Take a fresh look at your lifestyle.

త్వరలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ పీఆర్సీ

రెవెన్యూ డైరీ ఆవిష్కరణ సభలో సీఎం కేసీఆర్‌

‌రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కొత్త పీఆర్సీని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. దీంతో పాటు రెవెన్యూ శాఖలో అన్ని కేడర్ల పదోన్నతులు కల్పించి ఖాళీల భర్తీకి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్‌లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ ‌సర్వీసెస్‌ అసోసియేషన్‌ (‌ట్రెసా) రూపొందించిన రెవెన్యూ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగుల డైరీలో రెవెన్యూ చట్టాలు, ముఖ్యమైన జీవోల గురించి సమగ్ర సమాచారం పొందుపర్చారని అభినందించారు.

రెవెన్యూ శాఖలో క్రింది స్థాయి సిబ్బందిని పెంచమని, అలాగే, వీఆర్వోలను రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేయమని ట్రెసా సీఎం దృష్టికి తీసుకెళ్లింది. అలాగే, ధరణికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించగా, వాటన్నింటిని పరిష్కరించడానికే కలెక్టర్ల సమావేశం నిర్వహించామనీ, పెండింగ్‌ ‌సమస్యల పరిష్కారానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాసగౌడ్‌, ‌ప్రశాంత్‌ ‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌ట్రెసా అధ్యక్షడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌ ‌కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌, ‌కార్యదర్శులు రాంరెడ్డి, నిరంజన్‌రావు, వాణి, సంతోష్‌, ‌మాధవి, సిసిఎల్‌ఏ ‌యూనిట్‌ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గం నేతలు నారాయణరెడ్డి, నాగమణి, వివిధ జిల్లా అధ్యక్షులు రమణ్‌రెడ్డి, శుక్ల కుమార్‌, ‌రాములు పాల్గొన్నారు.

Leave a Reply