- గతానికి భిన్నంగా కార్యక్రమాలు
- ఎంపిలో ఆన్లైన్లో గృహాలు ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ
మధ్య ప్రదేశ్‌లో ప్రధాన మంత్రి గ్రాణ ఆవాస్ యోజన పథకం క్రింద నిర్మించిన 1.75 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన ప్రధాని మోదీ. గతంలో ప్రభుత్వం వెంట పేదలు పరుగెత్తే వారని, ప్రస్తుతం ప్రభుత్వం పేదల వద్దకు వెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం మధ్యప్రదేశ్‌లో ప్రధాని ఆవాస్ యోజన కింద నిర్మించిన 1.75లక్షల గృహాల ప్రవేశ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలువురు లబ్దిదారులతో మాట్లాడారు. 2 లక్షల కుటుంబాలకు అభినందనలు, ఈ సారి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అన్నారు. కొరోనా మహమ్మారి లేకపోతే ప్రధాన సేవకుడు ఈ రోజు జీవితంలోని గొప్ప ఆనంద క్షణాల్లో మధ్య ఉండేవాడన్నారు. గతంలో పేదలు ప్రభుత్వం వెనుక పరుగులు పెట్టారని, ఇప్పుడు ప్రభుత్వం పేదల వద్దకు వెళ్తోందన్నారు. ఎవరి ఇష్టానికి అనుగుణంగా జాబితాలో పేరు జోడించడం, తీసివేయడం చేయలేమని, ఎంపిక నుంచి నిర్మాణం వరకు శాస్త్రీయ, పారదర్శక విధానాన్ని అవలంబిస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రాణ పేదలకు గృహ నిర్మాణ పథకం పారదర్శకతకు పెద్ద పీట వేస్తోందని, ప్రభుత్వం ఇప్పుడు పేదల చెంతకు చేరుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2014లో అంతకు ముందు ఉన్న అనుభవాలను అధ్యయనం చేసినట్లు తెలిపారు. పాత పథకంలో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. పీఎం ఆవాస్ యోజనను పూర్తిగా సరికొత్త ఆలోచనతో అమలు చేస్తున్నట్లు తెలిపారు. గృహ ప్రవేశానికి లబ్దిదారుల ఎంపిక పక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. గతంలో పేదలు ప్రభుత్వం వెంట పరుగులు తీసేవారని, ఇప్పుడు తన ప్రభుత్వం ప్రజల చెంతకు చేరుతోందని చెప్పారు. ఇతరుల కోరిక మేరకు జాబితా నుంచి ఎవరి పేరునైనా తొలగించడం కానీ, జాబితాలో ఎవరి పేరునైనా చేర్చడం కానీ జరగదని చెప్పారు. లబ్దిదారుల ఎంపిక దగ్గర నుంచి నిర్మాణం వరకు శాస్త్రీయ, పారదర్శక విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు. స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మెటీరియల్‌ను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పీఎం ఆవాస్ యోజన అయినా, స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం క్రింద మరుగుదొడ్ల నిర్మాణం అయినా పేదలకు లబ్ది చేకూర్చడం మాత్రమే కాకుండా ఉపాధి, సాధికారత కల్పిస్తున్నాయన్నారు. ఈ పథకాలు గ్రాణ ప్రాంతాల్లో నివసిస్తున్న అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ముల జీవితాలను మార్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. మోదీ ఈ సందర్భంగా కొందరు లబ్దిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇంకా మధ్య ప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్•, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు.