Take a fresh look at your lifestyle.

ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పండి

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరిన ప్రధాని మోడీ
ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థుల రక్షణపై చర్చ
యుద్ధానికి దారితీసిన పరిస్థితులను ప్రధానికి వివరించిన రష్యా అధ్యక్షుడు
రష్యా అధ్యక్షులు పుతిన్‌తో ప్రధాని మోడీ గురువారం రాత్రి ఫోన్‌ ‌ద్వారా సంభాషించారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతల తక్షణ విరమణకు మోడీ విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌, ‌రష్యా మధ్య ఉద్రిక్తతల గురించి మోడీకి పుతిన్‌ ‌వివరించారు. అలాగే రష్యా, ఉక్రెయిన్‌ల్లో ఉన్న భారతీయ విద్యార్థుల రక్షణ, క్షేమం గురించి పుతిన్‌కు మోడీ గుర్తు చేశారు. పుతిన్‌, ‌మోడీ ఫోన్‌ ‌సంభాషణ గురించి ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించింది.

సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని పుతిన్‌కు మోడీ విజ్ఞప్తి చేసినట్లు ప్రకటన తెలిపింది. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకుని రావడానికి దౌత్యపరమైన చర్యలు, సంభాషణలు వంటి అన్ని చర్యలు ద్వారా కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు. రష్యా, నాటో కూటమి మధ్య విభేదాలు నిజాయితీతో కూడిన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయని మోడీ పునరుద్ఘాటించారని ప్రధానమంత్రి కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది.

Leave a Reply