Take a fresh look at your lifestyle.

గర్భిణీలకు అండగా ఉండాలి : జెడ్పిటిసి

నాగర్‌ ‌కర్నూల్‌, ‌మే 18 (ప్రజాతంత్ర విలేకరి) : గర్భిణీ స్త్రీలకు అండగా ఉండాలని కల్వకుర్తి జడ్పిటిసి సభ్యుడు పోతుగంటి భరత్‌ ‌ప్రసాద్‌ ‌పిలుపునిచ్చారు.సోమవారం నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఐసిడిఎస్‌ ‌మరియు ఉపాధిహామీ ఉపాధి హామీపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు.ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ లాక్‌ ‌డౌన్‌ ‌నేపథ్యంలో గ్రామాలలో గర్భిణీలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని సూచించా రు.అందరికీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం గర్భిణీలకు ఇస్తున్నారా లేదా అనే అంశంపై వివరాలుసేకరించారు.

గర్భిణీలకు, చిన్నారులకు ఎలా ఆహారం సరఫరా చేస్తున్నారని ఆరా తీశారు. ఉపాధి హామీపై ఎంపీడీవో,ఏపీ డి,డి ఎల్‌ ‌పి ఓ,సీ డీ టీ ఓ వెంకటేశ్వరమ్మ ,ఏపీఓ,ఏపీఎం గ్రామ కార్యదర్శులతో మాట్లాడారు. అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply