అహ్మదాబాద్‌లోని స్కూల్లో వోటేసిన ప్రధాని
అహ్మదాబాద్,డిసెంబర్5 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ ఎన్నికల్లో ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ రెండో దశ ఎన్నికలకు సోమవారం ఓటింగ్ జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ప్రధాని మోదీ ఓటు వేశారు. దీనికి ముందు ప్రధాని మోదీ రాజ్‌భవన్ నుంచి ఓటింగ్ కేంద్రానికి బయలుదేరారు. పాఠశాలకు వెళ్లే దారిలో..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ వెళ్తున్న సమయంలో ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి నంబర్ వచ్చిన తర్వాత ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని కూడా అభినందిస్తున్నాను. ముందుగా ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరారు.
రెండో దశకు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని గుజరాత్ ప్రజలను, ముఖ్యంగా మహిళలు, యువతను నేను అభ్యర్థించారు.ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని మోడీ కోరారు. ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అహ్మదాబాద్‌లో ఓటు వేసారు.
ఓటేసిన మోదీ తల్లి, సోదరుడు
అహ్మదాబాద్ :ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌లోని రేసాన్ ప్రైమరీ స్కూల్లో ఆమె ఓటు వేశారు. 99 ఏళ్లున్న హీరాబెన్ మోడీ.. వీల్‌ఛైర్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఆమెతో పాటుగా అహ్మదాబాద్‌లో ప్రధాని సోదరుడు సోమభాయ్ కూడా తన ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఇక మోడీ అహ్మదాబాద్‌లోని రాణిప్ ప్రాంతంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు . కాలినడక పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన క్యూలైన్లో నిల్చుని ఓటేశారు.