Take a fresh look at your lifestyle.

రాష్ట్రాలకు ఆర్థిక సహాయం ప్రస్తావన లేని ప్రధాని ప్రసంగం..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. ఏప్రిల్ 20 నుంచి పరిమితులతో కూడిన సడలింపు లాక్ డౌన్ ఉంటుంది అని సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభం అధిగమించడానికి రాష్ట్రాలు ఆర్థిక సహాయాన్ని అర్ధించాయి. నిధుల కోసం ముఖ్యమంత్రుల నుండి పదేపదే విజ్ఞప్తులు పీఎం మోడీకి వచ్చాయి. అయినా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాలకి సంబంధించిన నిధుల విడుదలకి గురించి ఏమి మాటాడలేదు. కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించే ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోడీ. మంగళవారం 19 రోజుల అదనపు లాక్డౌన్ ప్రకటించారు. ఏప్రిల్ 20 వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసారు. అటుపై పరిస్థితిని అంచనా వేసిన తర్వాత నిర్దిష్ట ప్రాంతాల్లో సడలింపు ఉంటుందని పీఎం స్పష్టం చేసారు .ప్రస్తుత పరిస్థితిని అధిగమించడానికి రాష్ట్రాలకు సహాయపడే అత్యవసర చర్యల కోసం ముఖ్యమంత్రులు ప్రధాని మోడీకి పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రధానమంత్రి రాష్ట్రాలకి సంబంధించి ఆర్థిక ప్రణాళిక లేదా ప్యాకేజీని వెల్లడించలేదు.

- Advertisement -

అయితే, మహమ్మారికి వ్యతిరేకంగా యుద్ధం ఎలా చేయాలో మార్గదర్శకాలతో కూడిన వివరణాత్మక పత్రాన్ని ప్రభుత్వం బుధవారం ప్రచురిస్తుందని పీఎం తెలిపారు. ఏప్రిల్ 20 నుండి మే 3 వరకు సడలింపుల విషయానికొస్తే, రోజువారీ కూలీలు, వ్యవసాయ రంగం, అవసరమైన సేవలకు పరిమితుల మినహాయింపు ఇంచటం గురించి పీఎం మాటాడారు. “రేపు వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేస్తాము. రైతులు, పేదలు కనీసం ప్రభావితమయ్యేలా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. సహనంతో, మేము కరోనావైరస్ను ఓడించగలము, ”అని ప్రధాని ప్రకటించారు. ఏప్రిల్ 20 తరువాత, ఎపిడెమియోలాజికల్ అసెస్‌మెంట్ వైరస్ వ్యాప్తి తీవ్రత ఆధారంగా వివిధ ప్రాంతాలలో గ్రేడెడ్ రిలాక్సేషన్లు ఉంటాయని పిఎం మోడీ తెలిపారు.అయితే ఏదైనా ప్రాంతాల్లో తాజాగా కోవిడ్ -19 కేసులు నమోదు అయితే ఆ ప్రాంతాలలో ఆంక్షలను తిరిగి అమలు చేయవచ్చని పీఎం ప్రకటించారు. ఏప్రిల్ 12 నాటికి, కోవిద్ 19 కేసులు దేశవ్యాప్తంగా 354 జిల్లాల్లో నమోదయ్యాయి, అంటే దేశంలోని ప్రతి రెండవ జిల్లాలో కోవిద్ 19 కేసులు నమోదు అయ్యాయి. అయితే 228 జిల్లాలలో 10 కంటే తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

Leave a Reply