Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ఎత్తేసినా జాగ్రత్తలు తప్పనిసరి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో దేశంలో అమలులో ఉన్న లాక్‌డౌన్‌కు సంబంధించి అనేక సడలింపులు ఇచ్చామని కేంద్ర •ంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రెడ్‌జోన్‌, ‌హాట్‌స్పాట్‌లు లేని ప్రాంతాల్లో పరిశ్రమలు, దుకాణాలు తెరుచుకోవచ్చని సడలింపులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ..భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్రం అనుమతిచ్చిందని, వ్యవసాయ పనులకు కూడా సడలింపులు ఇచ్చిందన్నారు. లాక్‌డౌన్‌ ‌విషయంపై అన్ని రాష్టాల్ర ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుసుకుంటున్నారని తెలిపారు. 8 రాష్ట్రాల్లో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు లేవని, మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారితోనే ఎక్కువ కేసులు నమోదవు తున్నాయని ఆయన అన్నారు.

దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని కొన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయని, లాక్‌డౌన్‌ ఎత్తివేసినా రెండు నెలల వరకు జాగ్రత్తలు పాటించాలని కిషన్‌రెడ్డి సూచించారు. మాస్కులు లేకుండా ఏ ఒక్కరూ బయటకు రాకూడదని, ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు పెరగబోతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. మూడున్నర ఏళ్లకు సరిపడా ఆహార ధాన్యాలు మన దగ్గర ఉన్నాయని, కొత్తగా వ్యవసాయ ఉత్పత్తులను ఎలా దాచుకోవాలన్నదానిపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర •ంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!