శామీర్‌పేటలోని భారత్ బయోటెక్ సందర్శన
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోది శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం….శనివారం డిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి శామీర్‌పేట సమీపంలోని భారత్ బయోటెక్‌ను మోదీ సందర్శించనున్నారు. కోవిడ్ నివారణకు సంబంధించి భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కొవాగ్జిన్ టీకా పురోగతిని పరిశీలించి అనంతరం ప్రధాని పూణే పర్యటనకు వెళ్లనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.
మరోవైపు, జీహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. జీహెచ్ఎంసి ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఇప్పటికే బీజేపీ జాతీయ నేతల పర్యటనలు ఖరారయ్యాయి. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, 28న యూపీ సీఎం ఆదిత్యనాథ్ దాస్ పాతబస్తీలో, 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వీరంతా జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే రోడ్‌షోలలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా హైదరాబాద్‌కు రానుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.