Take a fresh look at your lifestyle.

ఆఫ్ఘానిస్థాన్‌…!!

కళ్ళలో కన్నీరొలుకుతున్నది
కడుపు తరుక్కు పోతున్నది
గుండె బరువెక్కుతున్నది
ఆఫ్ఘానిస్థాన్‌ ‌లో కరత్వం
కని,వినీ,ఎరగని రాక్షసత్వం
చూపుతట్టుకోలేని అమానుషత్వం

టీవీలు చూపుతున్న దృశ్యాలు
మానవత్వం లేని అమానుషాలు
అగ్రరాజ్యమట చేతులెత్తేసింది
ఉగ్ర మూకల చేతిలో పెట్టింది
ప్రపంచం నిస్సహాయంగా చూస్తోంది
చేష్టలుడిగి చతికిల పడి పోయింది

దేవుడా! ఏందుకయ్యా ఈ ఘోరకలి!
ఏం పాపం చేసారని వాళ్ళు బలి
దిక్కులేనోళ్ళకు దేవుడే దిక్కట!!
ఇక నీవే చేయాలి ఏదో ఒకటి!!!!

కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply