Take a fresh look at your lifestyle.

దేవాభివృద్ధిని అడ్డుకునే విష ప్రచారం

  • 8 ఏళ్ల ఎన్‌డిఎ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట
  • మరో 25 ఏళ్లపాటు అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి
  • కటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే
  • భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నం
  • బిజెపి పదాధికారుల సమావేశంలో వర్చువల్‌గా ప్రసంగంలో ప్రధాని మోడీ

న్యూ దిల్లీ, మే 20 : దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విష ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వారి ఉచ్చులో పడొద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు.  రాజస్థాన్‌ ‌రాజధాని జైపుర్‌లో జరుగుతున్న భాజపా జాతీయ పదాధికారుల సమావేశంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. 8 ఏళ్ల భాజపా పాలన పేదల సంక్షేమానికి, సామాజిక భద్రతకు ఎంతో కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.  కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. దీనికై చిన్నచిన్న ఉద్రిక్త ఘటనల కోసం వెతుకుతున్నాయని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కుటుంబ పార్టీలపై నిరంతరం పోరాటం చేయాలన్నారు. 2014 తర్వాత దేశ ప్రజలు నైరాశ్యం నుంచి బయటపడ్డారని.. నేడు ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఉన్నారని మోదీ చెప్పారు. వారి ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని పదాధికారులకు సూచించారు. ప్రభుత్వ వ్యవస్థలపై అంతకుముందు ప్రజలు కోల్పోయిన విశ్వాసాన్ని భాజపా మళ్లీ తీసుకువచ్చిందన్నారు. నేడు ప్రపంచమంతా భారత్‌ ‌వైపు ఆసక్తిగా చూస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా..రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. వాటి కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ నెలతో 8 ఏళ్లు పూర్తిచేసుకుంటుంది.

- Advertisement -

ఈ ఎనిమిదేళ్ల పాలనలో ఎన్నో విజయాలను అందుకున్నాం. పేదల సంక్షేమం, సామజిక న్యాయం, సుపరిపాలనకు ఎంతో కృషిచేశాం. భాజపా అంటే దేశ ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. దేశ ప్రజలంతా ఎంతో విశ్వాసంతో, ఆశగా ఎదురు చూస్తున్నారుని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారులకు అందేలా కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. దేశాభివృద్ధిని అడ్డుకునే విష ప్రయత్నాలు చేస్తున్న వారిని పట్టించుకోకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని భాజపా పదాధికారులకు సూచించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులకు అందేలా కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. ఈ క్రమంలోనే దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం ఎదుర్కుంటున్న సవాళ్లను అధిగమించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తుందని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య భారతంతో రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశిరచాల్సిన ఆవశ్యకత బీజేపీపై ఉందన్నారు. వాటి కోసం నిరంతరం శ్రమించాల్సిన సమయం బీజేపీకి ఇదేనని పేర్కొన్నారు. దీంతో వొచ్చే 25 ఏళ్లపాటు తామే అధికారంలో ఉండాలని భావిస్తున్నట్టు మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. భాషా వైవిద్ధ్యం భారత దేశానికి గర్వకారణమని, అయితే దీనిపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతుండటం కొద్ది రోజులుగా మనం చూస్తున్నామని మోదీ చెప్పారు. ప్రతి ప్రాంతీయ భాషలోనూ భారతీయ సంస్కృతి ప్రతిబింబాన్ని బీజేపీ చూస్తుందని, అవి పూజించదగినవని పరిగణిస్తుందని చెప్పారు. భారత దేశ మెరుగైన భవిష్యత్తుకు ఇది అనుసంధానమని తెలిపారు. అన్ని ప్రాంతీయ భాషలకు జాతీయ విద్యా విధానం  ప్రాధాన్యమిచ్చిందన్నారు. ప్రాంతీయ భాషల పట్ల మన నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా, పలువురు సీనియర్‌ ‌నేతలు పాల్గొన్నారు.

Leave a Reply