Take a fresh look at your lifestyle.

అకాల వర్షం.. ఆపార నష్టం

మందమర్రి, మే 30, ప్రజాతంత్ర విలేఖరి : పుడమి తల్లితో మమేకమై, దుక్కి దున్ని, పంట వేసి ఇంటిల్లి పాది ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందక పోతుందా అని రైతులు ఎదూరు చూస్తున్న తరుణంలో కాలం కన్నెర్రేజేసి, రైతుల కంట కన్నీరు కారుతుంది. శనివారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షంతో వరి ధాన్యం తడిసిముద్ధయింది. దీంతో రైతులు దీక్కుతోచని స్థితిలో కాలపు ఓడిలో కన్నీరు కారుస్తున్నారు. మందమర్రి మండలంలో వ్యవసాయ భూ విస్తరణం సూమారు 4 వేల 80 ఎకరాల ఉండగా, రైతులు ఎక్కువగా వరి పంటకే మొగ్గు చూపారు. లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో ప్రభుత్వం రైతుల నుండి పండించిన ప్రతి గిం•ను కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా చెప్పారు. దీనిలో భాగంగా గ్రామాలలో ధాన్యం కొనుగోలు కోసం ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసి, కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఏప్రిల్‌ ‌మాసం 10న కొనుగోలు కేంద్రంను ప్రారంభించి, లాన్‌డౌన్‌ ‌కాలంలో తటస్థంగా కొనుగొలు ప్రారంభించింది. ప్రతి కేంద్రంలో సుమారు నాలుగు లారీలు కేటాయించి, ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం కేవలం ఒక్కొక్క సెంటర్‌కు ఒకే ఒక లారీ కేటాయించడంతో కొనుగోలు కేంద్రాల వద్ద భారీగా వరిధాన్యం నిల్వలు ఉండిపోయాయి. దీంతో రైతులు ఆందోళనలకు గురై పలుమార్లు అధికారులతో మోరపెట్టుకోవడం జరిగింది.

అయినప్పటికి వ్యవసాయ సహకార సంఘ నిర్లక్ష్య వైఖరితో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో కాలం కన్నెర్రేజేసి రైతన్న కళ్లలో కన్నీరు తీసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నెలను నమ్ముకొని పంటను వేసి నింగివైపు చూసి కరుణించమని వేడుకొనే దుస్థితి రైతన్నలకు ఏర్పడింది. ప్రభ్వుతం సకాలంలో కొనుగోలు కేంద్రాలకు లారీలును ఏర్పాటు చేయడం, హమాలీలను ఏర్పాటు చేయడంలో ఇటూ వ్యవసాయ ప్రాథమిక సహాకార సంఘం, అటూ ప్రభుత్వం వైఫల్యం చెందాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాల ప్రభావం ఉందని తెలిసి కూడా, కొనుగోలు కేంద్రాల వద్ద అలసత్వం వహించడంపై రైతులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు తరలించిన వరి ధాన్యాన్ని సహాకార సంఘం కొనుగోలు చేసినప్పటికి, మిల్లర్ల వద్దకు తరలించేంత వరకు రైతులే బాధ్యత వహించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి రైతన్నలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అలసత్వం వహించడంతో ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘానికి అలుసుగా మారిందని, దానితో రైతులు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని ఏలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి, నిర్ణీత ధరను రైతుకు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

Leave a Reply