సైంటిస్టులను కోవాక్సిన్ వివరాలను అడిగి తెలుసుకున్న ప్రధాని
కొరోనా వ్యాక్సిన్ టూర్లో భాగంగా ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్‌కు వొచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో దిగిన ఆయనకు హకీంపేట్ ఎయిర్ ఆసిఫ్ చీఫ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్వాగతం పలికారు.
అనంతరం అక్కడినుంచి ఆయన నేరుగా జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌ను సందర్శించారు. అక్కడ అభివృద్ధి చేస్తున్న కోవ్యాక్సిన్ వివరాలను సైంటిస్టులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ టూర్ అనంతరం పుణెకు వెళ్లారు.