Take a fresh look at your lifestyle.

‌మిడతల దండును అడ్డుకునేలా సన్నద్దం

సరిహద్దుల్లో పరిస్థితిని అధ్యయనం చేస్తున్న కమిటీ 

మిడతల దండు దాడి నేపథ్యంలో ప్పటికే మహారాష్ట్ర, చత్తీష్‌గడ్‌ ‌రాష్ట్రాల సరిహద్దుల్లోని జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ చర్యల్లో భాగంగా ఫైర్‌ ఇం‌జన్లను, జెట్టింగ్‌ ‌మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధంగా పెట్టినట్లు చెప్పారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, రాష్ట్రంలో ప్రవేశించకుండా పర్యవేక్షించేందుకు అయిదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ మిడతల దండు ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవి రాకుండా అడ్డుకునే చర్యలను పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం సిఐపిఎం ప్లాంట్‌ ‌ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ‌డాక్టర్‌ ఆర్‌. ‌సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్‌ ‌సైంటిస్ట్ ‌డాక్టర్‌ ఎస్‌. ‌జె. రహమాన్‌, ‌వరంగల్‌ ‌కన్సర్వేటర్‌ ఆఫ్‌ ‌ఫారెస్టస్ అక్బర్‌, ‌రామగుండం పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్‌ ‌భారతిలతో ఈ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలు శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు రామగుండంలోనే మకాం వేస్తుంది.

హెలికాప్టర్‌ ‌ద్వారా ఆదిలాబాద్‌ ‌నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట పరిస్థితిని గమనిస్తూ ఉంటారు. మిడతల దండు రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తే వాటిని సంహరించే చర్యలను పర్యవేక్షిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ ‌భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, ‌పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. వారు మిడతల దండు కదలికలను గమనిస్తూ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలి. మహారాష్ట్ర, చత్తీస్‌ ‌గఢ్‌ ‌రాష్టాల్ర సరిహద్దు ప్రాంతాల్లో 15 వేల లీటర్ల మాలాతియాన్‌, ‌క్లోరోఫెరిపాస్‌, ‌లామ్డా సైలోత్రిన్‌ ‌ద్రావణాలను సిద్ధంగా పెట్టుకోవాలి. 12 ఫైర్‌ ఇం‌జన్లు, 12 జెట్టింగ్‌ ‌మిషన్లలను కూడా సిద్ధంగా చేసుకోవాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, డిజాస్టర్‌ ‌మేనేజ్మెంట్‌ ‌కమిటీ కార్యదర్శి, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ యూనివర్సిటీ విసి హైదరాబాద్‌ ‌నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, చత్తీస్‌ ‌గఢ్‌ ‌ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలి. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఆయా జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితికి అనుగుణంగా పనిచేయాసేలా ఈ కమిటీలు చూసుకుంటాయి.

Leave a Reply