Take a fresh look at your lifestyle.

‌కాంగ్రెస్‌ అం‌టే ఆధిపత్య వర్గాలేనా..! బడుగులకు ప్రాధాన్యత ఇవ్వరా.!

వారే మాట్లాడుకున్నరు గాని బలహీన వర్గాలకు చేసిన న్యాయం ఏమిటో చెప్పలే,ఏమి చేస్తరో చెప్పలే.ఇది కాంగ్రెస్‌ ‌పార్టీ సామాజిక న్యాయమా.!

 

నిరుద్యోగ నిరసన సభా.! టికెట్ల ప్రకటన సభనా.!

వారి ప్రసంగాలు చూస్తే నిరుద్యోగ నిరసన సభల లేదని స్పష్టంగా అనిపించింది.అరాకొరగా నిరుద్యోగం గురించి మాట్లాడి,ఒకరికొకరు కడుపులో కత్తులు పెట్టుకొని పెదవులకు తేనె పూసుకొని వాల్లను వాల్లే ఆకాశమంత ఎత్తుకున్నారు. ప్రజాభిప్రాయంతోను,అధిష్టానం తో సంబంధం లేకుండా,పిల్ల పుట్టక ముంధే కుళ్ల కుట్టిచ్చినట్లుగా,ఎన్నికల నోటిఫికేషన్‌ ‌రాకపూర్వమే వాల్లకే వాల్లే టికెట్లు ప్రకటించుకొని యాబై వేయిల మేజార్టి అని ఒకరు,అంతకంటే పది ఓట్లు ఎక్కువనే వస్తాయని మరొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు.మరొక సీనియర్‌ ‌ముందడగేసి నా కుమారులు ఇద్దరు పోటి చేస్తారు,అధిష్ఠానం ఆదేశిస్తే పోటిచేయకుండానే నేనం సి.ఎం అవుతా అన్నారు.మీరు అక్కడ 15 స్థానాలు గెలిపిస్తే,మేము ఇక్కడ 12 స్థానాలు గెలిపించుకుంటామని మొత్తానికి మన ఆధిపత్య వర్గంతోనే ఏదైనా చెద్దామనే ధోరణి వ్యవహరిస్తున్నారు.వాల్లకు అనుకూలంగా ఉన్నవారి గురించి పదే పదే ప్రస్తావించారు.వారి నోట ఉధ్యమకారుల మాట రాలే..? ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాలు చూపకుండా వ్యక్తిగత దూషణల కు దిగారు తప్ప నిరుద్యోగులకు సంబంధించి స్పష్ఠమైన ఎజెండా తో ముంధుకు పోలే.ఇట్లనే జరుగుతదని కూడా మాలాంటి పౌరసమాజం మంధు రోజే తేల్చి చెప్పింది.ఐనా వారు నిర్ణయించుకున్న విధంగానే మాట్లాడుకుంటున్నారు.

 

వేదిక పైకి ఉధ్యమకారులకు స్థానం ఏది..!

పోరాటాలకు పురిటి గడ్డ నల్లగొండ అని నల్లగొండ చరిత్ర ప్రస్తావించినారు సరే బాగుంది.కోవర్టులను కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ తో పోలిస్తే అమరుల ఆత్మలు ఘోషిస్తాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడి సమైక్య శక్తులకు కొరకరాని కొయ్యగా మారి నల్ల చట్టాలు మోపబడిన ఉద్యమకారుడు టిపిసిసి ఉపాధ్యక్ష హోదాలో ఉన్న డాక్టర్‌ ‌చెరుకు సుధాకర్‌ ‌ను వేదిక మీదికి ఆహ్వనించకపోగా,పేరును కూడా ప్రస్తావించలేదు.ఉధ్యమంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొని ఆధిపత్య వర్గం కుట్రలతో రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటిచేసి ఓటమి పాలై కాంగ్రెస్‌ ‌పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి,ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న అద్దంకి దయాకర్‌ ‌ను పిలువకపోవడంలో అంతర్యమేమిటి.? ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రం గా ఉధృతమైన ఉధ్యమాన్ని నడిపించిన పున్నా కైలాష్‌ ‌నేత కు మునుగోడు ఉప ఎన్నికల్లో టిక్కెట్‌ ఇస్తామని హమీ ఇచ్చి మోసం చేసి,కమిట్మెంట్‌ ‌తో పార్టీ కోసం పని చేస్తున్న నాయకున్ని ఎంధుకు పక్కకు పెట్టారు.కాంగ్రెస్‌ ‌పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదుగుదలను ఓర్వలేఖనా.! కాంగ్రెస్‌ ‌పార్టీ ని ఆగంబట్టిస్తున్నవారిని నిలదీసినంధుకా.! పార్టీ కోసం నిబద్దతో పనిచేస్తున్నంధుకా.! మీకు భజన చేయనంధుకా.! మీ ఆధిపత్య పోరులో.! ఉధ్యమ శక్తులను బలిస్తారా.! కేసీఆర్‌ ఉధ్యమకారులను లెక్కచేస్తలేరన్న మీరు నల్లగొండ జిల్లాలో మీ పార్టీలో ఉన్న ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా.!

 

ఫ్యూడల్‌ ఆలోచనలకు చరమగీతం పాడుదాం..

ఉమ్మడి రాష్ట్రంలో ని ప్యూడల్‌ ఆలోచనా విధానాలు ప్రత్యేక తెలంగాణ లో పనికిరావు.వీరు అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం దక్కుతుందని చిలకపలుకులు పలుకుతున్నారు.పిసిసి హోదాల్లో ఉన్న వారిని వేదిక మీద పిలవకుండా మీ పంథాను. మీరు కొనసాగిస్తే.ఇది ఏలాంటి చర్యలకు దారి తీస్తుంది.? సోనియా,రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీ ని దేశంలో,రాష్ట్రంలో ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా వారిని ఆదరిస్తుంటే ..వీరు శిఖండి రాజకీయాలు చేస్తూ పేదల కాంగ్రెస్‌ ‌పార్టీ ని తెలంగాణ లో అపరిపక్వత రాజకీయ ఆలోచనలకు కేంద్రం గా నిలుపుతున్నారు. ఆధిపత్యం,నరనరాన వివక్షతను పాటిస్తూ,తమను ఎదిరించిన వారిని భౌతికంగా అంతం చేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ,తమ అనుచరుల ద్వారా అణగారిన వర్గాల పై నిరంతరం సవాలు విసురుతూ అప్రజాస్వామిక పద్దతులు పాటిస్తున్నారు. కమీషన్‌,‌కాంట్రాక్టు ల ద్వారా తమ పబ్బం గడుపుకుంటున్న, ఇలాంటి రాజకీయ నాయకులను తెలంగాణ సమాజాన్ని కి అవసరమా.! తెలంగాణ లో అధికారాన్ని పొందటం అంటే సబ్బండ కులాల సముహారమే కధా..! అధికారం ఏ ఒక్కరి నాయకుడి ప్రోద్బలంతో వస్తున్నది కాదు కధా.!బహుజన వర్గాలను లెక్కచేయకుండా రాష్ట్రంలో,జిల్లాలో ఆధిపత్య ప్యూడల్‌ ‌పునురుద్దణ కోసం జరుగుతున్న కుతంత్రాలకు చరమగీతం పాడుతూ..పోరు వారసత్వాన్ని కాపాడుకోవడానికి అన్ని పార్టీ ల పై ఒత్తిడి తీసుకరావాల్సిన బాధ్యత బహుజన వర్గాల పై ఉంది.

సామాజిక ఉద్యమాభివందనాలతో..

– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక

9441661192

Leave a Reply