Take a fresh look at your lifestyle.

ప్రేమంటే ఇదేనా ..?

హేమంత్‌ ‌హంతకులను ఎన్‌కౌంటర్‌ ‌చేయాలి
మరోమారు ఆవేదన చెందిన అవంతిరెడ్డి

‌హేమంత్‌ను కిరాతకంగా హతమార్చిన వారందరినీ ఎన్‌కౌంటర్‌ ‌చేయాలని అతని భార్య అవంతిరెడ్డి మరోమారు డిమాండ్‌ ‌చేశారు. తమను నమ్మించి మోసం చేశారని వాపోయారు. తమను బలవంతంగా ఈడ్చుకెళ్లారని, హేమంత్‌ను కిరాతకంగా చంపి తనను విధవను చేశారని ..ఇదేనా ప్రేమంటే అని మండిపడ్డారు. నాపై ప్రేమ ఉంటే నేను ప్రేమించిన వ్యక్తిని చంపుతారా? మా అమ్మానాన్నల కంటే అత్తామామ ఎక్కువగా ప్రేమిస్తారు. మా ఇంటికి 10 మంది వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. అమ్మానాన్న వద్దకు తీసుకెళ్తామని కిడ్నాప్‌ ‌చేశారు. హత్యలో మేనమామలు ఇన్‌వాల్వ్ అవుతారని అనుకోలేదు. మేనమామలు విజేందర్‌రెడ్డి, యుగేంధర్‌రెడ్డి, కలిసి చేశారు. నా భర్తను హత్య చేసిన వారందరినీ ఎన్‌కౌంటర్‌ ‌చేయాలి’అని అవంతి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. కాగా, కూతురు ప్రేమ పెళ్లి నచ్చని అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన హేమంత్‌ని హత్య చేయించారు. ఈకేసులో ప్రధాన నిందితుడు అవంతి మేనమామ గూడూరు యుగేందర్‌రెడ్డి. ఇప్పటివరకు 14 మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి ప్రాంతంలో గురువారం రాత్రి హేమంత్‌ ‌హత్య చోటుచేసుకుంది.

Leave a Reply