Take a fresh look at your lifestyle.

‌ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి : కలెక్టర్‌

‌పునరావాస కేంద్రాల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్‌ ‌జాక్టర్‌ ‌యంవి  రెడ్డి తెలిపారు. మంగళవారం సబ్‌ ‌కలెక్టర్‌ ‌కార్యాలయం, భద్రాచలం నుండి వరద సహాయక చర్యలపై టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరద 65 అడుగుల వరకు వచ్చే అవకాశం ఉన్నందున ఆ స్థాయికి ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను తక్షణం పునరా వాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. పైనున్న ఉపనదులతో పాటు పేరూరు నుండి భద్రాచలం వరకు వర్షపు నీరు చేరి నదిలో కలుస్తుండటం పట్ల వరద ఉద్భతి కోసం సాగుతుందని, దీనితో పాటు తాలిపేరు నుండి భారీగా నీరు చేరుతున్నట్లు చెప్పారు. రానున్న రెండు మూడు రోజులు పాటు వరద ఉద్భతి కొనసాగే అవకాశం ఉన్నందున చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రానున్న రెండు, మూడు రోజులు చాలా కీలకమని చెప్పారు. వరద తగ్గుతుందిలే అని ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి ఇష్టం చూపరని మనమే వాటిని అవగాహన కల్పించి పునరావాస కేంద్రాలకు తరలిం చాలని చెప్పారు.

పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు అధికారులకు సర్వాధికారాలు ఇచ్చామని అయినా ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉన్నట్లు చెప్పారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు మద్య మధ్యలో టీ, స్నాక్స్ ఇవ్వాలని చెప్పారు. పునరావాస కేంద్రాలు అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రంగా ఉండాలని, గడ్డి ఏర్పడి అపరిశుభ్రత కేంద్రాలు హృదయ విదారకంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తూ ఏదైనా ప్రమాదం జరిగితే యంపిపి, యంపిడిఓ, పంచాయతీ కార్యద ర్శులను సస్పెండ్‌ ‌చేస్తామని హెచ్చరిం చారు. కనీస సౌకర్యాలు కల్పించకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది అధికారుల నిర్లక్ష్యంగా భావించి విధుల నుండి తొలగిస్తామని చెప్పారు. రానున్న కొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటే ప్రమాదం నుండి బయటపడ తామని, పునరావాస కేంద్రాల ప్రజలను మన బల్మీయులలాగా చూసుకోవాలని, తిరిగి వెళ్లే సమయంలో వారు సంతోషంగా మంచిగా చూసుకున్నారని దీవెనలు ఇస్తారని అది ఎంతో పుణ్యమని చెప్పారు. విధులకు గైర్హాజరైన అశ్వాపురం ఎంపిడిఓ నరసింహా• •వును విధుల నుంచి సస్పెండ్‌ ‌చేస్తున్నట్లు చెప్పారు. డిపిఆర్‌ ‌ద్వారా జారీ చేయబడినది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply