Take a fresh look at your lifestyle.

ప్రధాని మోడీ ‘రాజ ద్రోహం’కు పాల్పడ్డారు…!

కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ ఆరోపణ
హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా రాజీనామాకు డిమాండ్‌
‌దేశాన్ని అపకీర్తి పాలు చేయడానికి ‘‘అంతర్జాతీయ కుట్ర’’.. : బీజీపీ
కాంగ్రెస్‌ ‌ముఖ్య నాయకుడు రాహుల్‌ ‌గాంధీ ప్రధాని మోడీపై ‘రాజద్రోహం’ ఆరోపణ మోపారు. హోంమంత్రి అమిత్‌ ‌షా రాజీనామాను డిమాండ్‌ ‌చేశారు. రాహుల్‌ ‌గాంధీ ఫోన్‌ ‌నెంబర్‌ ‌పెగాసస్‌ ‌నిఘా పొటెన్షియల్‌ ‌లక్ష్యాల జాబితాలో వున్న విషయం తెలిసిందే. శుక్రవారం, గాంధీ తన ఫోన్‌లన్నీ ట్యాప్‌ ‌చేయబడ్డాయని మీడియాకి తెలిపారు. పెగసాస్‌ ‌స్పైవేర్‌ ఉపయోగించడంపై ఫోన్‌ ‌నంబర్లపై నిఘాపై న్యాయ విచారణ చేయాలని రాహుల్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ‘‘పెగసాస్‌ ‌స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌ ‌రాజ్యం ఆయుధం అని పేర్కొంది. ఈ ఆయుధాన్ని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించాల్సి ఉంది. అయితే ప్రధాని, హోమ్‌ ‌మంత్రి ఈ ఆయుధాన్ని భారత దేశంలోని సంస్థలపై ఉపయోగించారు. మోడీ ప్రభుత్వం దీన్ని రాజకీయం కోసం వాడింది. ఎన్నికలప్పుడు కర్ణాటకలో కూడా ఉపయోగించారు’’ అని రాహుల్‌ ‌గాంధీ విలేఖరులకు తెలిపారు. ఇలా చేయటాన్ని వర్ణించటానికి వున్న ‘‘ఏకైక పదం రాజద్రోహం.’’ అని రాహుల్‌ ‌గాంధీ తెలిపారు. పెగసాస్‌ ‌స్పైవేర్‌ అం‌శం శుక్రవారం కూడా పార్లమెంటులో కేంద్ర బిందువు అయ్యింది.

ఉభయ సభలను పదేపదే వాయిదా పడేలా చేసింది. రాహుల్‌ ‌గాంధీ సన్నిహితులు.. సహాయకులలో కనీసంగా ఐదుగురు ఫోన్లు నిఘాలో వున్నాయని నివేదికలో వొచ్చింది. వీరిలో అలాంకర్‌ ‌సవాయి, సచిన్‌ ‌రావుల పేర్లు వున్నాయి. రాహుల్‌ ‌గాంధీకి చెందిన రెండు నంబర్లను కూడా నిఘా కోసం ఎంపిక చేసినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. మరోవైపు శుక్రవారం రాహుల్‌ ‌గాంధీ తన ఫోన్‌లన్నీ ట్యాప్‌ ‌చేయబడ్డాయని పేర్కొన్నారు. రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ ‌నాయకుడు తన ఫోన్‌ను ట్యాప్‌ ‌చేసినట్లు భావిస్తే ప్రోబ్‌ ఏజెన్సీకి తన ఫోన్లు ఇవ్వాలని అన్నారు. పార్లమెంటును నిలిపివేయడానికి కాంగ్రెస్‌ ఈ ‌సమస్యను ఉపయోగిస్తుందని బిజెపి అధికార ప్రతినిధి రాజవర్ధన్‌ ‌రాథోడ్‌ ‌పేర్కొన్నారు. ‘‘అంతర్జాతీయ కుట్ర’’లో భాగంగా, పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌చుట్టూ మీడియా నివేదికలు ఉన్నాయని దేశాన్ని అపకీర్తి పాలు చేయడానికి ఉద్దేశించినవని మోడీ ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు అనేక మంది ప్రతిపక్ష నాయకులు నిఘా ఆరోపణలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాన్ని అనేకసార్లు వాయిదా వేయడానికి…టిఎంసి ఎంపి శాంతను సేన్‌ ‌సస్పెండ్‌కి దారితీసింది. లాభాపేక్ష లేని ఫర్బిడెన్‌ ‌స్టోరీస్‌ అనే ఫ్రెంచ్‌ ‌జర్నలిజం సంస్థ….మరియు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ‌నేతృత్వంలోని ప్రపంచ సహకార పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ఫోన్లు పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌ద్వారా నిఘాకు గురవుతున్నాయని, భారత్‌లో 300 మంది ఫోన్‌ ‌నెంబర్లు పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌నిఘాకు గురయ్యాయని జాబితా విడుదల చేసాయి.

పెగాసస్‌ ‌స్పైవెర్‌ ‌వివాదం నేపథ్యంలో కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్‌ ‌సిద్ధం చేసిన ప్రకటనను చింపి వేసిన ఒక రోజు తర్వాత, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌రాజ్యసభ ఎంపి శాంతను సేన్‌ ‌శుక్రవారం సస్పెండ్‌ అయ్యారు. గురువారం, సేన్‌ ఎగువ సభ వెల్‌ ‌లోకి పోయి మంత్రి వైష్ణవ్‌ ‌వద్ద ఉన్న కాగితాన్ని లాక్కొని చింపేసారు. స్నూపింగ్‌ ‌వివాదానికి నిరసనగా వెల్‌ ‌లోకి ప్రవేశించిన పలువురు ప్రతిపక్ష నాయకులలో సేన్‌ ‌కూడా ఉన్నారు. వైష్ణవ్‌ ‌మాట్లాడటానికి లేచినప్పుడు, సభ ‘‘జాసూసి బంద్‌ ‌కరో, బంద్‌ ‌కరో’’ నినాదాలలో రాజ్య సభ దద్దరిల్లింది. మరోవైపు మంత్రి వైష్ణవ్‌ ‌సభను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘జూలై 21, 2021న వెబ్‌ ‌పోర్టల్‌ అత్యంత సంచలనాత్మక కథనం ప్రచురించింది. ఈ కథనం చుట్టూ చాలా ఎక్కువ అంశాలు అల్లడం జరిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశానికి ఒక రోజు ముందు పత్రిక నివేదిక వొచ్చింది. ఇది యాదృచ్చికం కాదు.’’ అని తెలిపారు. గతంలో, వాట్సాప్‌లో పెగసాస్‌ ‌వాడకం గురించి ఇలాంటి కథనాలు వొచ్చాయి. ఆ కథనాలకు వాస్తవిక ఆధారం లేదు. అప్పుడు సుప్రీమ్‌ ‌కోర్టుతో సహా అన్ని పార్టీలు దీనిని ఖండించాయని మంత్రి గుర్తు చేసారు. 2021 జూలై 18 నాటి పత్రికా నివేదికలు కూడా భారత ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో బాగా స్థిరపడిన సంస్థలను కించపరిచే ప్రయత్నం చేసాయని మంత్రి అన్నారు. ‘‘మొత్తం వ్యవహారాన్ని వివరంగా చూడని వారిని మేము తప్పుపట్టలేం..అయితే నిజాలు..తర్కంపై ఆధారపడి ఈ సమస్యను పరిశీలించమని గౌరవనీయ సభ్యులందరినీ నేను కోరుతున్నాను’’ అని మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply