Take a fresh look at your lifestyle.

ఐదేళ్ల చిన్నారి..పియానో వాద్యం ఫిదా అయిన ప్రధాని మోదీ

తిరువనంతపురం, ఏప్రిల్‌ 25 : 5 ఏళ్లు కూడా ఉండవు గానీ ఈ చిన్నారి ఎంత అద్భుతంగా సంగీతం వాయిస్తుందో చూడండి. షలమలీ అనే ఈ చిన్నారి సంగీత స్వరాలు నేర్చుకుని, పియానోపై వాటిని ఎంతో చక్కగా పలికించడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ ‌డియాలో తెగ వైరల్‌ అవుతోంది. తన తల్లి పాడుతున్న పాటకు వినసోంపుగా స్వరాలు పలికించింది ఆ చిన్నారి. పల్లవాగల పల్లవియాలి అంటూ ఆమె తల్లి పాట పాడడాన్ని, చిన్నారి స్వరాలు అందించడాన్ని వీడియోలో చూడొచ్చు.ఏకంగా ప్రధాని మోడీ సైతం ఈ చిన్నారి టాలెంట్‌ ‌కు ఫిదా అయ్యారు.

ఈ వీడియోను అనంత కుమార్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌ ‌లో పోస్ట్ ‌చేయగా.. దీన్ని చూసిన ప్రధాని రీట్వీట్‌ ‌చేశారు. ‘ఈ వీడియో ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వును పూయిస్తుంది. అసాధారణ టాలెంట్‌ ఉన్న షలమలీకి శుభాకాంక్షలు‘ అని మోడీ పేర్కొన్నారు. పాటకు స్వరాలు అద్భుతంగా ఉన్నాయని నెటిజన్స్ ‌కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ పాటను కన్నడ రచయిత కేఎస్‌ ‌నరసింహ స్వామి రచించారు.

Leave a Reply