Take a fresh look at your lifestyle.

ప్రాజెక్టుల్లో ధన దోపిడీని అడ్డుకోండి..!

కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ని కోరిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
న్యూ దిల్లీ: తెలంగాణ రాష్ట్రం లో ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల ప్రజా ధనం ప్రయివేటు వ్యక్తుల  పాలవుతోందని, ఆ దుర్వినియోగాన్ని ఆపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ను కోరారు.కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యాలయం లో కేంద్ర జల శక్తి శాఖ సలహాదారు వేదిరే శ్రీరామ్ తోకలిసి   మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం పై ఫిర్యాదు చేశారు.రాష్ట్రం లో మరిన్ని సాగునీటి ప్రాజెక్టులు  నిర్మించాల్సిన అవసరం ఉందని, తాము కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరిస్తామని బండి సంజయ్ కేంద్ర మంత్రి కి చెప్పారు. అయితే డీపీఆర్ లు కేంద్ర ప్రభుత్వానికీ సమర్పించక పోవడం , కేంద్ర జలశక్తి శాఖ అనుమతి లేకుండానే ప్రాజెక్టులు ప్రారంభించడం వెనుక భారీ అవినీతి దాగుందని కేంద్ర మంత్రి కి వివరించారు సంజయ్.

మన దేశం లో ఏ సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలన్న ముందుగా డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ను తయారు చేసి సంబంధిత శాఖకు ఇవ్వడం, తద్వారా ఆ శాఖ అనుమతి తో పాటు అనుబంధంగా ఉన్న పర్యావరణ శాఖ అనుమతి వచ్చాకే ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏ ప్రాజెక్టు డీపీఆర్ ను కూడా కేంద్ర జలశక్తి శాఖకు పంప లేదు. దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉందని సంజయ్ వివరించారు. డీపీఆర్ ఇవ్వకుండా తమకు ఇష్టం వచ్చినట్లు మధ్య మధ్య లో  నిర్మాణ వ్యయాన్ని పెంచుకుంటోందని  చెప్పారు. దీనిద్వారా కాంట్రాక్టరుకు  భారీగా లాభం చేకూరి తద్వారా ఆయన నుంచి కమీషన్ దండుకుంటున్నారని కేంద్ర మంత్రికి సంజయ్ ఫిర్యాదు చేశారు.ఈ విధంగా వేల కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా కావడమే కాకుండా ప్రయివేటు, రాష్ట్ర ప్రభుత్వము లోని వ్యక్తుల పాలవుతోందని ఆయన చెప్పారు.

కేంద్ర జలశక్తి శాఖ ఎన్ని సార్లు డీపీఆర్ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించక పోవడం వెనుక ఉన్న దురుద్దేశం ఇదే అని సంజయ్ చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా డీఏపీఆర్ లు తప్పని సరి అని చెప్పినా కూడా తెలంగాణ సర్కార్ స్పందించకుండా ప్రాజెక్టులు కట్టడం వెనుక ఉన్న ఆంతర్యం కాస్ట్ ఎస్టిమేషన్ చార్జెస్ పెంచుడు-కమీషన్లు రెట్టింపు చేసుకునుడే అని కేంద్ర మంత్రికి సవివరంగా చెప్పారు బండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే పర్యావరణశాఖ అనుమతి తీసుకుంటున్నారని వివరించారు. లేకుంటే NGT స్తే ఇస్తుందని భయం అన్నారు. 

అయితే పర్యావరణ శాఖ కేవలం పర్యావరణ అంశాలనే పరిగణలోకి తీసుకుంటుంది. దీంతో తప్పించుకునేందుకు చాలా అవకాశాలు దొరుకుతున్నాయి. అందుకే పర్యావరణ అనుమతి ఇవ్వాలంటే కేంద్ర జలశక్తి శాఖ అనుమతి కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే అని పటిష్ట మైన నిబంధనలు రూపొందించాల్సినదిగా  కేంద్ర మంత్రి జవదేకర్ ను బండి సంజయ్ కోరారు.సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, నిబంధనల్లో తేవాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Leave a Reply