Take a fresh look at your lifestyle.

విలువైన సమయం… సన్మానాలకే అంకితం

The people of the world with new hopes - a kindness in municipality
‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌దంపతులను సన్మానిస్తున్న వడ్డెర సంఘం ప్రతినిధులు

దశాబ్దాలపాటు పురపాలక ఎలికలో కొనసాగిన కాంగ్రెస్‌పాలనతో విసిగిపోయిన జగిత్యాల జనం కొత్త ఆశలతో తెరాస కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకొన్నా భాద్యతలను స్వీకరించిన నాటినుంచి పురపాలనపై తమదైన ముద్ర వేయాల్సిన కొత్త చైర్మన్‌ ‌వర్గం కాస్తా విలువైన సమయాన్ని సన్మానాలకే అంకితమిస్తు జగిత్యాల జనం విస్తుపోయేలా చేస్తున తీరిది. ముప్పది ఏండ్లపాటు జగిత్యాల పురపాలికపై కాంగ్రెస్‌ ‌మార్కు పరిపాలన కొనసాగింది. ఈపరిపాలనతో విసిగిపోయిన జగిత్యాల జనం ప్రజారంజక పాలనను అందిస్తున్న సిఎం కేసిఆర్‌ ‌తెరాస ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు జగిత్యాల పురపాలికపై గులాబి జెండాను ఎగురవేశారు. ఎన్నికలకు ముందే జగిత్యాల రోడ్ల విస్తరణ పనులను చేపట్టి తమ పురపాలన ఇలా ఉంటుందని నమూనాను చూపిన జగిత్యాల తెరాస నాయకులు పోరాడి, ప్రజలను ఓప్పించి పురపాలికపై టిఆర్‌ఎస్‌ ‌పాలకవర్గాన్ని నిలిపారు. చైర్మన్‌గా ఎంపికైన బోగశ్రావణిపై ఎంతో విశ్వాసం ప్రజల్లో ఉండగా పరిపాలనలో తమదైన ముద్రను వేస్తారని ఆశించారు. తీరా పదవీ భాద్యతలు చేపట్టిన నాటినుంచి ఇప్పటి వరకు కేవలం మర్యాదపూర్వక శుభాకాంక్షలు, సన్మానాలు, జన్మదిన శుభాకాంక్షలు, అలయాల సందర్శనతోనే కాలం గడుపుతున్నారనే అభిప్రాయాలు స్థానికుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల నిబందన కారణంగా రోడ్ల విస్తరణ పనులు అగిపోయాయనే స్వయ నిర్ణయానికి వచ్చిన ప్రజలు తిరిగి పురపాలన కొనసాగుతున్నా ఇంకా విస్తరణ కు నోచుకోవడంలేదేందుకనే ప్రశ్నలతో సతమతమవుతున్నారు. ఎక్కడ చూసి నా.. రోడ్ల విస్తరణ ఎప్పుడు అనే చర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి. దీనికితో డు కొత్తదనం పురపాలనలో కనిపిస్తుందని ఆశిస్తున్న మేదావులకు ఇప్పటికి పాలకుల ఆలోచనలు అర్థంకాక విస్తుపోతున్న సంఘటనలున్నాయి. పురపాల నలో ఓకరోజు వేకువజామున కార్మికుల సమస్యలను తెలుసుకొవడానికి వెళ్ళిన మున్సిపల్‌ ‌చైర్మన్‌ అక్కడ హజరైన కార్మికుల సమస్యలను మాత్రమే తెలుసుకొన్నారని తీరా అక్కడి హాజరుశాతాన్ని కూడా పరిశీలించలేదనే అబిప్రాయాలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

రోజురోజుకు పట్టణంలో పెరుగు తున్న అక్రమ నిర్మాణాలు, అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములు, పురపాలికలో నెలకొన్న అవినీతి వంటి ఆంశాలపై ఉక్కుపాదం మోపాల్సిన మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌శ్రావణి నేటికి ఆదిశగా ప్రయత్నాలను మొదలు పెట్టిన దాఖలాలు లేవనే అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. విధ్యావంతురాలిగా, సందర్బోచితంగా మాట్లాడే నైపుణ్యం ఉన్న మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌దొరికిందనే అశలతో ఉన్న జగిత్యాల ప్రజలకు తమదైన మార్కును పురపాలనలో చూపా)ని, ఎన్నో ఎండ్లుగా జగిత్యాల ప్రజలు ఎదురుచూస్తున్న సరికొత్త పరిపాలనను ప్రజలకు కొత్త చైర్మన్‌ అం‌దించాలని ప్రజలు అశిస్తున్నారు. ఇక పురపాలనపై దృష్టిసారిస్తారేమో వేచి చూడడం జగిత్యాల ప్రజల వంతే.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply