Take a fresh look at your lifestyle.

సర్వ మానవాళి క్షేమం కోసం ప్రార్థనలు చేయండి

  • పేద ముస్లిం మైనారిటీలకు రంజాన్‌ ‌తోఫా
  • ఫ్రెండ్స్ ‌ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు 

‌జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ముర్షద్‌ ‌గడ్డలో గురువారం రంజాన్‌ ‌పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ ‌ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనారిటీలకు నిత్యావసర వస్తువుల కిట్స్, ‌ప్రతి ఒక్కరికీ 500 రూపాయల నగదును మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..కొరోనా లాక్‌ ‌డౌన్‌ ‌నేపథ్యంలో పని లభించక దినసరి కూలీలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రేషన్‌ ‌కార్డు కలిగి ఉన్న వారికి ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, 1500 రూపాయల నగదు అందించి ఏప్రిల్‌ ‌నెల ఆదుకున్నామనీ, అదే విధంగా వచ్చే మే నెలలో కూడా ఆదుకుంటామన్నారు. సర్వ మానవాళి క్షేమం కోసం ప్రార్థనలు చేయాలని కోరారు.

రంజాన్‌ ‌పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఉపవాసం ఉన్న మీరు రాష్ట్ర, దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అల్లాను ప్రార్థించాలన్నారు. రంజాన్‌ ‌పండుగ సందర్భంగా ఇంట్లోనే నమాజ్‌ ‌చేయండి. ప్రభుత్వానికి సహకరించాలన్నారు. సిద్ధిపేటలోని అర్హులైన ముస్లింలందరికీ అందేలా ఏర్పాట్లు చేయిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. కొరోనా నేపథ్యంలో విపత్కర పరిస్థితి వచ్చినా పేదలను ఆదుకునేందుకు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో ప్రభుత్వం ముందున్నదన్నారు. కొరోనా అందరి సమస్య మనమంతా ఐక్యంగా కలిసి కరోనా పై పోరాడదామన్నారు.

సిద్ధిపేట కొరోనా ఫ్రీ జిల్లా అయ్యిందని, బయటకు రావొద్దు. ప్రజలంతా ప్రభుత్వానికి లాక్‌ ‌డౌన్‌ ‌కు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారన్నారు. కొరోనా మనిషిలో ప్రవేశించేది గొంతులోకి, ఆ తర్వాత అవయవాలపై ఆ వైరస్‌ ‌దాడి చేస్తుంది. ఇందు కోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుచి, శుభ్రత అలవాటు చేసుకుని వేడి నీరు తాగాలన్నారు. జలుబు చేస్తే ఆవిరి పట్టినట్లు, పసుపు వేసి ఆవిరి పట్టాలన్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. మాకేం అవుతుంది. ఏం కాదులే అనే నిర్లక్ష్యం వద్దనీ, అనవసరంగా బయట తిరగొద్దన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!