Take a fresh look at your lifestyle.

‌ప్రజల జీవితాలను కాపాడుతున్నారు

డాక్టర్స్‌డే సందర్భంగా వారి సేవలు గుర్తు చేసుకున్న ప్రధాని

కోవిడ్‌19 ‌మహమ్మారి నియంత్రణలో డాక్టర్ల పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు. డాక్టర్లు స్పూర్తిదాయక పోరాటం చేస్తున్నారన్నారు. వారు చేస్తున్న కృషి కారణంగానే ఇవళా ప్రజలు కొరోనాను జయిస్తున్నారని అన్నారు.  వారి జీవితాలను ప్రమాదంలో పెట్టి, ప్రజల జీవితాలను కాపాడుతున్నారన్నారు.  డాక్టర్స్ ‌డే సందర్భంగా ప్రధాని  ట్విట్టర్‌లో స్పందించారు.

డాక్టర్లకు ఇండియా సెల్యూట్‌ ‌చేస్తున్నదని, కోవిడ్‌19‌పై పోరులో డాక్టర్లు అసాధారణ పోరాటం చేస్తున్నారన్నారు.  తల్లులు జన్మనిస్తే, డాక్టర్లు పునర్‌ ‌జన్మను ప్రసాదిస్తారని ఓ వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు. డాక్టర్‌ ‌బీసీ రాయ్‌ ‌జయంతిని.. డాక్టర్స్ ‌డేగా సెలబ్రేట్‌ ‌చేసుకుంటారు.  జూలై ఒకటవ తేదీని చార్టెడ్‌ అకౌంటెంట్స్ ‌డే కూడా గుర్తిస్తారు.  ఆర్థికవ్యవస్థ ఆరోగ్యకరంగా, పారదర్శకంగా ఉండేందుకు సీఏల పాత్ర విశేషమైంద న్నారు. దేశానికి సీఏలు చేస్తున్న సేవలు విలువైనవన్నారు.

Leave a Reply

error: Content is protected !!