Take a fresh look at your lifestyle.

ప్రణబ్‌ ‌మృతి దేశానికి తీరని లోటు: కాంగ్రెస్‌ ‌నేత మల్లు భట్టి

ప్రణబ్‌ ‌మృతి దేశానికి తీరని లోటని కాంగ్రెస్‌ ‌నేతలు మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డిలు అన్నారు. ఆయన చేసిన సేలను వారు గుర్తు చేసుకున్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహ రించారని కొనియాడారు. ఆయన ఆదర్శాలు ఎప్పటికీ అనుసరణీయమని అన్నారు. భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. ప్రణబ్‌ ‌మృతికి రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ‌శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ ‌ముఖర్జీ మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రణబ్‌ ‌మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే మండలిలో సంతాప తీర్మానాన్ని •ంమంత్రి మహమూద్‌ అలీ ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ భారతదేశం ఒక శిఖర సమానుడైన నాయకుడిని కోల్పోయిందన్నారు. అర్థ తాబ్దంపాటు భారత రాజకీయాల లో క్రియాశీలక భూమిక పోషించిన ప్రణబ్‌ ‌కర్మయోగి అని అభివర్ణించారు. అంకితభావంతో అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. చేపట్టిన ప్రతి పదవికి ప్రణబ్‌ ‌వన్నె తెచ్చారని కేసీఆర్‌ ‌కొనియాడారు. కేంద్రమంత్రిగా ప్రణబ్‌ ‌విశేష సేవలు అందించారన్నారు. జఠిల సమస్యల్ని పరిష్కరించడంలో ప్రణబ్‌ ‌నేర్పరి అని, తెలంగాణ సాధనలో ప్రణబ్‌ ‌పాత్ర ఉందని సీఎం కెసిఆర్‌ ‌వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లుపై ప్రణబ్‌ ‌సంతకం చేశారని కేసీఆర్‌ ‌తెలిపారు. భారతదేశం శిఖర సమానమైన నాయకుడిని కోల్పోయింది.

1970 తర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్‌ ‌ముఖర్జీ పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. క్రమశిక్షణ, కఠోర శ్రమ అంకితభావంతో అంచలంచలుగా ఎదిగారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థాయిలో నిలబెట్టారు. ప్రపంచంలోనే ప్రణబ్‌ ‌ముఖర్జీ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. మ•న్నత రాజనీతిజ్ఞుడిగా మెలిగారు. రాజకీయాల్లో ఆయన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. మిత్ర పక్షాలను కలుపుకుని పోవడంలో విశ్వస నీయుడిగా ఆయన పేరొందారని ఈ సందర్బంగా సిఎం కెసిఆర్‌ అన్నారు. ప్రతిపక్షాలను సిద్దాంతపరంగా మాత్రమే విమర్శించేవారు. వ్యక్తిగతంగా విమర్శించే వారు కాదు. జఠిల సమస్యను సామరస్యంగా పరిష్కరించే వారు ప్రణబ్‌. ‌భారత 13వ రాష్ట్రపతిగా అత్యున్నత పదవి అలంకరించిన, జాతి నిర్మాణంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2019లో భారతరత్న అవార్డును బహుకరించారు. రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగా కాకుండా, రాష్ట్ర విభజన బిల్లుపై ముద్ర వేసి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. ప్రణబ్‌ ‌ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది అని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. ప్రణబ్‌ ‌మృతి పట్ల తెలంగాణ శాసనసభ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. కెసిఆర్‌ ‌తీర్మానాన్ని బలసరుస్తూ విపక్ష ఎంఐఎం సభ్యుడు పాషా ఖాద్రీ మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ సమస్యల్లో ఉన్న ప్రతి సందర్భంలో ప్రణబ్‌ ‌ముఖర్జీయే గుర్తుకొచ్చేవారని ఖాద్రి అన్నారు. ప్రణబ్‌ ‌దాదా వివిధ కేంద్ర మంత్రిపదవులు అలంకరించారని అన్నారు.వాటిని సమర్థంగా నిర్వహించారని, ఆయన మృతి దేశానికి తీరనిలోటని సంతాపం తెలిపారు. మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్‌ ఎం‌తో సహకరించారు అని గుర్తు చేశారు.రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై ప్రణబ్‌ ‌రాజముద్ర వేసి చరిత్రలో నిలిచిపోయారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో రాష్ట్రపతి భవన్‌లో కేసీఆర్‌తో పాటు పలువురం ప్రణబ్‌ను కలిశాం. ఆ సందర్భంగా లక్ష్యం సాధించారంటూ కేసీఆర్‌ను ప్రణబ్‌ ‌ప్రశంసించారని గుర్తు చేశారు. ప్రణబ్‌ ‌తన పుస్తకంలో కేసీఆర్‌ ‌గురించి ఉటంకించారు.

ఉద్యమ నేపథ్యంలో ఎదిగి వచ్చిన నాయకుడు సోలిపేట
దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిరాడంబర నాయకుడు అని, ఆయన ఎమ్మెల్యే కాక ముందే తనకు ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉందని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. ఇటీవలే మరణించిన రామలింగారెడ్డి మృతిపట్ల తెలంగాణ శాసనసభలో సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్‌ ‌ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ.. బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తదని తన ఊహకు కూడా లేకుండెనని, బాధాతప్త హృదయంతో ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నానని అన్నారు. రామలింగారెడ్డి మృతిపట్ల ఈ సభ సంతాపం తెలుపుతోంది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉద్యమ నేపథ్యంలో ఎదిగి వచ్చిన నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి అని శ్లాఘించారు. నిత్యం ప్రజల మధ్యనే మనుగడ సాగించిన నిరాడంబరగా నేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఆకస్మిక మరణం దుబ్బాక నియోజకవర్గం ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల హృదయాలను కలిచివేసింది.సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన సోలిపేట రామలింగారెడ్డి.. విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. మెదక్‌ ‌జిల్లాలో జరిగిన ఉద్యమాలకు బాసటగా నిలిచారు. జర్నలిస్టుగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారాల కోసం అనేక రాజీ లేని పోరాటాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కాక ముందు నుంచే తనకు ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉంది.

తాను నమ్మిన ఆదర్శాలను ఆచరణలో పెట్టిన అభ్యుదయవాది. వరకట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కాళోజీ, తన చేతుల దుగా ఆదర్శ వివాహం జరిగింది. అదే విధంగా తన పిల్లలకు కూడా వివాహాలు జరిపించారు. ప్రభుత్వం ఇచ్చిన జర్నలిస్టు కాలనీలో ఇల్లు కట్టుకుని నిరాడంబరంగా నివసించారని అన్నారు. రామలింగారెడ్డిలోని నిబద్ధత, విశ్వసనీయత, నాయకత్వ లక్షణాలు గమనించి.. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున టికెట్‌ ఇచ్చాం. ఆ ఎన్నికల్లో దొమ్మాట నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ ‌తరపున గెలిచి యువ నాయకుడిగా శాసనసభలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. సమైక్యవాదులు కల్పించే ప్రలోభాలకు లొంగకుండా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉద్యమ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. 2014, 18 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం పని చేసేవారు. మధుమేహ వ్యాధితో బాదపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆగస్టు 6న తుదిశ్వాస విడిచారు అని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply