Take a fresh look at your lifestyle.

75‌వ ఏట అడుగిడిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌

శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, గవర్నర్‌, ‌సిఎం కెసిఆర్‌
‌రాష్ట్రపత్తి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా తదితరులు గురువారం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విధాన నిర్ణయాలను అర్థం చేసుకోవడంలో ఆయనకు గొప్ప అంతర్దృష్టి ఉందని, జాతికి రాష్ట్రపతి కోవింద్‌ ‌గొప్ప ఆస్తి అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధికి అంకితభావంతో ఆయన చేస్తున్న కృషి ఆదర్శనీయమని తెలిపారు. పేదల సాధికారతకు అంకితభావంతో పనిచేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ 1945 అక్టోబర్‌ 1‌న ఉత్తరప్రదేశ్‌లోని  కాన్పూర్‌ ‌జిల్లా పరాంఖ్‌ ‌ప్రాంతంలో జన్మించారు. 2017 జూలై 25న ఆయన భారత 14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రపతి రామ్‌నాద్‌ ‌కోవింద్‌ 75‌వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌రాజన్‌ ‌రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ’భారత రాష్ట్రపతి రామ్‌నాద్‌ ‌కోవింద్‌ ‌గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. వి•రు సంపూర్ణ ఆయురారోగ్యాలతో దేశానికి సేవలు కొనసాగించాలని ఆశిస్తున్నాను. వి• మార్గ నిర్దేశరలో దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ ‌చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు వి•కు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుతూ, జాతికి మరింత కాలం సేవ చేయాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.  ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply