Take a fresh look at your lifestyle.

పత్రికా సమాచార కార్యాలయం భారత ప్రభుత్వం

  • ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ – ‌డిజిటల్‌ ‌భారత్‌
  • ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ ‌సాధనకు డిజిటల్‌ ‌టెక్నాలజీ సహకారం

గత నాలుగు నెలలుగా డిజిటల్‌ ‌చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరాటంకంగా ఆన్‌ ‌లైన్‌ ‌ద్వారా పరిపాలన సాగించగలిగాయి.  ప్రజలు నిత్యావసర వస్తువుల  దగ్గరి నుంచి సమస్త సేవలను ఆన్‌ ‌లైన్‌ ‌ద్వారా పొందగలిగారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ‘ప్రధాన మంత్రి గరీబ్‌ ‌కళ్యాణ్‌ ‌యోజన’ ద్వారా ప్రభుత్వం సహాయం చేయగలిగింది.

దేశంలో వచ్చిన డిజిటల్‌ ‌విప్లవం ఫలితంగా గ్రామాలలో ఉన్న ఉపాధి హామీ పథకం కూలీలు తమ వేతనాలను సకాలంలో అందుకోగలుగుతున్నారు.  రైతులు ‘ప్రధానమంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి’ ద్వారా లభించే ఆర్థిక సహాయాన్ని ఈ క్లిష్ట సమయంలో నిరాటంకంగా పొందగలిగారు. అంతేకాదు, కరోనా మహమ్మారి గురించి ప్రజలను చైతన్య పరిచేందుకు, వైరస్‌ ‌బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కూడా డిజిటల్‌ ‌టెక్నాలజీ ఉపకరించింది. ‘‘ఆరోగ్య సేతు’’ యాప్‌ ‌ను కేవలం మూడు వారాల వ్యవధిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత కూడా ఈ రంగంలో మనం సాధించిన అద్భుత ప్రగతికి చక్కని ఉదాహరణ.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన  ‘ఆత్మనిర్భర్‌ ‌భారత్‌’ ‌లక్ష్య సాధనలో డిజిటల్‌ ‌సాం కేతిక విజ్ఞాన రంగం కీలక పాత్ర పోషించ నుంది.  డిజిటల్‌ ‌టెక్నా లజీ  రంగంలో గత ఐదేళ్ళలో మన దేశం సాధించిన ప్రగతి ఇందుకు సోపానం కానుంది.  ప్రపంచం యావత్తూ కొవిడ్‌ ‌సంక్షోభం మూలంగా సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం సంకల్పించిన ‘‘స్వయం సమృద్ధ భారత్‌ ‌లక్ష్యాన్ని సాధించేందుకు ఐదేళ్ళ కిందట ప్రారంభించిన ‘‘డిజిటల్‌ ఇం‌డియా’’ కార్యక్రమం ఆసరాగా నిలుస్తుంది.  ప్రపంచంలోని అగ్రరాజ్యాలకు ధీటుగా సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమం దోహదం చేసింది.  ప్రభుత్వం ముందుచూపుతో దేశ ప్రజలలో డిజిటల్‌ అక్షరాస్యతను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలు నేటి సంక్షోభ సమయంలో అక్కరకు వచ్చాయి.

గ్రామాలలో బ్రాడ్‌ ‌బ్యాండ్‌ (ఇం‌టర్నెట్‌) ‌సేవల విస్తరణకు రూ. 45,000 కోట్లతో చేపట్టిన ‘‘భారత్‌ ‌నెట్‌’’ ‌ప్రాజెక్టు కరోనా మహమ్మారి విజృంభిస్తూ జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నతరుణంలో ప్రజల్ని ఆదుకునేందుకు ఉపయోగపడింది. టెలికాం సేవలను ప్రైవేటీకరించడం, స్పెక్ట్రం సేవల రంగంలో ప్రైవేట్‌ ‌రంగానికి అవకాశం కల్పించడంతో స్వల్ప కాలంలోనే మన దేశ ప్రజలకు 4జి సేవలు అందుబాటులోకి వచ్చాయి.   5జి సేవలను కూడా త్వరలో ప్రారంభిం చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశీయంగా ఎలక్ట్రానిక్‌ ‌పరికరాలు, మొబైల్‌ ‌ఫోన్ల, ఉత్పత్తిని ప్రోత్సహించారు.  అలాగే, సుంకాలను హేతుబద్దీకరించి, అన్ని అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ ‌పరికరాలను మార్కెట్లో అందుబాటులోకి సులభంగా లభ్యమయ్యేలా చేశారు.  ప్రజలలో డిజిటల్‌ అక్షరాస్యత పెంచేందుకు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు గత ఐదేళ్ళలో పెద్ద ఎత్తున చేపట్టారు.  ప్రభుత్వం దృఢ సంకల్పంతో చేపట్టిన చర్యల ఫలితంగా దేశంలో వచ్చిన డిజిటల్‌ ‌విప్లవంతొ ప్రస్తుత సంక్షోభ సమయంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చింది.

గత నాలుగు నెలలుగా డిజిటల్‌ ‌చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరాటంకంగా ఆన్‌ ‌లైన్‌ ‌ద్వారా పరిపాలన సాగించగలిగాయి.  ప్రజలు నిత్యావసర వస్తువుల  దగ్గరి నుంచి సమస్త సేవలను ఆన్‌ ‌లైన్‌ ‌ద్వారా పొందగలిగారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ‘ప్రధాన మంత్రి గరీబ్‌ ‌కళ్యాణ్‌ ‌యోజన’ ద్వారా ప్రభుత్వం సహాయం చేయగలిగింది.  దేశంలో వచ్చిన డిజిటల్‌ ‌విప్లవం ఫలితంగా గ్రామాలలో ఉన్న ఉపాధి హామీ పథకం కూలీలు తమ వేతనాలను సకాలంలో అందుకోగలుగుతున్నారు.  రైతులు ‘ప్రధానమంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి’ ద్వారా లభించే ఆర్థిక సహాయాన్ని ఈ క్లిష్ట సమయంలో నిరాటంకంగా పొందగలిగారు. అంతేకాదు, కరోనా మహమ్మారి గురించి ప్రజలను చైతన్య పరిచేందుకు, వైరస్‌ ‌బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కూడా డిజిటల్‌ ‌టెక్నాలజీ ఉపకరించింది. ‘‘ఆరోగ్య సేతు’’ యాప్‌ ‌ను కేవలం మూడు వారాల వ్యవధిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత కూడా ఈ రంగంలో మనం సాధించిన అద్భుత ప్రగతికి చక్కని ఉదాహరణ.

Inumula Haribabu, Assistant Director, Regional Outside Bureau, Hyderabad

రూ. 52,608 కోట్ల ఆర్థిక సహాయం
ప్రభుత్వం డిజిటల్‌ ‌టెక్నాలజీని ఉపయోగించి జన్‌ ‌ధన్‌ ‌ఖాతాలతో మొబైల్‌ ‌ఫోన్‌ ‌నంబర్లు, ఆధార్‌ ‌నంబర్లను  అనుసంధానించింది.  దీని ఫలితంగా ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ప్రత్యక్ష నగదు బదిలీ (ణదీ•) పద్ధతిలో ‘‘ప్రధాన మంత్రి గరీబ్‌ ‌కళ్యాణ్‌ ‌యోజన’’  ద్వారా దేశవ్యాప్తంగా 41 కోట్ల నిరుపేద ప్రజలకు రూ. 52,608 కోట్ల ఆర్థిక సహాయం చేయగలిగారు.   జన్‌ ‌ధన్‌ ‌ఖాతాదారులైన మహిళలందరికీ నెలకు రూ. 500 చొప్పున ఈ ఏడాది ఏప్రిల్‌ ‌నుంచి మూడు నెలల కాలంలో మొత్తం రూ. 20,344 కోట్లు నేరుగా ఆర్థిక సహాయం చేశారు.  ఇంత సంక్షోభ సమయంలో కూడా పొలాల్లో స్వేదం చిందిస్తూ మన అందరి ఆకలి తీర్చుతున్న 8.19 కోట్ల రైతన్నలకు ‘‘ప్రధాన మంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి’’ పథకం కింద ణదీ• పద్ధతిలోనే రూ. 16,394 కోట్ల ఆర్థిక సహాయం అందించి ఆదుకుంది.  ఇంకా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగ పెన్షనర్లకు అదనంగా రూ. 1000 వంతున రూ. 1,405 కోట్లు ఆర్థిక సహాయం అందించగలిగారు.   ఇంకా, 2.20 కోట్ల భవన నిర్మాణ కార్మికులకు రూ. 3,493 కోట్లు, 44.97 లక్షల ఇపిఎఫ్‌ ‌ఖాతాదారులకు (చిరు ఉద్యోగులకు) రూ. 698 కోట్ల ఆర్థిక సహాయం చేసి ఈ సంక్షోభ సమయంలో వారికి అండగా ఉండటానికి డిజిటల్‌ ‌టెక్నాలజీ రంగంలో దేశం సాధించిన ప్రగతికి కారణం.
ఈ సందర్భంగా ప్రభుత్వం ఐదేళ్ళ కిందట 2015 జులైలో ప్రారంభించిన డిజిటల్‌ ‌కార్యక్రమం గురించి వివరంగా తెలుసుకుందాం..

డిజిటల్‌ ఇం‌డియా కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తున్న కార్యక్రమాలలో ‘డిజిటల్‌ ఇం‌డియా’ ఒకటి.  కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐ.‌టి శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోంది.  దేశంలో డిజిటల్‌ ‌టెక్నాలజీ అభివృద్ధికి ఈ శాఖ తొమ్మిది కీలక అంశాలను గుర్తించి వివిధ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది.  వీటిలో మొట్టమొదట దేశంలో మారుమూల గ్రామాలకు సైతం బ్రాడ్‌ ‌బ్యాండ్‌ ‌సేవలను అందుబాటులోకి తేవటం తొలి ప్రాధాన్యత అంశం.  ప్రజలందరికీ మొబైల్‌ ‌కనెక్టివిటీ సౌకర్యం కల్పించటం, రెండవది కాగా, ఇంటర్నెట్‌ ‌సేవలను ఎక్కువ  శాతం ప్రజలు వినియోగించుకునేలా చేయటం మూడవది.   ఎలక్ట్రానిక్‌ ‌పాలన ద్వారా పాలనా రంగంలో సంస్కరణలు, ఇ-క్రాంతి పేరిట వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల సేవలను ఆన్లైన్‌ ‌ద్వారా అందించటం, ఏ సమాచారమైనా ప్రజలందరికీ సులువుగా లభించేలా కామన్‌ ‌సర్వీస్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేయటం, దేశీయంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం, ఎలక్ట్రానిక్‌, ఐటి రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేలా చేయటం, కొత్త, కొత్త ఆవిష్కరణలు రూపొందించేలా నూతన కార్యక్రమాలను రూపొందించటం ద్వారా దేశంలో ఈ రంగాన్ని అభివృద్ధి పరచాలని కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఐటి శాఖ నిర్ణయించింది.

 భారత్‌ ‌నెట్‌ ‌ప్రాజెక్టు
దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఆప్టికల్‌ ‌ఫైబర్‌ ‌లైన్లు వేయటం ద్వారా బ్రాడ్‌ ‌బ్యాండ్‌ ‌సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ‘‘భారత్‌ ‌నెట్‌’’ ‌ప్రాజెక్టును ప్రారంభించారు.  ఇప్పటికే దేశంలో 1.3 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌ ‌బ్యాండ్‌ ఇం‌టర్నెట్‌ ‌సౌకర్యం కల్పించారు.  ఈ ప్రాజెక్టులో భాగం జిల్లా కేంద్రాల్లోని అన్ని ప్రభుత్వ విభాగాలకు, సంస్థలకు ఉచితంగా బ్రాడ్‌ ‌బ్యాండ్‌ ‌సౌకర్యం కల్పిస్తారు.  అలాగే, గ్రామాలలో కూడా ప్రభుత్వ స్కూల్స్, ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితంగా బ్రాడ్‌ ‌బ్యాండ్‌ ఇం‌టర్నెట్‌ ‌సేవలను అందిస్తారు.  మొత్తం ‘‘భారత్‌ ‌నెట్‌’’ ‌ప్రాజెక్టు అమలుకు రూ. 45,000 కోట్లు అవుతుందని అంచనా వేయగా, ఇప్పటికే ప్రథమ, రెండవ దశ ప్రాజెక్టుకు రూ. 20,431 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అమలుచేసే భారత్‌ ‌బ్రాడ్‌ ‌బ్యాండ్‌ ‌నెట్‌ ‌వర్క్ ‌లిమిటెడ్కు అందచేసింది.  ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) కు రూ. 6,000 కోట్లు కేటాయించింది.  ఈ ప్రాజెక్టు పూర్తి అయితే గ్రామాలకు ఇంటర్నెట్‌ ‌సేవలు విస్తరించటమే కాకుండా, ఇంటర్నెట్‌ ‌వేగం కూడా గణనీయంగా పెరుగుతుంది.

 2.5 లక్షల కామన్‌ ‌సర్వీస్‌ ‌సెంటర్స్
‌డిజిటల్‌ ఇం‌డియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో కామన్‌ ‌సర్వీస్‌ ‌సెంటర్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది.  ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రానికి బ్రాడ్‌ ‌బ్యాండ్‌ ఇం‌టర్నెట్‌ ‌సేవలను అందుబాటులోకి వచ్చిన వెంటనే ఈ సర్వీస్‌ ‌సెంటర్స్ ‌ను ప్రారంభిస్తారు.  అన్ని పౌర సేవలు ఈ సెంటర్స్ ‌లో లభించేలా ఏర్పాటు చేయనున్నారు.  ఇందుకుగాను, ‘‘జాతీయ గ్రామీణ ఇంటర్నెట్‌ ‌మిషన్‌’’ ‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  తొలి దశలో దేశవ్యాప్తంగా 25 లక్షల సిఎస్సి లను ప్రారంభించాలనుకుంటున్నారు.  వీటివలన స్థానిక ప్రజలు అన్ని రకాల సేవలను ఆన్‌ ‌లైన్‌ ‌ద్వారా పొందే సౌకర్యం ఏర్పడుతుంది.  దశలవారీగా దేశంలో అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో సిఎస్సి లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 ఇ- పాలన
డిజిటల్‌ ఇం‌డియా కార్యక్రమంలో ఇ-పాలనను అత్యధిక ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వం గుర్తించింది.  ప్రభుత్వ కార్యాలయ పనులన్నింటి కంప్యూటరీకరించి ఆన్లైన్‌ ‌ద్వారా విధులను నిర్వహించటాన్ని ‘ఇ-పాలన’ అంటారు. పాలనలో పారదర్శకత, అవినీతికి ఆస్కారం లేకపోవటం, ప్రజలకు సత్వరమే సేవలు అందటం ‘ఇ-పాలన’ లో ప్రయోజనాలు.  ప్రస్తుత కొవిడ్‌ ‌సంక్షోభ సమయంలో ‘ఇ-ఆఫీస్‌’ ‌ద్వారా ప్రభుత్వం పాలనా కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి.  నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ ‌సెంటర్‌ (‌చీו) సహకారంతో ప్రభుత్వ శాఖలకు చెందిన సగం మంది ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే తమ విధులు నిర్వహిస్తున్నారు.  ప్రస్తుతం 75 కేంద్ర మంత్రిత్వ శాఖలు ఇ-ఆఫీస్‌ ‌వేదికను ఉపయోగిస్తుండగా, వీటిలో 57 శాఖలు 80 శాతం కార్యకలాపాలను ఈ వేదిక నుంచే చేస్తున్నాయి.  తెలంగాణారాష్ట్ర ప్రభుత్వ ఆరు శాఖలలొ ఇ-ఆఫీస్‌ అమలుచేయాలని నిర్నయం తీసుకున్నది.రానున్న ఆరు నెలలలొ మిగతా విభాగాలలొ ఇ-ఆఫీస్‌ ‌పాలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.పలు రాష్ట్రాలు ‘ఇ-ఆఫీస్‌’ ‌పాలన దిశగా ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.  కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్‌ ‌విద్యబోధనకు సమాయత్తమవుతున్నాయి.  ఇప్పటికే కేరళ రాష్ట్రం 60 లక్షల మంది విద్యార్థులకు ఆన్లైన్‌ ‌క్లాసులు నిర్వహిస్తూ ముందు వరుసలో ఉంది.

