Take a fresh look at your lifestyle.

పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

నాగర్‌ ‌కర్నూల్‌, ‌జూన్‌ 6. ‌ప్రజాతంత్రవిలేకరి: శనివారం నాగర్‌ ‌కర్నూల్‌ ‌పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాల ఏర్పాట్లపై డీఈవో గోవిందరా జులు పరిశీలించారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ ముఖ్యమైన 8 సబ్జెక్టులకు సంబంధించి జూన్‌ 8‌వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలకు11,301 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 86 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 924 మంది ఇన్విజిలేటర్లు దాదాపు1,000 గదు ల్లో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో గోవిందరాజులు తెలిపారు.ఒక్కో పరీక్ష మధ్య రెండు రోజుల గ్యాప్‌ ‌కూడా ఇస్తున్నారు.

ఉదాహరణకు 8వ తేదీ పరీక్ష రాస్తే మళ్లీ 10వ తేదీన పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ రెండు రోజుల వ్యవధిలో అన్ని పరీక్షా కేంద్రాలను శానిటైజ్‌ ‌చేయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థు లకు, ఇన్విజిలేషన్‌ ‌సిబ్బందికి థర్మల్‌ ‌స్క్రీనిం గ్‌ ‌విద్యార్థులు తెలుసుకోవాల్సినవి, విద్యా ర్థులు ముఖానికి మాస్క్ ‌కచ్చితంగా ధరించా లని, ఒక క్లాస్‌ ‌రూమ్‌లో కేవలం పన్నెండు మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెడ తారని తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు అందు బాటులో ఉంటాయన్నారు. కేవలం పరీక్ష రాసే విద్యార్థులను మాత్రమే ఈ బస్సుల్లో అనుమతిస్తారు. ఒకవేళ విద్యా ర్థుల్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్టయి తే.. అలాంటి విద్యార్థులను వేరే గదిలో కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తారని తెలిపారు. డీఈవో వెంట పరీక్షల నిర్వహణ అధికారి రాజ శేఖర్‌ ‌రావు మంతటి నారాయణ నోడల్‌ అధికారి కురుమయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!