Take a fresh look at your lifestyle.

‌ప్రాణ కవచం..!

మంచో.. చెడో..
కరోనా వైరస్‌ ‌తో
మనం మన రక్షణకై
ముఖ కవచం ధరించడం
కరచాలనం విడవడం
భౌతిక దూరం పాటించడం
వ్యక్తిగత పరిశుభ్రతలాంటి
స్వఛ్ఛతా నియమాలు
ఎన్నో  నేర్చుకున్నాం..

కాలుష్యమైతేనేమి
కరోనా అయితేనేమి
ప్రాణ రక్షణ చర్యలు
చేపట్టడం మంచిదే..
ఎవరికి వారు తాము
బాగుండాలనుకుంటే
ఎలా సాధ్యమవుతుంది
అందరు బాగుంటేనే
తామూ బాగుంటమనే
నిజం గ్రహించాలి..

నిర్లక్ష్యం వీడాలి
చైతన్యం పెరగాలి
ప్రకృతి వనరులు
పరిమితంగా వాడాలి
మొక్కలు నాటాలి
అడవులు పెంచాలి..
పొరపాట్లు చేయక
వచ్చే పాట్లను రానీయక
జీవకోటి నిలయం ఐన
ధరణి ప్రాణ కవచం ఐన

ఓజోన్‌ ‌పొర సంరక్షణం..
చేస్తేనే మన పరిరక్షణం..
మన భవిత సుభీక్షం..!!
-అర్జున (కలం పేరు),పాల్వంచ హరికిషన్‌, 9502451780

Leave a Reply