Take a fresh look at your lifestyle.

థర్డ్‌వేవ్‌ ‌వ్యాప్తికి మనమే కారణం కారాదు

  • కొరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి
  • పర్యాటక ప్రదేశాల్లో ప్రజలు గుంపులుగా తిరగడం ఆందోళనకరం
  • నిపుణుల హెచ్చరికలు బేఖాతర్‌ ‌చేయడం తగదు
  • సత్వర వ్యాక్సినేషన్‌ ‌పక్రియ చేపట్టాలి
  • ఆక్సిజన్‌ ‌ప్లాంట్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి
  • కొరోనాపై ఈశాన్య రాష్ట్రాల సిఎంలతో సమీక్షలో ప్రధాని మోడీ

వైరస్‌ ‌వేగంగా రూపును మార్చుకొంటున్నదని, మ్యుటేషన్‌ను ఖచ్చితత్వంతో పర్యవేక్షించాలని, వేరియంట్‌లు అన్నిటిని గమనిస్తూ ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మ్యుటేషన్లను, అవి కలుగజేసే ప్రభావాలను నిపుణులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితిలో వైరస్‌ ‌నియంత్రణ, చికిత్సలు కీలకం అవుతాయని ప్రధాన మంత్రి చెప్తూ, కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజలు భౌతిక దూరాన్ని పాటించడం, మాస్క్‌ను ధరించడం, టీకామందును వేసుకోవడం వంటి జాగ్రత్తలతో మంచి ప్రయోజనాలు ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. అదే విధంగా టెస్టింగ్‌, ‌ట్రాకింగ్‌, ‌ట్రీట్‌మెంట్‌ అనేది సత్ఫలితాలను ఇస్తున్నట్టు కూడా నిరూపణ అయిందని ఆయన అన్నారు. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోవిడ్‌-19 ‌పై ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. కోవిడ్‌ ‌మహమ్మారి ని సంబాళించడం లో సకాలం లో చర్యలు తీసుకొన్నందుకు గాను ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు ప్రధానిని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలు దుర్గమ ప్రాంతాల్లో పరీక్షలను నిర్వహించడానికి, చికిత్సను అందించడానికి, టీకామందును ఇప్పించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం లోను, మహమ్మారికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం లోను అక్కడి ప్రజలు, ఆరోగ్య శ్రామికులు, ప్రభుత్వాలు కఠోరంగా పాటుపడినందుకు కొనియాడారు. కొన్ని జిల్లాలలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంపై ప్రధాన మంత్రి ఆందోళన వ్యక్తం చేస్తూ, క్షేత్ర స్థాయిలో కఠిన చర్యలను తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. పరిస్థితిని ఎదుర్కునడానికి కట్టడి విధి విధానాలను అమలు పరచాలంటూ ఆయన మరో మారు స్పష్టం చేశారు.

ఈ విషయంలో గత ఒకటిన్నర సంవత్సరాల కాలం అనుభవాన్ని, ఉత్తమ అభ్యాసాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. పర్యటన రంగం పైన, వ్యాపార రంగం పైన మహమ్మారి చూపిన ప్రభావాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, పర్వత ప్రాంత పట్టణాలలో సరైన ముందు జాగ్రత చర్యలను పాటించకుండానే గుంపులు గుంపులుగా గుమికూడటం తగదని హెచ్చరిక చేశారు. థర్డ్ ‌వేవ్‌ ‌వొచ్చే కంటే ముందే ఆనందంగా గడపాలని ప్రజలు కోరుకొంటున్నారనే వాదనను తోసిపుచ్చుతూ, థర్డ్ ‌వేవ్‌ ‌దానంతట అదే రాదనే విషయాన్ని గ్రహించవలసిన అవసరం ఉందన్నారు. థర్డ్ ‌వేవ్‌ను ఏ విధంగా అడ్డుకోవాలనేదే ఇప్పుడు ప్రధానమని ఆయన చెప్పారు. అజాగ్రతగా ఉండకూడదని, గుంపులు గుంపులుగా చేరకూడదని, అలా చేస్తే కేసులు అమాంతం పెరిగిపోతాయని నిపుణులు పదే పదే హెచ్చరికలను చేస్తున్నారని ఆయన అన్నారు. అవసరం లేని చోట్లకు తండోప తండాలుగా వెళ్ళడం మానుకోవాలని ఆయన గట్టిగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘అందరికీ టీకా మందు – అందరికీ ఉచితం’ ప్రచార ఉద్యమంలో ఈశాన్య ప్రాంతాలకు సైతం సమానమైన ప్రాముఖ్యం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. మనం టీకాకరణ పక్రియను వేగవంతంగా అమలు జరపవలసిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు.

టీకా వేయించుకోవడం, ప్రజలను జాగృతం చేయడం.. వీటికి సంబంధించి అపోహలను దూరం చేసే విషయమై ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, దీని కోసం సామాజిక సంస్థలు, విద్యా సంస్థ్ణలు, ప్రముఖులతో పాటు ధార్మిక సంస్థల సహాయాన్ని అభ్యర్థించాలని సూచించారు. వైరస్‌ ఏయే ప్రాంతాలలో వ్యాప్తి చెందుతుందన్నది అంచనా వేసి, ఆయా ప్రాంతాలలో ప్రజలకు టీకా మందును ఇప్పించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. పరీక్షలను నిర్వహించడానికి, చికిత్సలను అందించడానికి ఉద్దేశించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిన 23,000 కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని గురించి ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, ఈ ప్యాకేజీ ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో ఆరోగ్య రంగ సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనను బలపరచడంలో సాయపడగలుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్యాకేజీ ఈశాన్య ప్రాంత రాష్ట్రాల లో పరీక్షల నిర్వహణ, రోగ నిర్ధారణ, జన్యు క్రమ ఆవిష్కరణ లను శీఘ్రతరం చేస్తుందన్నారు.

ఈశాన్య ప్రాంతంలో పడకల సంఖ్యను, ఆక్సీజన్‌ ‌సంబంధిత సౌకర్యాలను, శిశువైద్య సంరక్షణ సంబంధిత మౌలిక సదుపాయాలను వెంటనే పెంపొందించాలని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. దేశం అంతటా పిఎమ్‌-‌కేర్స్ ‌ద్వారా వందల కొద్ది ఆక్సీజన్‌ ‌ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, మరి ఈశాన్య ప్రాంతంలో కూడాను దాదాపు గా 150 ప్లాంట్లను స్థాపించడం జరుగుతుందని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసే పక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సిఎంలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. సమష్టి ప్రయాసలతో మనం సంక్రమణను అరికట్టి తీరగలుగుతామనే ఆశను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాగాలాండ్‌, ‌త్రిపుర, సిక్కిమ్‌, ‌మేఘాలయ, మిజోరమ్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ‌మణిపుర్‌ ‌ముఖ్యమంత్రులతో పాటు అసమ్‌ ‌ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రులతో పాటు హోమ్‌ ‌శాఖ, రక్షణ శాఖ, ఆరోగ్య శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డిఒఎన్‌ఇఆర్‌) ‌శాఖ మంత్రులు, ఇతర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాలుపంచుకొన్నారు.

Leave a Reply