Take a fresh look at your lifestyle.

శివుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించా: మంత్రి హరీష్‌రావు

Pray for the blessings of Lord Shiva on all people Minister Harishrao

సిద్ధిపేట జిల్లాలో ఏ దిక్కున చూసినా దేవాలయాలు కనిపిస్తాయనీ, జిల్లాలో నలుమూలల ప్రముఖ పుణ్యక్షేత్రాలు వెలిశాయనీ,  జిల్లా ఆలయాల ఖిల్లాగా మారిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు  అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట  ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో  మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమర్‌నాథ్‌ ‌మంచు శివ లింగాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఈ భారీ అమర్‌నాథ్‌ ‌సెట్టింగ్‌ ‌చూస్తుంటే మనం నిజంగానే అమర్‌నాథ్‌లోనే ఉన్నామనే భావన కలుగుతుందన్నారు. సిద్ధిపేట ప్రజలకు దైవభక్తి, దాత గుణం నిండుగా ఉన్నాయనీ, అందుకే భక్తి కార్యాలకు ముందుంటారని పేర్కొన్నారు.

ఈ మైదానం చూస్తుంటే యావత్‌ ‌సిద్ధిపేట ఇక్కడే ఉన్నదని, ఈ మహత్తర కార్యం జరగడానికి సహకరించిన దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అమర్‌నాథ్‌  ‌తరహాలో భారీ సెట్టింగ్‌ ‌వేయడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ధార్మిక ఉత్సవ సమితి వారు చేసిన ఈ దైవ కార్యానికి నాంది పలికినందుకు ప్రశంసించారు. శివలింగాన్ని దర్శించుకున్న భక్తులను కనువిందు చేయడానికి తెలంగాణ సాంస్కృతిక కళా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  400 మంది కళాకారులు భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఆ శివుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అమర్‌నాథ్‌ ‌జ్యతిర్లింగం మన కళ్లకు కట్టినట్టుగా చూపించినందుకు డిజైనర్‌కూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌, ‌సుడా, మార్కెట్‌ ‌చైర్మన్లు రాజనర్సు, రవీందర్‌ ‌రెడ్డి, పాల సాయిరాం, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy