Take a fresh look at your lifestyle.

‘‘అమెరికా అధ్యక్షుని నోట అపశృతులు’’

“అమెరికా అధ్యక్ష ఎన్నకల ముఖాముఖి చర్చలో అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌భారత దేశాన్ని కించపరిచేలా వివీదాస్పద వ్యాఖ్యలు చేసి నవ్వులపాలయ్యాడు. …. ‘‘భారత్‌లో పీల్చే గాలి కూడా రోత పుట్టిస్తోంది’’ అని వ్యాఖ్యానించడం ట్రంప్‌ అహంకారానికి నిదర్శనమైంది.. వయోభారంతోనో , కరోనా ప్రభావం వలన నోరుజారడమో కాదు. జాత్యహంకార పూరిత వ్యాఖ్యగా ప్రపంచవ్యాప్తంగా ముద్రపడింది.అమెరికా అధ్యక్షుడు తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వలన ఆ దేశ పరువుకే భంగం వాటిల్లు తున్నది. గతంలో కూడా ట్రంప్‌ ‌భారతీయులను తిండిబోతులు గా అభివర్ణిస్తూ, అతిగా తినడం వల్లనే ప్రపంచంలో తిండి దొరకడం లేదు అన్నట్టుగా.. వ్యాఖ్యానించాడు. కరోనా విషయంలో కూడా నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడి నందువల్ల తగిన మూల్యం చెల్లించక తప్ప లేదు. ఒక సాధారణ పౌరుని జాతి వివక్షతతో ఒక పోలీసు అధికారి మోకాళ్ళతో గొంతు నొక్కి ప్రాణం తీసిన సంఘటనలో కూడా ట్రంప్‌ ‌నోరు కంపుగా మారి ప్రజాగ్రహానికి గురై, బంకర్‌ ‌లో తలబాచుకున్న పరిస్థితి.”

దశాబ్దాలపాటు ఉచ్ఛస్థి తిలో సాగిన భారత్‌-అమెరికా సంబం ధాలు కాలక్రమేణా అనేక మార్పులు చెందాయి. గతంలో స్నేహ పూర్వక, ద్వైపాక్షిక విషయాలకే పరిమితమైన సంబంధాలు అంతర్జాతీయ అంశాలు చర్చించే స్థాయికి ఎదిగాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమం లో ప్రముఖ నాయకులకు అమెరికా తో స్నేహపూర్వక సంబంధాలుండేవి. 1961 లో భారత ప్రధాని నెహ్రూ రూపొందించిన అలీన విధానం లో వివిధ దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి జరిగింది. 1971 ఇండో-పాక్‌ ‌యుద్ధంలో నిక్సన్‌ ‌ప్రభుత్వం పాకిస్తాన్‌ ‌కి మద్దతు ఇవ్వడంతో భారత్‌-అమెరికా సంబంధాలు క్షీణించాయి. 1990లో భారత్‌ ‌విదేశాంగ విధానంలో గణనీయ మార్పులు ప్రపంచదేశాల మైత్రీభావానికి అనుగుణంగా మార్చుకుని అమెరికాతో సంబంధాలను మెరుగు పరచుకుంటూ అడుగులు వేస్తున్నది.

