Take a fresh look at your lifestyle.

సైనికులతో కలసి ప్రధాని మోడీ దీపావళి సంబురాలు ఆత్మస్థయిర్యం నింపేలా భాషణం

జమ్మూ, నవంబర్‌ 5 : ఈ ‌యేడు దీపావళి వేడుకల్లోనూ ప్రధాని మోడీ సరిహద్దు సైనికులతో కలిసి పంచుకున్నారు. వారితో కలసి గడిపారు. జమ్మూకశ్మీరులోని రాజౌరీ జిల్లా నౌషెరా ఆర్మీ క్యాంపులో గురువారం ప్రధాని నరేంద్రమోదీ సైనికులతో కలిసి దీపావళి ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ వొచ్చారు. అక్కడి నుంచి రాజౌరీ జిల్లా నౌషెరా సరిహద్దు నియంత్రణ రేఖ వద్దకు ప్రధాని మోదీ వొచ్చారు. 2014లో ప్రధానమంత్రి అయిన నరేంద్రమోదీ నాటి నుంచి ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని సైనికులతో కలిసి జరుపుకునేవారు.రోమ్‌, ‌యూకేలలో 5రోజుల పాటు పర్యటించి కాప్‌ 26 ‌వాతావరణ సదస్సులో పాల్గొని వొచ్చిన మోదీ గురువారం సరిహద్దులకు వొచ్చారు. ఆర్మీ సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకునే అలవాటును కొనసాగిస్తూ గురువారం ఉదయాన్నే మోదీ నౌషెరా పట్టణానికి చేరుకున్నారు. మోదీ ఆర్మీ దుస్తులు ధరించి, తలపై టోపి పెట్టుకొని ఆర్మీ శిబిరాలను సందర్శించారు. జమ్మూకు రాగానే మోదీ ఆర్మీ ఉన్నతాధికారులు, ఇతర జవాన్లను కలిశారు. మోదీ సైనికులతో కలిసి దీపావళి జరుపుకునేందుకు సరిహద్దు ఔట్‌పోస్టులను సందర్శించారు. ఆర్మీ జవాన్లతో కలిసి ప్రధాని మోదీ దీపావళి జరుపుకోవడం ఇదే తొలిసారి కాదు. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి ప్రధాని మోదీ దీపావళి రోజున సరిహద్దు ఔట్‌పోస్టులకు నిత్యం వస్తుంటారు. అంతకుముందు ఆయన ఉత్తరాఖండ్‌, ‌పంజాబ్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌జమ్మూకశ్మీర్‌ ‌వంటి రాష్ట్రాల్లో పర్యటించారు. ప్రధాని మోదీ 2019లో కూడా రాజౌరీలో సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.

ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఎంఎం ‌నరవాణె ఈ ప్రాంతాలపై వైమానిక నిఘా పెట్టారు. జమ్మూ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ప్రస్తుతమున్న భద్రతా పరిస్థితుల గురించి ప్రధానికి ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌వివరించారు. ప్రధాన మంత్రి దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు. ఈ వెలుగుల పండుగ వి• జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని ప్రధాన మంత్రి ట్వీట్‌ ‌చేశారు. దేశంలోని 130 కోట్ల మంది శుభాకాంక్షలు తీసుకుని వి• ముందుకు వచ్చానని అన్నారు. పండగనాడు ఆత్మీయుల సమక్షంలో జరుపుకోవడం ఆనవాయితీ అంటూ..నా ఆత్మీయులు వి•రేనని అన్నారు. వి• కారణంగా ప్రజలు నిశ్చింతంగా ఉన్నారని అన్నారు. అలాగేఅత్యాధునిక సైనికి సంపత్తిని ఆర్టీకి అందచేస్తున్నామని అన్నారు.

Leave a Reply