Take a fresh look at your lifestyle.

ప్రధానోపాధ్యాయుల అవస్థలు ఎన్నో?

విద్యాశాఖ ప్రవేశపెట్టిన టి.హాజరు,సెల్ఫీ ఫొటొ దిగి అప్లొడ్‌ ‌చేయడం తదితర యాప్‌లతో కుస్తీ పడుతూ, సర్వర్‌ ‌తదితర సమస్యలతో సకాలంలో పని పూర్తి కాక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యాజమాన్యముల కింద ఉన్నత పాఠశాలలో పని చేస్తూ వున్న ప్రధానోపా ధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు..ఉన్నత పాఠశాల నిర్వహణలో వీరి పాత్ర ఎనలేనిది. పాఠశాల ప్రారంభం నుండి చివరి వరకు అప్రమత్తంగా వుండి విధ్యార్థులకు మెరుగు అయిన విద్య అందే విధముగా ఆయా పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులకు సలహాలు,సూచనల తో పాటు ఏ రోజు కారోజు మండలానికి నివేదికలు పంపడం,మధ్యాహ్న భోజనం పిల్లలకు సక్రమంగా అంధుతూ వుంధా? లేదా , చూడడం,పాఠశాల వాతావరణము పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడం,తరగతి గదులు నిత్యం శుభ్రంగా వుండేల,విద్యార్థులు మాస్క్ ‌లు ధరించేల చూడడం వారి కర్తవ్యం. అలాగే పాఠశాల విద్యా శాఖ ప్రవేశపెట్టిన వివిధ యాప్‌ల్లో వివరాలు నమోదు చేయడానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు సహకరించక ప్రధానో పాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకం. పాఠాల బోధన కంటే యాప్‌లపైనే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఉదయం బడికి రాగానే సెల్ఫీ దిగి ఫోటోను అప్లొడ్‌ ‌చేయాలి.కొన్ని ప్రాంతాలలో సిగ్నల్స్ ‌లేక సర్వర్‌ ‌సక్రమంగా పనిచేయక తొలి గంటలోనే ఇబ్బందులు ప్రారంభ మవు తున్నాయి.

మొదటి పిరియడ్‌ ‌లోపు విద్యార్థుల హాజరు తీసుకొని యాప్‌లో పొందుపరచాలి. ఆ ప్రక్రియ గడువులోగా పూర్తి కావడం లేదు.చాల సమయం పడుతుంది.ఐఎంఎంఎస్‌ ‌యాప్‌లో మధ్యాహ్న భోజన వివరాలు పొందుపరచాలి. తనిఖీ విభాగంలో వంట గది ప్రదేశం, సరుకులు నిల్వ ప్రాంతం, పాత్రలు, చెత్త డబ్బా, విద్యార్థులు తినే ప్రదేశం, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, చేతుల శుభ్రత, కోడి గుడ్లు ఇస్తున్నారా? లేదా? వంటివి అప్‌లోడ్‌ ‌చేయాలి., సీఆర్పీలకు అప్‌లోడ్‌ ‌చేసిన అంశాలను వివరి ంచాలి. పరీక్షా ఫలితాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.పాఠశాల ముగిసిన తరువాత ఇన్‌-ఔట్‌ ఉపాధ్యాయుల హాజరు వివరాలను పొందు పరచాలి. ఎంఈవో, డి.ఈ.ఓ, అధికారులు వచ్చినప్పుడు యాప్‌లు వినియోగిస్తున్న తీరును వివరించాలి.వాటితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పడం, పాఠశాల నిర్వహణ నిత్యకృత్యం.

ప్రతి నెల ఉపాధ్యాయుల వేతనాల బిల్లులు, సరెండర్‌ ‌బిల్లులు,మధ్యాహ్న భోజన పథకానికి చెందిన బిల్లులు చేసి ట్రెజరీ లో అందించడం, విద్యార్థుల ఉచిత పాట్య పుస్తకాల వివరాలు,దుస్తుల వివరాలు రాసి మండల విద్యా వనరుల కేంద్రం కి చేరవేయడం, బడికి రాని పిల్లల తల్లిదండ్రులకి చరవాణి ద్వార మాట్లాడి కారణాలు తెలుసుకోవడం, అలాగే జిల్లా,రాష్ట్ర విధ్యా శాఖ నుండి ఎప్పుడు ఏ సమాచారం వచ్చినా ఆగ మేఘాల మీద వాటి వివరాలు పంపడం,వారానికి ఒకటి రెండు సార్లు జూమ్‌ ‌మీటింగ్‌ ‌లో పాల్గొ నడం వల్ల అనేక మంది గెజిటెడ్‌ ‌ప్రధ్యానొ పాధ్యాయులు,సీనియర్‌ ‌స్కూల్‌ అసిస్టెంట్‌ ఇం‌చార్జి ప్రధానోపాధ్యాయులు ఒత్తిడి కి గురి అయి చిన్న వయస్సు లోనె బి.పి,షుగర్‌,‌మిగతా వ్యాధులు తెచ్చుకుంటున్నారు. ఆయా యాప్‌ల్లో నమోదు చేయకుంటే పైస్థాయి అధికారుల నుండి చివాట్లు తినడం జరుగుతుందని వాపోతున్నారు.

కొవిడ్‌ ‌వల్ల పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభం కావడం, సిలబస్‌ ‌పూర్తి కాకపోవడం వంటి అంశాలతో సతమతమ వుతుంటే ఈ యాప్‌ల వినియోగంతో ఉపాధ్యాయులు మరింత కుంగిపోతున్నారు.ఉపాధ్యా యులు విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు సమయం సరిపోవడం లేదు. సిగ్నల్‌ ‌లేక కొన్ని పాటశాల లో యాప్‌లను వినియోగించడం కష్టంగా ఉంది.విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రధానోపాధ్యాయుల కు పని భారం తగ్గించాలని మా మనవి.అన్ని రకాల యాప్‌లు వినియో గించడానికి అదనపు సిబ్బందిని నియమించాలి. యాప్‌ల్లో సమాచారం పొందుపరచడం ప్రధానోపాధ్యాయులకు కత్తి మీద సాములా మారింది.. ప్రధానో పాధ్యాయులను బోధనేతర పనులకు దూరంగా ఉంచాలి. యాప్‌ల వినియోగం ప్రధానోపాధ్యాయులకు భారంగా మారింది. ఆ సమాచారం పొందుపరిచేందుకు ఇతర సిబ్బంది అవసరం.కావున విధ్యా శాఖ ప్రధానోపాధ్యాయుల మీద పని ఒత్తిడి తగ్గించాలి. వారికిమానసిక ఒత్తిడి నుండి విముక్తి చేయాలి.

– కామిడి సతీశ్‌ ‌రెడ్డి,జడలపేట,
జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా.
9848445134.

Leave a Reply