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పెరుగుదల, ప్రపంచ భద్రతా విషయాలలో సహకారం, గ్లోబల్‌ ‌గవర్నెన్స్ ‌విషయాలపై నిర్ణయాలు, ప్రపంచబ్యాంకు , ఐఎంఎఫ్‌, అణు సరఫరాకు మద్దతు, సాంకేతిక భాగస్వామ్యం మొదలైన విషయాలలో భారత-అమెరికా సంబంధాలు కీలకమైన మైలురాళ్లుగా మారాయి. ఈ కీలక సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నకల ముఖాముఖి చర్చలో అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌భారత దేశాన్ని కించపరిచేలా వివీదాస్పద వ్యాఖ్యలు చేసి నవ్వులపాలయ్యాడు. ‘‘భారత్‌లో పీల్చే గాలి కూడా రోత పుట్టిస్తోంది’’ అని వ్యాఖ్యానించడం ట్రంప్‌ అహంకారానికి నిదర్శనమైంది.. వయోభారంతోనో , కరోనా ప్రభావం వలన నోరుజారడమో కాదు. జాత్యహంకార పూరిత వ్యాఖ్యగా ప్రపంచవ్యాప్తంగా ముద్రపడింది.అమెరికా అధ్యక్షుడు తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వలన ఆ దేశ పరువుకే భంగం వాటిల్లు తున్నది. గతంలో కూడా ట్రంప్‌ ‌భారతీయులను తిండిబోతులు గా అభివర్ణిస్తూ, అతిగా తినడం వల్లనే ప్రపంచం లో తిండి దొరకడం లేదు అన్నట్టుగా.. వ్యాఖ్యానించాడు. కరోనా విషయంలో కూడా నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడి నందువల్ల తగిన మూల్యం చెల్లించక తప్ప లేదు. ఒక సాధారణ పౌరుని జాతి వివక్షతతో ఒక పోలీసు అధికారి మోకాళ్ళతో గొంతు నొక్కి ప్రాణం తీసిన సంఘటనలో కూడా ట్రంప్‌ ‌నోరు కంపుగా మారి ప్రజాగ్రహానికి గురై, బంకర్‌ ‌లో తలబాచుకున్న పరిస్థితి. ఈ మధ్య డెమొక్రటిక్‌ అభ్యర్థితో జోబైడెన్‌తో వాష్‌ ‌విల్లెలో జరిగిన తుది ముఖాముఖి చర్చలో భారత్‌ని లక్ష్యంగా చేసుకొని ట్రంప్‌ ‌నోరు జారారు.

భారత్‌, ‌చైనా, రష్యాలో వాయు కాలుష్యంతో గాలి నాణ్యత అత్యంత దారుణ స్థాయికి పడిపోయిందని వాతావరణ పరిరక్షణకు ఆ మూడు దేశాలు సహకరించడం లేదని ఆరోపించి…. అందుకే పారిస్‌ ‌వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిందనడం ఎన్నికలలో లబ్దిపొందేందుకేనని స్పష్టమయింది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశాలలో అమెరికా రెండో స్థానంలో ఉంది. భూతాపం నివారణకు ప్రపంచ దేశాలు ఏకోన్ముఖంగా కుదుర్చుకున్న పర్యావరణ ఒప్పందాన్ని నీరుగార్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌కంకణం కట్టుకున్నారు. 2015 డిసెంబర్‌లో పారిస్‌ ‌కేంద్రంగా జరిగిన సదస్సు తీర్మానాల అమలులో అంతర్జాతీయ సహకారం బాధ్యతలను విస్మరించి ఒప్పందం నుంచి వైదొల గాలని తీసుకున్న నిర్ణయం ఆ దేశ ప్రతిష్టను దెబ్బ తీసింది.

ఫ్రాన్స్, ‌జర్మనీ,ఫిన్లాండ్‌ ‌తదితర ప్రపంచ దేశాలన్నీ ట్రంపు నిర్ణయాన్ని, చారిత్రక ఒప్పందం నుంచి వైదొలగాలని తీసుకున్న నిర్ణయాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తప్పుబట్టారు. నవంబర్‌ ‌లో జరిగే ఎన్నికలలో భారతీయుల ఓట్లు తనకు వ్యతిరేకంగా ఉంటాయని ఇంటెలిజెన్స్ ‌వర్గాల ద్వారా తెలుసుకొని భారత్‌ను లక్ష్యం చేయడం అవివేకమే అవుతుంది. హెచ్‌ ‌వన్‌ ‌బీ వన్‌ ‌వీసాల తగ్గింపు నిర్ణయం, వలసవాదుల ను వెనక్కి పంపిస్తానని అనేకసార్లు మాట్లాడడం, భారతీయుల ఓట్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉండవచ్చునని విశ్లేషకుల అభిప్రాయం. ట్రంప్‌ ‌వ్యాఖ్యలపై ఆయన ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ ‌నేత జోబైడెన్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు.. మిత్ర దేశాలపై అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. భారత-అమెరికా భాగస్వామ్యాన్ని తాను, భారతీయ సంతతికి చెందిన ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమల హరిస్‌ ‌విలువలున్న వ్యక్తి అని ప్రశంసించారు. గతంలో ఒబామా హయాంలో భారత్‌ అమెరికా మధ్య సంబంధాలు కొనసాగాయని, భవిష్యత్తులో మరింత ఎక్కువ భాగస్వామ్యంతో సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు.

thanda sadhanandham
తండా సదానందం, 9989584665,

Leave a Reply