Take a fresh look at your lifestyle.

విభజన ఏర్పాటుపై ప్రధాని కామెంట్స్ అభ్యంతరకరం

  • కేసీఆర్‌కు మోడి జాకీ పెట్టి లేపాలని చూస్తున్నరు… : రేవంత్‌ ‌రెడ్డి
  • రాష్ట్ర వ్యాప్తంగా మోడి దిష్టి బొమ్మలు దగ్దం చేస్తాం

న్యూ దిల్లీ ,ప్రజాతంత్ర ,ఫిబ్రవరి 8: తెలంగాణ సెంటిమెంట్‌ ‌పేరుతో కేసీఆర్‌ ‌కు ఆక్సిజన్‌ ఇచ్చి జాకీలతో లేపాలని ప్రధాని మోడి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ ‌చీఫ్‌, ఎం‌పి రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ‘రాష్ట్రంలో కేసీఆర్‌ ‌కు జాకీనే కాదు, ఇంకేం పెట్టి లేపిన లేవడు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ చచ్చిన శవం. కుల్లు పట్టక ముందే ఆ శవాన్ని తెలంగాణ ప్రజలు స్మశానంలో పాడేస్తారు. కేసీఆర్‌ ‌వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టడానికి తెలంగాణ ప్రజానీకం సిద్ధమైంది’ అని రేవంత్‌ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానం సందర్భంగా ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ‌లో ఆయన మీడియాతో ఆయన మాట్లాడారు. మోడి వ్యాఖ్యలకు నిరసనగా అన్ని జిల్లాల్లో మోడి దిష్టిబోమ్మలు తగల బెట్టాలని, బిజేపి నేతల్ని నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రెండు రోజులుగా చట్ట సభల్లో తెలంగాణ ఏర్పాటుపై మోడి ఇష్టారీతిన మాట్లాడితే, ఒక్క టీఆర్‌ఎస్‌ ఎం‌పీ నోరుతెరవలేదన్నారు. కనీసం నిరసన తెలపడానికి, ప్రసంగానికి అడ్డుతగిలేందుకు సాహసించలేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ‌వోడు బిజేపిని తిడితే, బిజేపి వోడు తెలంగాణ ప్రజల్ని తిడుతున్నాడన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాడే-వీడే, వీడే-వాడుగా మారి రాష్ట్ర ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నారని విమర్శించారు. లేని బిజేపి ఉన్నట్లగా, ఎదుట ఎవరు లేకపోయినా గాలిలో కత్తి తిప్పుతున్నట్లు ఉందన్నారు. సంజయ్‌ అరెస్ట్, ‌జైల్‌, ‌బైల్‌ అం‌టూ లంగ నాటకాలు ఆడితే, ప్రధాని పార్లమెంట్‌ ‌వేదికగా ప్రజల్ని అవమానిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. మోడి తన అతి తెలివిని, వ్యాపార ట్రిక్కులను తెలంగాణ ప్రజల ముందు చూపించదని అన్నారు.

త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పాటు చేస్తే, రాజకీయ దురుద్దేశంతో మాట్లాడడం సరికాదన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజిపేట రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, ట్రైబల్‌ ‌యూనివర్సిటీ, 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ‌ప్రాజెక్ట్ ‌ల నిర్మాణం, హైదరాబాద్‌ ‌కు ఐటీఐఆర్‌ ‌కారిడార్‌ ‌లను పొందు పరుస్తూ రాష్ట్ర అభివఈద్ధికి కాంగ్రెస్‌ ‌సహకరించిందన్నారు. కానీ, అన్నిటింని తుంగలో తొక్కి కేంద్రంలోని మోడి సర్కార్‌ ఒక్క హమీని అమలు పరుచలేదన్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి, ఆ రాష్ట్ర ప్రజలను మోడి వచించారన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మాటిచ్చి, ఆ దేవుడికే శటగోపం పెట్టారన్నారు. ఏపికి స్పెషల్‌ ‌స్టేటస్‌ ఇవ్వనందుకు మోడి తలవంచుకోవాలన్నారు. పార్లమెంట్‌ ‌లో మాటిచ్చి తప్పినందుకు, ఆ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. హామీలను అమలు చేయలేని మోడి, బంగాళాఖాతంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలన్నారు. పార్టీని, రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. అలాంటి కాంగ్రెస్‌ ‌పార్టీ పేరు ఎత్తే అర్హత, ప్రశ్నించే స్థాయి మోడికి లేదన్నారు. అత్యున్నత స్థాయి వ్యక్తి, అదమ స్థాయిలో మాట్లాడితే ఎలా ఉంటుందో మోడి ప్రసంగం ఉభయ సభలో అలాగే ఉందన్నారు. ‘ప్రజా జీవితంలో పోరాటాల ద్వారా మోడి ప్రధాని కాలేదు. మ్యానేజ్మెంట్‌ ‌స్కీల్స్ ‌ద్వారా, కొద్ది మంది వ్యక్తులను ప్రసన్నం చేసుకొని దేశానికి ప్రధాని అయ్యారు. అరుణ్‌ ‌జైట్లీ తో మొదలైన మేనేజ్మెంట్‌ ‌విద్య, అద్వానీని నిండ ముంచేందుకు ఉపయోగ పడ్డది. నమ్మించిపోసం చేయడంలో నమో కు ఉన్న అనుభవం దేశ ప్రజలకు తెలుసు.’ అని విమర్శించారు.

1997 లో కాకినాడ ప్లీనరి లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదానికి కట్టు బడి తెలంగాణ ఇచ్చి ఉంటే మలి దశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరులయ్యే వారు కాదన్నారు. విద్యార్థుల ఈ ప్రాణ త్యాగాలకు బాధ్యత వహిస్తూ…. చట్ట సభల ద్వారా మోడి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఐదేండ్ల పదవి కాలంలో జార?ండ్‌, ఉత్తర ఖండ్‌, ‌చత్తీస్‌ ‌ఘడ్‌ ‌రాష్ట్రా లను ఇచ్చిన ఎన్డీఏ, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందన్నారు. తెలంగాణ పోరాటాలను, త్యాగాలను చిన్న చూపు చూసిందన్నారు. తెలంగాణ ఏర్పాటు పై అవగాహన లేకుండా ప్రధాని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ ‌లో ఇచ్చిన వాగ్ధానాన్ని సోనియా గాంధీ నెలబెట్టుకున్నారని చెప్పారు. ఏపి లో కాంగ్రెస్‌ ‌చచ్చినా.. కేంద్రంలో అధికారం కోల్పోయిన ఇచ్చిన మాట నెలబెట్టుకునారన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోతే, ఆ బాధ తెలిసిన తల్లిగా, బిడ్డలు ఇక బలిదానాలు చేసుకోవద్దని 2009 లో రాష్ట్ర ఏర్పాటుకు విధాన పర నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ప్రధానిగా తనను, రాష్ట్రంలో నలుగురు బిజేపి ఎంపీలను గెలిపించిన తప్పుకు తెలంగాణ ప్రజలకు మోడి అవమానిస్తున్నారని చెప్పారు.

కనీసం పార్లమెంట్‌ ‌లో జరిగే చర్చలు, ఓటింగ్‌ ‌పక్రియ పై అవగాహన లేకుండా ప్రధాని మాట్లాడుతున్నారన్నారు. ‘తెలంగాణ బిల్లునే కాదు, ఏ బిల్లు అయినా ఆమోదానికి వచ్చినప్పుడు తలుపులు మూసే ఓటింగ్‌ ‌చేస్తారు. అసెంబ్లీలోనూ ఇదే రీతిలో తలుపులు మూసి ఓటింగ్‌ ‌చేస్తారు. ఇది చట్ల సభల నిబంధన. ఈ చిన్న విషయంపై అవగాహన లేని అజ్‌ఒని ప్రధాని ఉండడం దేశానికి అవమానం.’ అని మండిపడ్డారు. తెలంగాణ బిల్లు సందర్భంలో ఓటింగ్‌ ‌పట్టుబట్టడంతో, తలుపులు మూసి ఓటింగ్‌ ‌పక్రియ చేపట్టారని చెప్పారు. ఉభయ సభల్లో ఏపి విజభజన చట్టంపై సంపూర్ణ చర్చలు జరిగాయన్నారు. లోక్‌ ‌సభలో తెలంగాణ బిల్లు పై చర్చ అవసరం లేదని, బిల్లును ఆమోదించాలని అప్పటి విపక్ష నేత సుష్మా స్వరాజ్‌ ‌స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. రాజ్య సభలో ఏపి పునర్విభజన బిల్లుపై ఇప్పటి చైర్మన్‌ ‌వెంకయ్య నాయుడు చర్చలో పాల్గొన్నారని చెప్పారు. ఇరు రాష్ట్రాలకు 10 ఏండ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని, ఏపి కి ప్రత్యేక హోదా విషయంలో సవరణలు, సూచనలు చేశారన్నారు. అయితే, నేడు ఉభయ సభల్లో మోడి వ్యాఖ్యలు వింటే, స్వర్గంలో ఉన్న సుష్మా స్వరాజ్‌ ఆత్మ కూడా ఘోశిస్తుందన్నారు. విషయ పరిజ్ఞానం లేకపోతే రాజ్య సభ చైర్మన్‌ ‌వెంకయ్య నాయుడితో చర్చించాలన్నారు.

తెలంగాణ కోసం పదవి త్యాగం చేయకుండ పారపోయి మోడి వెనకాల దాక్కున్న కిషన్‌ ‌రెడ్డికి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. మోడి, ఆయన సంఘాన్ని చూస్తేనే, వాళ్లంత తెలంగాణ ద్రోహులని అర్ధమవుతుందన్నారు. పార్లమెంట్‌ ‌లో మోడి వ్యాఖ్యలన్ని తెలంగాణ బిజేపి ఎంపీలు సమర్ధిస్తున్నారా? లేక ఖండిస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వడాన్న వ్యతిరేకించిన మోడని తప్పుబడతారో లేదో చెప్పాలన్నారు. వెంటనే కిషన్‌ ‌రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ‘మోడి, అమిత్‌ ‌షా, అదానీ, అంబానీలు దుష్ట చతుష్టం. ఈస్ట్ ఇం‌డియా కంపెనీ లాగా దేశాన్ని ఆక్రమించుకునేందుకు ప్రారంభమైండ్రు. ప్రధాని గుజరాత్‌ ‌వ్యక్తి కాబట్టి ఆయనకు తెలంగాణ త్యాగాలు, చరిత్ర పట్ట అవగాహన ఉండకపోవచ్చన్నారు. కానీ, తెలంగాణకు చెందిన బిజేపి నేతలకు తెలియదా? అని నిలదీశారు. వల్లభాయి పటెల్‌ ‌తో బిజేపికి, మోడికి ఏం సంబంధం అన్నారు. ఆయన కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని నెహ్రూ ఆదేశాలతో హోం మంత్రి వల్లభాయి .పటేల్‌ ‌పోలీస్‌ ‌యాక్షన్‌ ‌జరిపి తెలంగాణ ను భారత్‌ ‌లో విలీనం చేశారని చెప్పారు. అంతేకానీ, ప్రధానికి తెలియకుండ హోం మంత్రి నిర్ణయాలు తీసుకుంటాడా? అని ప్రశ్నించారు. చైనాకో, పాకిస్థాన్‌ ‌కో దేశాన్ని తాకట్టు పెట్టే మోడి అంటి ప్రధాని దేశానికి అవసరమా? అని మండిపడ్డారు. తాత్కాలిక రాజకీయ లబ్ధికోసం ఏండ్ల చరిత్ర కలిగిన తెలంగాణ వీరులు, త్యాగధనులను చట్ట సభల ద్వార కించపరుస్తున్నారన్నారు. నరేంద్ర మోడి తెలంగాణ ద్రోహి, వ్యతిరేకి అని నిరూపించుకున్నారన్నారు. మోడికి ఆపద వచ్చిన్పుడల్లా, పదవిని కాపాడుకోవాల్సి సందర్భంలో నెహ్రు, గాంధీ కుటుంబాలను అడ్డం పెట్టుకొని బతకాలని చూస్తుంటాడన్నారు. అడుక్కునే వాళ్లు బతుకు దేరువుకోసం దేవుడిపై కీర్తనలు పడినట్లు… ఓట్లు కావాల్సినప్పుడు గాంధీ, నెహ్రు, వల్లభాయి పటేల్‌ ‌గురించి మాట్లాడుతారని విమర్శించారు.

Leave a Reply