- మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతర కృషి
- వర్చువల్ విధానంలో కంటెయినర్ ట్రైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
మన దేశంలో వివిధ ప్రాంతాల్లో నూతన అభివృద్ధి కేంద్రాలు వృద్ధి చెందడానికి ఈస్టర్న్, వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు దోహదపడతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశాభివృద్ధిలో ఇవి పెను మార్పులు తీసుకొస్తాయన్నారు. మన దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మనం చేస్తున్న నిరంతర కృషి నేడు నూతన వేగాన్ని అందుకుందని చెప్పారు. మేవారి-మాడార్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీంతో ఈస్టర్న్, వెస్టర్న్ డెడికేటెడ్ కారిడార్ల మధ్య నిరంతరాయ అనుసంధానం సాధ్యమైంది. న్యూ అటేలీ-న్యూ కిషన్‌గఢ్ మార్గంలో డబుల్ స్టాక్ లాంగ్ హౌల్ కంటెయినర్ ట్రైన్‌ను కూడా ప్రారంభించారు. రేవారి-మాడార్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రై కారిడార్ 306 కిలోవి•టర్ల పొడవున ఉంది.
కంటెయినర్ ట్రైన్ పొడవు 1.5 కిలోవి•టర్లు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈస్టర్న్, వెస్టర్న్ డెడికేటెడ్ కారిడార్లు భారత దేశానికి గేమ్ ఛేంజర్స్ అని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నూతన అభివృద్ధి కేంద్రాలు వృద్ధి చెందడానికి ఇవి దోహదపడతాయని చెప్పారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో అభివృద్ధి వనరులుగా ఇవి పని చేస్తాయన్నారు. దేశంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిరంతరం జరుగుతున్న కృషికి నూతన వేగం జత కలిసిందన్నారు. గత కొద్ది రోజుల్లో దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఎయిమ్స్ నిర్మాణం, ఒడిశాలోని సంబల్పూర్లో ఐఐఎం నిర్మాణం ప్రారంభమైనట్లు తెలిపారు. సంవత్సరం ప్రారంభం మంచిగా ఉంటే, రాబోయే సంవత్సరమంతా గొప్పగా ఉంటుందన్నారు. ఇదంతా మనం కోవిడ్-19తో పోరాడుతున్న సమయంలో సాధించామని చెప్పారు. ఎమర్జెన్సీ వినియోగానికి రెండు మేడ్ ఇన్ ఇండియా కోవిడ్-19 వ్యాక్సిన్లకు అనుమతులు రావడంతో దేశ ప్రజల్లో నూతన విశ్వాసం వచ్చిందని మోదీ తెలిపారు.