Take a fresh look at your lifestyle.

ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి తప్ప …అహంభావం ఉండకూడదు

  • కొరోనా కష్ట కాలంలో పోలీసుల సేవలు ప్రశంసనీయం
  • నిరంతర యోగాతో వొత్తిడిని జయించాలి
  • ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ ‌పరేడ్‌లో ప్రధాని మోదీ సందేశం

ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి తప్ప అహంభావం ఉండకూడదని ప్రధాని మోదీ అన్నారు. కొరోనా కట్టడిలో పోలీసులు ముందుండి పోరాడుతున్నారని కితాబిచ్చారు. హైదరాబాద్‌లోని సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌జాతీయ పోలీస్‌ అకాడలో నిర్వహించిన ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ ‌పరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రధాని మాట్లాడారు. జాతీయ పోలీస్‌ అకాడలో శుక్రవారం 131 మంది ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ ‌పరేడ్‌ ‌జరిగింది. ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశమిచ్చారు. యోగా, ప్రాణాయామం ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని అన్నారు. రు గుండె నుంచి ఏ పని చేసినా..దాని వల్ల రు లబ్ది పొందుతారన్నారు. ఎంత పని ఉన్నా..రు వొత్తిడికి లోనుకారని ప్రధాని తన సందేశంలో తెలిపారు. మనసులోనూ యోగా చేయడం చాలా మంచి పద్ధతని చెప్పారు. ప్రజా సేవలో ఉండే అధికారులు ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని మోదీ తెలిపారు.

పనిభారం, వొత్తిడి ప్రభావం ఆరోగ్యంపై పడకుండా చిట్కాలు పాటించాలన్నారు. కొరోనా సంకట పరిస్థితుల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయం అని కితాబునిచ్చారు. వైరస్‌ ‌కట్టడిలో పోలీసులే ముందుండి పోరాడుతున్నారని, కొరోనా వేళ మానవతా దృక్పథంతో సేవలందిస్తున్నారని, కష్ట కాలంలో పోలీసుల మానవీయ కోణం ప్రజలకు తెలిసిందని ప్రధాని అన్నారు. ఈ కష్టకాలంలో పోలీసుల పాత్రను చరిత్రలో లిఖించారని, కొరోనా కట్టడిలో పోలీసులు ముందుండి పోరాడుతున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. కొరోనా సంకట స్థితిలో పోలీసుల సేవలు ప్రశంసనీయమన్నారు. ఇండోర్‌లో చాలా మంది పోలీసులు కొరోనా బారిన పడ్డారని, ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఐపీఎస్‌ ‌ప్రొబేషనర్లను గతంలో ఇంటికి ఆహ్వానించే వాడినని, కానీ కోవిడ్‌ ‌కారణంగా ముఖాముఖి కలుసుకోలేకపోతున్నానని, త్వరలోనే వారితో సమావేశ మవుతానని మోదీ అన్నారు.

పనిచేసే చోట ఉపాధ్యాయులు, నిపుణులతో నెలకోసారైనా భేటీ కావాలన్నారు. ఈ ఏడాది 131 మంది ఐపీఎస్‌ అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 121 మంది 2018 బ్యాచ్‌కు చెందినవారు కాగా.. మరో 10 మంది 2017 బ్యాచ్‌కు చెందినవారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 28 మంది మహిళా ప్రొబేషనర్లు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 11 మందిని తెలంగాణకు, ఐదుగురిని ఏపీకి కేటాయించారు. పాసింగ్‌ ఔట్‌ ‌పరేడ్‌కు తమిళనాడు కేడర్‌కు చెందిన కిరణ్‌ ‌శృతి నాయకత్వం వహించారు. కేంద్ర •ం మంత్రి అమిత్‌షా, సహాయక మంత్రి కిషన్‌రెడ్డి, జితేంద్రసింగ్‌, ‌వీడియోకాన్ఫరెన్స్ ‌ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply