అతిత్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియమకాలకోసం నోటిఫికేషన్ రానున్న సందర్బంగా ట్రైనర్ సుబ్రహ్మణ్యం తో మహేష్ బాబు ఇంటర్వ్యూ.
ప్ర: తెలుగు రాష్ట్రాలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు.
స: అతి త్వరలో ఉంటుంది.తెలంగాణ లో వారం లోపు నోటిఫికేషన్ రావొచ్చు.ఆంధప్రదేశ్ లో సిలబస్ సెట్టింగ్ జరుగుతూ
ఉంది త్వరలో వచ్చే అవకాశం.
ప్ర: ఉపాధ్యాయ ఉద్యోగం చాలా మందికి ఇష్టమైన ఉద్యోగం. అది ఎలా సాధించాలి.
స: అవును చాలా గౌరవమైన ఉద్యోగం. దానిని సాధించడానికి ఒకే ఒక మార్గం కష్టపడి ఒక టైమ్ టేబుల్ ప్రకారం చదవడం.అందరూ ఏమనుకుంటారు అంటే నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం అనుకుంటారు.అది చాలా తప్పు నోటిఫికేషన్ తర్వాత చేయాల్సింది రివిజన్.అప్పుడే ఈ పోటీ ప్రపంచం లో మనం ముందు ఉంటాం.
ప్ర: మీరు నోటిఫికేషన్ ముందు చదవాలి అంటున్నారు.సిలబస్ తెలియదు గా.. అభ్యర్థులతో ఈ విషయం పట్ల గందరగోళం ఉంటుంది.
స: టెట్ మరియు డీఎస్సీ లో ప్రామాణికమైన పుస్తకాలు అంటే స్కూల్ .మరియు బి.ఎడ్ డి.ఎడ్ పాఠ్య పుస్తకాలు ఏ సిలబస్ అయినా అందులోదే ఇస్తారు.కాబట్టి ఆపాఠ్యహొపుస్తకాలు ని నోటిఫికేషన్ రాకముందే క్షుణ్ణంగా గా చదువుకోవడం చాలా ఉపయోగం.
ప్ర: ఎలా ప్రిపేర్ కావాలి.
స: ప్రిపరేషన్ విషయం లో నాలుగు దశలు ఉంటాయి సర్. మొదటిది రిసీవింగ్ అంటే చదవడం ఏకాగ్రత తో జాబ్ సాధించాలి అనే ఉద్దేశంతో చదవాలి.రెండవది అనలైసింగ్ అంటే చదివే విసియాన్ని అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ చదవడం. మూడవది స్టోరే ఇలా చదవడం వల్ల అది మన మెదడు లో స్టోరేజ్ అవుతుంది.ఇక చివరిది రీకాల్ ఇది చాల ముఖ్యమైనది నేర్చుకున్న విసియాలను ఎక్కువ సార్లు రివిషన్ చెయ్యాలి.అప్పుడు మనకు బాగా గుర్తు ఉంది పోతుంది.కనీసం 4 సార్లు అయినా రివిషన్ జరగాలి. ఎక్కువ ప్రాక్టీస్ టెస్ట్ లు రాయాలి అప్పుడు పరిక్ష లో తప్పులు జరగవు.
ప్ర: మీరు రఘుపతి టెట్ మరియు డీఎస్సీ అని పరీక్షలు నిర్వహిస్తున్నారు దాని గురించి చెప్పండి.
స: అవును సర్ ఎస్ జీటీ మరియు ఎస్ ఏ బయోలాజి నిర్వహిస్తున్నాం. అంటే ఉన్న సిలబస్ (ఆందప్రదేశ్ కి సంబంధించిన ది) ను అరవై భాగాలుగా విభజించి…అభ్యర్థుల కు రోజు మార్చి రోజు వారు చదివిన ఆయా టాపిక్స్ మీద మంచి ప్రామాణికంగా రాసిన ప్రశ్నలను అభ్యర్థులకు పంపుతాము దీనివలన ఏ రోజుకు ఆరోజు వారి యొక్క ప్రిపరేషన్ సామర్త్యాన్ని పరీక్షించుకోవచ్చు. ప్రిపరేషన్ అనేది నిరంతరంగా క్రమ పద్ధతిలో కొనసాగడానికి…… గ్రూప్ డిస్కషన్ కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం తో ఈ పక్రియ ను ప్రారంభించాం. చేరదలిచిన ఆంద్ర ప్రదేశ్ విద్యార్థులు 9676060262 అనే నంబర్ కి మెసేజ్ పంపవచ్చు.
