Take a fresh look at your lifestyle.

వ్యవసాయ చట్టాల వెనక.. ఎలాంటి దురుద్దేశాలు లేవు

  • రైతులు, ప్రజలు వాటిపై నమ్మకం ఉంచాలి
  • ఎప్పుడో రావాల్సినవి..రాత్రికి రాత్రే తెచ్చినవి కాదు
  • అన్ని పార్టీల మేనిఫెస్టోల్లోనూ కనిపిస్తాయి
  • రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి
  • స్వామినాథ•న్‌ ‌సిఫార్సులను ఎందుకు అమలు చేయలేదు
  • మధ్యప్రదేశ్‌ ‌రైతులతో వర్చువల్‌ ‌సమావేశంలో ప్రధాని మోడీ

వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తీసుకొచ్చినవి కావని, దీని వెనుక దశాబ్దాల పాటు చర్చలు, సంప్రదింపులు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రజలు, రైతులు నమ్మకం ఉంచాలని ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థించారు. మంచి ఉద్దేశాలతోనే ఈ చట్టాలను తీసుకొచ్చామని, ఎలాంటి దురుద్దేశాలూ లేవని తేల్చి చెప్పారు. కనీస మద్దతు ధర కొనసాగుతుందని, దానికి ఎలాంటి ఆటంకమూ కలగదని పునరుద్ఘాటించారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌ ‌రైతులతో వర్చువల్‌ ‌సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర దేశాల రైతులు కొత్త కొత్త టెక్నాలజీలతో ముందుకు దూసుకెళ్తున్న వేళ మన దేశ రైతులు వెనుకబడేలా చేయడం సమంజసం కాదు. కొత్త చట్టాల గురించి ఇప్పుడు ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇవి ఎప్పుడో తీసుకుని రావాల్సిన చట్టాలు. మన రైతులు కూడా కొన్ని దశాబ్దాలుగా వీటిని డిమాండ్‌ ‌చేస్తున్నారు. గతంలో పార్టీల మేనిఫెస్టోలు చూసినా ఇవే హాలు కనిపిస్తాయి అని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కూడా మోదీ మండిపడ్డారు. వారు రాజకీయంగా లబ్ది పొందడానికి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలకు చట్టాలతో ఎలాంటి సమస్యా లేదు. కానీ వాళ్లు హా ఇచ్చిన నెరవేర్చలేని దానిని మోదీ చేసి చూపించాడన్నదే వారి బాధ. నేను చేతులు జోడించి ప్రతిపక్షాలకు ఒక్కటే చెప్పదలచుకున్నాను. ‘దయచేసి, కు క్రెడిట్‌ ‌కావాలంటే తీసుకోండి. నేను రాజకీయ పార్టీల మేనిఫెస్టోలకు క్రెడిట్‌ ఇస్తాను’ అని మోదీ అన్నారు.

వాళ్లు అధికారంలో ఉన్నపుడు స్వామినాథన్‌ ‌కమిషన్‌ ‌సిఫారసులను అమలు చేయలేదని మోదీ విమర్శించారు. తాము అధికారంలోకి వొచ్చిన తర్వాత ఆ రిపోర్ట్‌ను వెలికి తీసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ‌తప్పుడు హాల గురించి మధ్యప్రదేశ్‌ ‌రైతులకు బాగా తెలుసని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ అన్నారు. మరి అందరికీ దాని వల్ల లబ్ది కలిగిందా అని రైతులను అడిగారు. వాళ్లు చిన్న రైతులకు రుణ మాఫీ చేయలేదని, పెద్ద రైతులే దీని వల్ల లబ్ది పొందారని ఆరోపించారు. కనీస మద్దతు ధరను తొలగించే ప్రసక్తే లేదని కూడా ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఒకవేళ తమకు ఎంఎస్‌పీని తీసివేసే ఉద్దేశమే ఉంటే..ఎందుకు స్వామినాథన్‌ ‌కమిషన్‌ ‌రిపోర్ట్‌ను అమలు చేస్తామని ప్రశ్నించారు. మద్దతు ధర విషయంలో తమ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉన్నదనీ, అందుకే ప్రతి ఏటా పంట వేయకముందే మద్దతు ధరను ప్రకటిస్తున్నామని మోదీ చెప్పారు. దీనివల్ల రైతులు పంట వేసేటప్పుడే సులువుగా లెక్కలు వేసుకోగలుగుతారని ఆయన అన్నారు.

- Advertisement -

రాత్రికి రాత్రే తీసుకురాలేదని గత 20,30 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను కూలంకషంగా చర్చించాయని అన్నారు. దేశంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, కాస్త ప్రోగ్రేసివ్‌ ‌భావాలతో ఆలోచించే రైతులు ఈ వ్యవసాయ సంస్కరణలను కోరుకున్నారని మోదీ పేర్కొన్నారు. కొందరి రాజకీయ పునాదులు కూకటి వేళ్లతో సహా కదులుతున్నాయి కాబట్టే, నూతన చట్టాల పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌గతంలో హా ఇచ్చిన విధంగా ఎన్నడూ రైతుల రుణాలను మాఫీ చేయలేదని మోదీ విమర్శించారు. ఎంతైతే రుణమాఫీ చేశారో… అదంతా కాంగ్రెస్‌ ‌పార్టీ బంధువులు, వారి అనుయాయులు మాత్రమే ఆ లాభాన్ని పొందేవారని మోదీ వ్యాఖ్యానించారు. కేవలం పెద్ద రైతుల రుణాలను మాఫీ చేసి పనైపోయిందని చేతులు దులుపేసుకుందని మోదీ దుయ్యబట్టారు. తన పదేళ్ల పదవీ కాలంలో కాంగ్రెస్‌ 50 ‌వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని చెప్పుకుందని, తమ హయాంలో మాత్రం ’కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన’ అనే పథకం కింద ప్రతి యేడాదికి 75 వేల కోట్ల రూపాయలను రైతులకు ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు.

రైతులను భ్రమల్లో ఉంచుకోవడం ప్రతిపక్షాలను మానుకోవాలని, ఈ నూతన చట్టాలను అమలులోకి తెచ్చి ఆరు నెలలు గడిచాయని, ఈ ఆరు నెలలు మౌనంగా ఉన్న విపక్షాలు హఠాత్తుగా ఉద్యమాన్ని లేవదీశాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. రైతుల భుజాలపై తుపాకులను పెట్టి కాలుస్తున్నారని మోదీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌ ‌ప్రభుత్వం రైసన్‌లో నిర్వహించిన కిసాన్‌ ‌కల్యాణ్‌ ‌కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. కిసాన్‌ ‌కల్యాణ్‌ ‌పథకం ప్రారంభించిన ప్రధాని అనంతరం మధ్యప్రదేశ్‌ ‌రైతులను ఉద్ధేశించి వర్చువల్‌ ‌విధానంలో మాట్లాడారు. మధ్యప్రదేశ్‌లో ఇవాళ.. 35 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 16 వేల కోట్ల రూపాయలు జమ అయినట్లు ప్రధాని తెలిపారు. ఖరీఫ్‌లో పంట నష్టపోయిన వారికి ఈ మొత్తం పరిహారం శివరాజ్‌సింగ్‌ ‌ప్రభుత్వం అందించింది.

ఇవాళ, తాము వేలమంది రైతులకు కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డులు ఇచ్చామని మోడీ తెలిపారు. గతంలో ఇవి రైతులందరికీ అందుబాటులో లేవని.. అయితే ప్రతి ఒక్క రైతుకి కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డు అందేలా తాము రూల్స్‌ని మార్చామని తెలిపారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. గోదాముల సామర్థ్యం పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. గిడ్డంగుల సదుపాయం రైతులకు అతి ముఖ్యమైనదని పేర్కొన్నారు. రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. రైతులను తప్పుదోవ పట్టించవద్దని విపక్షాలకు చేతులు జోడించి అభ్యర్థించారు. సాగు చట్టాల విషయంలో రైతులను తప్పుదోవ పట్టించే ధోరణిని విపక్షాలు మానుకోవాలన్నారు.

Leave a Reply