 ఇ-క్రాంతి ప్రాజెక్టు
డిజిటల్‌ ఇం‌డియా కార్యక్రమంలో మరో ముఖ్యమైన ప్రాజెక్టు ఇ-క్రాంతి.  సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వం ద్వారా అందించే సేవలన్నింటినీ ఒకే దగ్గరే లభించే విధంగా డిజిటల్‌ ‌టెక్నాలజీ సహకారంతో జాతీయ ఇ-గవర్నెస్‌ ‌ప్రణాళికను (ఇ-క్రాంతి) కేంద్రం రూపొందించింది.  ప్రజలకు అందించే సేవలన్నింటినీ కేవలం మొబైల్‌ ఆధారంగా పొందే ఏర్పాటు చేయటం ఈ ప్రాజెక్టు విశిష్టత.  ఇన్సూరెన్స్, ‌బ్యాంకింగ్‌, ఆదాయపన్ను, తపాలా సేవలు, భూమి రిజిస్ట్రేషన్లు, వివిధ ప్రభుత్వ అనుమతులు, సర్టిఫికెట్ల జారీ, తదితర సేవలన్నీ ఆన్‌ ‌లైన్‌ ‌ద్వారా పొందే విధంగా వివిధ సాఫ్ట్వేర్‌ ‌ల రూపకల్పన  చేశారు.  ప్రస్తుతం ఇ-క్రాంతి కింద 44 మిషన్‌ ‌మోడ్‌ ‌ప్రాజెక్టులు అమలవుతున్నాయి.  వీటిలో కేంద్రానికి సంబంధించిన రంగాలు 15 ఉండగా, రాష్ట్రాలకు సంబంధించినవి 17 ఉన్నాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రాజెక్టులు 12 ఉన్నాయి.  ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని విభాగాలు ఈ ప్రాజెక్టు ద్వారా ఇకపై ఆన్లైన్‌ ‌లో సేవలను అందించే విధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

200 ఎలక్ట్రానిక్‌ ‌క్లస్టర్లు
‘ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌’ ‌లక్ష్యానికి అనుగుణంగా టెలికాం, ఎలక్ట్రానిక్‌ ‌పరికరాలను దేశీయంగా తయారీకి ఎం.ఎస్‌.ఎం.ఇ. ‌లను ప్రోత్సహించేవిధంగా జాతీయ ఎలక్ట్రానిక్‌ ‌విధానాన్ని రూపొందించింది.  ‘‘మోడిఫైడ్‌ ‌స్పెషల్‌ ఇన్సింటివ్‌ ‌ప్యాకేజి’’ లో భాగంగా ఈ రంగంలో కంపెనీలు స్థాపించేవారికి మూలధన వ్యయంలో 25 శాతం సబ్సిడీతో పాటు, యంత్ర పరికరాలపై ఎక్సైజ్‌ ‌సుంకం మినహాయింపు ఇస్తారు.  అన్ని మౌలిక సదుపాయాలలో దేశవ్యాప్తంగా 200 ఎలక్ట్రానిక్‌ ‌క్లస్టర్లు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ క్లస్టర్స్లొ మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయంలో 50 నుంచి 75 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.  ప్రస్తుతం దేశంలో 30 క్లస్టర్లు ఏర్పాటయ్యాయి.  అన్ని ప్రభుత్వ విభాగాలకు అవసరమైన వాటికి అవసరమైన ఎలక్ట్రానిక్‌ ‌వస్తువులలో కనీసం 30 శాతం మన దేశంలో తయారైన వాటినే కొనుగోలు చేయాలని కేంద్రం ఉత్తర్వులను జారీ చేసింది.  ఇందుకు సంబంధించి 30 రకాల పరికరాలను నోటిఫై చేసింది.  ఇంకా, ఐటి, ఐ.టి.ఇ.ఎస్‌ ‌రంగాలలో కోటి మంది యువతకు  నేషనల్‌ ‌స్కిల్‌ ‌డెవలప్మెంట్‌ ‌మిషన్‌ ‌ద్వారా శిక్షణను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.  ఈ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 3,000 మంది పిహెచ్ధి విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.

 ఐదేళ్ళలో అద్భుత ప్రగతి
గత ఐదేళ్ళ కాలంలో ప్రభుత్వం నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికతో వివిధ కార్యక్రమాలను రూపొందించి, డిజిటల్‌ ‌సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి పరచిన ఫలితంగా ప్రభుత్వం అందించే ఇ-సేవ కార్యక్రమాలు 2014లో  2,463 ఉండగా, 2020 మే నాటికి 3,858కి పెరిగాయి.  రోజూవారీ నిర్వహించే ఎలక్ట్రానిక్‌ ‌లావాదేవీలు సగటున 2014లో 66 లక్షలు ఉండగా, 2020 మే నాటికి 16.3 కోట్లకు చేరుకోవటం విశేషం.  దేశవ్యాప్తంగా 125.7 కోట్ల మందికి ఆధార్‌ ‌కార్డులు జారీ చేసి, వారికి ఒక గుర్తింపు కల్పించారు.  ఆధార్‌ ‌వెరిఫికేషన్‌ ‌లావాదేవీలు 4,216 కోట్లకు చేరుకున్నాయి.  గడచిన ఐదేళ్ళ కాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 56 మంత్రిత్వ శాఖలకు చెందిన 426 పథకాలకు సంబంధించిన 11.1 లక్షల కోట్ల మొత్తాన్ని లబ్దిదారులకు పంపిణీ చేశారు.  దీనివలన 1.7 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38.73 కోట్ల జన్ధన్‌ ‌ఖాతాదారులు ఉన్నారు.  ఈ ఖాతాదారులు 1.33 లక్షల కోట్లు పొదుపు చేసుకున్నారంటే  అది డిజిటల్‌ ‌విప్లవం సాధించిన ఘనతే.   ఇంకా, దేశవ్యాప్తంగా 117 కోట్ల మంది మొబైల్‌ ‌కనెక్షన్లు, 68.8 కోట్ల మంది ఇంటర్నెట్‌ ‌కనెక్షన్లు వినియోగిస్తున్నారు,  ‘డిజిటల్‌ ఇం‌డియా’ లో భాగంగా 2015 జులై 1న ప్రారంభించిన ..డిజిలాకర్‌.. ‌పథకంలో 378 కోట్ల డాక్యుమెంట్లను ప్రజలు భద్రపరచుకున్నారు.  యునిఫైడ్‌ ‌మొబైల్‌ ‌యాప్‌ (ఉమాంగ్‌)‌పై 860 కి పైగా సేవలు అందుబాటులోకి వచ్చాయి.  దీనిని 3 కోట్ల మంది డౌన్‌ ‌లోడ్‌ ‌చేసుకున్నారు.  పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ప్రారంభించిన మై గవ్‌ ‌యాప్‌ (%ఎ•స్త్ర‌శీఙ%) లో కూడా గత మే నెల వరకు 1.17 కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

 ఆరోగ్య సేతు
డిజిటల్‌ ‌సాంకేతిక విజ్ఞానరంగంలో సాధించిన ప్రగతి కారణంగా  కేవలం మూడు వారాలలో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ ‌ను దేశీయంగా అభివృద్ధి చేయగలిగారు.  కొవిడ్‌ ‌మహమ్మారి గురించిన తాజా సమాచారాన్ని,  తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఈ యాప్‌ ‌ద్వారా ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు.  ప్రభుత్వం ఈ యాప్ను 12 ప్రాంతీయ భాషలలో అందుబాటులోకి తెచ్చింది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ యాప్ను 14.28 కోట్ల మంది ప్రజలు ఉపయోగించుకుంటున్నారు.

‘ఆత్మనిర్భర్‌ ‌భారత్‌’ ‌లక్ష్య సాధనకు అనేక కీలక రంగాలలో ప్రైవేట్‌ ‌రంగానికి ప్రభుత్వం అవకాశం కల్పించటంతో డిజిటల్‌ ‌టెక్నాలజీ రంగం కూడా రానున్న కాలంలో మరింత వృద్ధి చెందే అవకాశాలున్నాయి.  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవతో ప్రపంచ సాఫ్ట్వేవెర్‌ ‌దిగ్గజం గూగుల్‌ ‌కంపెనీ మనదేశంలో డిజిటల్‌ ‌టెక్నాలజీ  రంగంలో వచ్చే ఐదేళ్ళలో రూ. 75,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవలె ప్రకటించింది.  ప్రైవేటు రంగంలో దేశంలో ఒక అతిపెద్ద టెలికాం కంపెనీలో  గూగుల్‌ 33,737 ‌కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించగా, ‘ఫేస్బుక్‌’ ఇప్పటికే ఈ కంపెనీలో 42 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది.  దేశంలో త్వరలోనే 5జి సేవలను ప్రారంభించనున్నట్లు కూడా ఈ కంపెనీ ప్రకటించింది. ప్రభుత్వం పటిష్ట ప్రణాళికతో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ప్రైవేట్రంగంలో పెద్ద ఎత్తున వస్తున్న పెట్టుబడుల ఫలితంగా దేశంలో డిజిటల్‌ ‌టెక్నాలజీ రంగం మరింత వృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగై, యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రపంచంలోని అగ్రదేశాలకు ధీటుగా పటిష్టమైన, శక్తివంతమైన, స్వయం సమృద్ధ భారత్‌ అవతరించనుంది.

Inumula Haribabu, Assistant Director, Regional Outside Bureau, Hyderabad
ఇనుముల హరిబాబు, అసిస్టెంట్‌ ‌డైరెక్టర్‌, ‌రీజనల్‌అవుట్‌ ‌రిచ్‌ ‌బ్యూరో, హైదరాబాద్‌

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!