Take a fresh look at your lifestyle.

పోలింగ్‌ ‌కేంద్రాలు సిద్ధం: అదనపు కలెక్టర్‌ ‌ముజమ్మిల్‌

ఈ నెల 30న జరగనున్న సిద్ధిపేట మునిసిపల్‌ ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ ‌కేంద్రాలను సిద్ధం చేసినట్లు సిద్ధిపేట జిల్లా  అదనపు కలెక్టర్‌, ‌మునిసిపల్‌ ‌కమిషనర్‌ ‌ముజమ్మిల్‌ ‌ఖాన్‌ ‌తెలిపారు. ఈ మేరకు బుధవారం మునిసిపల్‌ అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ ‌నర్సయ్యతో కలిసి ముజమ్మిల్‌ ‌ఖాన్‌ 43‌వార్డులకు సంబంధించిన పోలింగ్‌ ‌కేంద్రాలను పరిశీలించారు. కొరోనా దృష్ట్యా అన్ని పోలింగ్‌ ‌కేంద్రాలలో సోడియం హైపో క్లోరైడ్‌తో పిచికారీ చేపించడం జరిగిందని తెలిపారు. పోలింగ్‌ ‌కేంద్రాలలో ఉండాల్సిన కనీస వసతులను పరిశీలించారు. ర్యాంప్‌, ‌విద్యుత్‌ ‌సరఫరా, మూత్రశాలలు పరిశీలించారు. వోటు కేంద్రాల వద్ద 2 వరుసలలో వోటరుకు వోటరికి మధ్య సామాజిక దూరం ఉండేలా ముగ్గుతో గానీ, పెయింట్‌తో గానీ వృత్తాలు గీయాలని ఏఈ అన్వేష్‌ ‌రెడ్డిని  ఆదేశించారు.  మాస్కులేని వారికి పోలింగ్‌ ‌కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద ఆశా వర్కర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. ఆశా వర్కర్లు పోలింగ్‌ ‌కేంద్రానికి వచ్చే వోటర్లకు శానిటైజర్‌ ‌చేస్తారన్నారు. ప్రతి పోలింగ్‌ ‌కేంద్రం వద్ద మెడికల్‌ ‌సిబ్బందిని సైతం నియమిస్తున్నామనీ, వారు వచ్చే వోటర్లకు  టెంపరేచర్‌ను పరీక్షించడంతో పాటు కొరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తారన్నారు. ఏవైనా కొరోనా లక్షణాలు కనిపించినట్లయితే  వారిని అనుమతించబోమని తెలిపారు. కొరోనా దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి ఫేస్‌ ‌మాస్కులు, చేతి గ్లౌస్‌లు అందచేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్‌ ‌కేంద్రంలో ఒక ప్రొసీడింగ్‌ అధికారి, ఒక అసిస్టెంట్‌ ‌ప్రొసీడింగ్‌ అధికారి, సహాయ పోలింగ్‌ అధికారి, ముగ్గురు మునిసిపల్‌ ‌సహాయక సిబ్బంది, ఒక ఆశా వర్కర్‌, ‌బిఎల్‌వో ఒకరు మొత్తం 1300 మంది అధికారులు ఉంటారనీ,  పోలీస్‌ ‌శాఖ ద్వారా ఇద్దరు కానిస్టేబుల్స్  ఉం‌టారన్నారు.

వికలాంగులకు, వయోవృద్ధులకు వీల్‌ ‌చైర్స్ ‌సిద్ధం..
పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద వికలాంగులకు, వయో వృద్దులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వీల్‌ ‌చైర్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30న(శుక్రవారం) ఉదయం 7గంటలకు పోలింగ్‌ ‌ప్రారంభమవుతుందనీ, సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ ‌జరుగుతుందన్నారు. పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి 440 మంది పోలీసు సిబ్బందిని  ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు ఎస్పీ రామేశ్వర్‌ ‌తెలిపారు.

Leave a Reply