- ప్రభుత్వ హాస్పిటల్ లో ఉచితం…
- వారంలో 50వేల టెస్టులు నిర్వహిస్తాం..: మంత్రి ఈటల
కొరోనాపై ఉన్నతస్థాయిలో నిత్యం సమీక్ష చేస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కొరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ చెప్పిందన్నారు. ప్రైవేటు దవాఖాన ల్లో కొరోనా పరీక్ష ధర రూ. 2,200గా నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
ఐసీయూ లో కాకుండా మాములు వైద్యానికి రు.4000.. ఒక్క రోజుకు వెంటిలేటర్‌పై లేకుండా ఐసీయూలో ఉంచితే రూ. 7,500.. వెంటిలేటర్‌పై ఉంచితే రూ. 9వేలు ఛార్జీ చేస్తారని వివరించారు. కొరోనా లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయరని, లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయాలని మార్గదర్శకాలు ఇస్తున్నామని మంత్రి ఈటల చెప్పారు.