గాంధీ ఆస్పత్రి అయినా.. గ్రాణ ప్రాంతాల్లో పీహెచ్‌సీ అయినా కరోనాకు ఇచ్చే మందులివే. గ్రాణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడే నయమవుతున్నారు. పరిస్థితి విషమించకముందే ఆస్పత్రికి వెళ్తే సురక్షితంగా బయటపడతారు. అందువల్ల ప్రజలు బెంబేలెత్తిపోయి ప్రైవేటు దవాఖానలకు పోనక్కర్లేదని మంత్రి స్పష్టం చేశారు. గత నాలుగైదు నెలలుగా కేసులు చూస్తుంటే ఎంత భయపడ్డామో ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ వైరస్‌పైనా ఒక అంచనా వచ్చింది. మరీ అంత భయపడనవసరంలేదు. అంటుకోగానే చంపగలిగే శక్తి దీనికి లేదని ఆచరణలో నిరూపితమవుతోందనీ,  వర్షాకాలం వచ్చింది గనక అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఏ ఇంట్లో ఏ వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు, గుండెనొప్పి లాంటి సమస్యలు వచ్చినప్పుడు తక్షణమే పీహెచ్‌సీని సంప్రదించాలనీ,  గత నాలుగైదు నెలలుగా గ్రాణ ప్రాంతంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం‌లు ఇంటింటికీ సర్వే చేసి ఏ సమస్య ఉన్నా చికిత్స అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గ్రామాల్లో కొవిడ్‌ ‌లక్షణాలు కలిగిన రోగులు వస్తే ట్రీట్‌ ‌చేయొద్దని ఆర్‌ఎం‌పీలకు కూడా సూచనలు ఇచ్చాం. వారిని పీహెచ్‌సీకి పంపాలని కోరామని ఈ సందర్భంగా మంత్రి ఈటల వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!