Take a fresh look at your lifestyle.

ఆన్‌లైన్‌ ‌విద్య పేరుతో దోపిడి చేస్తున్న ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలు

సూర్యాపేట, జులై9, ప్రజాతంత్ర ప్రతినిధి): కరోనా విపత్తులో ఉపాధి కోల్పోయి రోజు రోజుకు ఆకలిచావులు పెరుగుతున్నటువంటి విపత్కర సమయంలో ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌విద్యాసంస్థలు దోపిడికి పాల్పడుతున్నాయని తెలంగాణ స్టూడెంట్‌ ‌ఫెడరేషన్‌ ‌టిఎస్‌ఎఫ్‌ ‌రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బారి అశోక్‌కుమార్‌ అన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు సమాయానికి ఫీజులు అందించకపోతే పాస్వర్డ్ ‌చెప్పకుండా విద్యార్థులను వారి తల్లిదండ్రులను విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్రంగా వేదిస్తున్నాయి. గడిచిన విద్యాసంవత్సరం ఫీజులు మొదలుకొని కంప్యూటర్స్ ‌యూనిఫామ్స్ ‌పేర అదనంగా వసూలు చేస్తున్న ప్రభుత్వం చూస్తూ కూడా తమకేమి పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్దంగా ఆన్‌లైన్‌లో విద్యపేరుతో దోపిడికి పాల్పడుతున్న ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌విద్యాసంస్థపై కఠిన చర్యలు తీసుకొని, క్రిమినల్‌ ‌కేసులు పెట్టి వాటి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

అసమానతలతో కూడిన ఆన్‌లైన్‌ ‌విద్య ద్వారా మోజార్టీ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది, బ్రతకడమే కష్టంగా మారిన పరిస్థితి ఫీజుల్లో, ల్యాప్‌టాప్‌, ‌నెట్‌ ‌చార్జీలు అదనపు భారమే కాక గ్రామీణ ప్రాంతంలో కరెంట్‌, ‌సిగ్నల్‌, ‌కంప్యూటర్స్ అం‌దుబాటులో లేక చదువులకు దూరం అయ్యి పరిస్థితి ఏర్పడుతుందని, ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆన్‌లైన్‌ ‌క్లాసులు ఆపివేసి ప్రత్యామ్నయం వెతకాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహారం ఇంటి వద్దకు చేర్చి అందజేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి గిరిబాబు, శేఖర్‌, ‌యుగేంధర్‌, ‌వెంకట్‌, ‌రమేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!