Take a fresh look at your lifestyle.

కొరోనా తో నిండు గర్భిణి మృతి

గాంధీ ఆస్పత్రిలో కరోనా తో నిండు గర్భిణి మృతి. డాక్టర్లు దేవుడితో సమానం అని భావిస్తాం కానీ నిండు గర్భిణి మృతి కి డాక్టర్ల నిర్లక్ష్యం మా? లేక బాధితుల విజ్ఞప్తిని పట్టించుకోని సూపర్డెంట్ దా? ఏదైతేనేమి రెండు నిండు ప్రాణాలు బలి అయిపోయాయి..!

వివరాల్లోకి వెళితే ధూల్పేట కు చెందిన వర్షబాయ్ మూడు రోజుల క్రితం కరోనా తో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందిన హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. గత పది రోజుల క్రితం ఈ అమ్మాయి తండ్రి కరొనతో మరణించడం అంత్యక్రియలు వెళ్లిన కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఈ క్రమంలోనె కరోనా సోకిన నిండు గర్భిణీ వర్షా భాయ్ కి గాంధీ ఆసుపత్రిలో సరైన చికిత్స అందక మృతి చెందిందని మృతురాలి బాధితులు ఆరోపణ. నిండు గర్భిణికి సరైన చికిత్స అందించాలని గోషామహల్ ఎమ్మెల్యే పలుమార్లు ఆస్పత్రి సూపరిన్ టెండ్ కు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీకి అత్యంత జాగ్రత్తతో తొ చికిత్స అందించాల్సిన డాక్టర్ లకు సూపరిండెంట్ కు తాను పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సూపరిండేంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు.దైవ సమానులైన డాక్టర్ లకు ఉన్న పేరును సూపరిండెంట్ తీరు వల్ల విఘాతంఏర్పాడుతుందన్నారు.సంఘటన కు బాద్యులు ఎవరు అని ఎంఎల్ఎ రాజాసింగ్ ప్రశ్నించారు.

Leave a Reply