Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో దుబ్బాకను గుర్తుచేయాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో దుబ్బాకను గుర్తుచేయాలని పట్టభద్రులకు  ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌పిలుపునిచ్చారు.  ఖమ్మం,వరంగల్‌, ‌నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి భద్రాచలంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తానని ఇప్పటికీ ఇవ్వకపోగా ఇంకా నిరుద్యోగులను మోసం చేస్తుందని వారు అన్నారు. అంతే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వారు అన్నారు. అంతేకాకుండా పోలవరం ఎత్తును కూడా తగ్గించే ఉన్న ఏడు మండలాలను కాపాడాలని వారు అన్నారు.ఇక్కడ భద్రాచలానికి 100 కోట్లు ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటికే ఇవ్వకపోగా భద్రాచలం ఆదివాసులను మరియు భద్రాచలం ప్రజలను మోసం చేస్తోందని వారు ఎద్దేవా చేశారు.సుమారుగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు లక్షా అరవై తొమ్మిది వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని ఇంతవరకు భర్తీ చేయలేదని వాటిని భర్తీ చేయాలని వారు ఆరోపించారు.

రాబోయే పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎలక్షన్‌ ‌లో మరో దుబ్బాకలో బుద్ధి చెప్పి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించే శాసనమండలి పంపించి తన రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గెలిపించాలని వారు
కోరారు. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వానికి లేదని వారు ఆరోపించారు.కాబట్టి ఇకనైనా నిరుద్యోగ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్లు అందరూ కూడా తన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపించాలని వారు కోరారు.కోవిడ్‌ ఒక కారణం కావొచ్చు కానీ, దాన్ని బూచీగా చూపించి తెలంగాణ సర్కారు ప్రభుత్వ పథకాలకు కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుందని విమర్శించారు. రెండేళ్ల క్రితమే హెచ్చరించినా పట్టించుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి నెలకొందని అన్నారు.

రూ.47 వేల కోట్ల ఆర్థిక లోటు ఏర్పడుతుందన్నారు.తిరిగి పుంజుకోవాలంటే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, విద్యాప్రణాళిక• ప్రకటించాలని, రియల్‌ ఎస్టేట్‌ ‌రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. కోవిడ్‌ ‌కారణంగా ఛిన్నాభిన్నమైన వివిధ వృత్తిదారుల కుటుంబాలకు రూ.7500ల భృతిని ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోలు కేంద్రాలు లేవని మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. తమకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ ఎంఎలన్యూడెమెక్రసీ మద్దతునిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ ‌సాయిబాబా మరియు జిల్లా ప్రెసిడెంట్‌ ‌గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు  మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్రావు  మరియు, మల్లెల రామనాథం మరియు దేవదానం  పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply