Take a fresh look at your lifestyle.

‘‘ఇజ్జెత్‌ ఉం‌డాలె!’’

“అద్దంల మొకం తీర్గ ఇజ్జత్‌ ‌యేమన్న కంటికి కానచ్చేదా!తొవ్వపొంటి యెదురువడి పల్కరిచ్చేదా తీ! ఇజ్జెతనేది కొరోనా మారాసొంటిది.యెటుతిరిగి,యెట్లజేశి మనిషిని యేస్కపోతది. ఎటుగూడి దాని జోలికి పోకుంట పైలంగుండాలె.థూ! అని బజాట్న యెవలన్న మొకం మీద ఊంచిండ్లనుకో!అటిటు జూశి అంగి లేవట్టి తుడుసుకుంటె కతం!అదేమన్న యెంబడచ్చేటిదా!బుజం మీది కండువనా కానచ్చేటందుకు!? అనుకుంటెనే అన్ని కతలు వడుడే,యేం లేదనుకుంటె ఒక్క శిత్తం! ఎవలికి యెరుకైత లేదుగని ఇజ్జత్‌ ‌తోని బతుకుతనంటె సింగిల్‌ ‌చాయి సుత దొర్కదుల్లా!దునియాల ఇజ్జత్‌ ‌తోని బతికెటోనికి బజాట్నింత వుప్పుసుత బుట్టదంటరు.నీయత్‌ ‌గ ఏ దందా జేశిన దివాల్‌ ‌దీశి నెత్తిన గుడ్డేసుకునుడే,గని పైకి లేసుడుంటదా!కల్తీ లేకుంట ఏ దందానన్న నుడుసుడైతదా! జెప్పుండ్రి!?”

VIKRAMARKUDUఅద్దంల మొకం తీర్గ ఇజ్జత్‌ ‌యేమన్న కంటికి కానచ్చేదా!తొవ్వపొంటి యెదురువడి పల్కరిచ్చేదా తీ! ఇజ్జెతనేది కరోనా బీమారాసొంటిది.యెటుతిరిగి,యెట్లజేశి మనిషిని యేస్కపోతది. ఎటుగూడి దాని జోలికి పోకుంట పైలంగుండాలె.థూ! అని బజాట్న యెవలన్న మొకం మీద ఊంచిండ్లనుకో!అటిటు జూశి అంగి లేవట్టి తుడుసుకుంటె కతం!అదేమన్న యెంబడచ్చేటిదా!బుజం మీది కండువనా కానచ్చేటందుకు!? అనుకుంటెనే అన్ని కతలు వడుడే,యేం లేదనుకుంటె ఒక్క శిత్తం! ఎవలికి యెరుకైత లేదుగని ఇజ్జత్‌ ‌తోని బతుకుతనంటె సింగిల్‌ ‌చాయి సుత దొర్కదుల్లా!దునియాల ఇజ్జత్‌ ‌తోని బతికెటోనికి బజాట్నింత వుప్పుసుత బుట్టదంటరు.నీయత్‌ ‌గ ఏ దందా జేశిన దివాల్‌ ‌దీశి నెత్తిన గుడ్డేసుకునుడే,గని పైకి లేసుడుంటదా!కల్తీ లేకుంట ఏ దందానన్న నుడుసుడైతదా! జెప్పుండ్రి!? ముత్తెంతన్న మోసం జేయకుంట ముల్లెలు గట్టినోన్ని ఒక్కల్ని జూపెట్టుండ్లి!? ఇజ్జెత్‌ ‌తోని ఇడుపుకాయితం జేసుకుంటెనే అవ్వల్‌ ‌దర్జా బతుకుంటది.

ఎన్ని దిక్కుమెల్ల యేశాలేత్తె,యెంత మంది కొంపలు ముంచితె,యెన్ని కబ్జాలు శేత్తె గిట్ల రాజకీయాలల్ల పైకచ్చి మంత్రులైండ్లు! ఏ పార్టీల యెంతకాలముంటరనేది యెవలికెరుక!’’భి పారం’’యే పార్టోలిత్తె గదే మన పార్టీ అనుకోవాలె!కండువదేమున్నది,తీశి అవుతలేశి కొత్తకండువ కప్పుకునుడెంతశేపుల్లా!గద్దె మీదున్న పార్టీల్నే సందు జేసుకోవాలె! తాపకోపాలి పెద్ద లీడర్ల కాళ్ళమీద పడుడు నేర్వాలె!ఏదో ఓనాటికి ఎమ్మెల్లె టికెట్‌ ‌దొర్కక పోదనేటి ఆశ తోనుండాలె!గెలుపు రుశి దొరికిందంటె సాలుపో!ఇగ తోపే!మొన్నటిదాంక నువు సైకిల్‌ ‌మీద తిరిగి పాలమ్మినవా! మూల మీది మార్కిట్ల ఆలుగడ్డమ్మినవా! యేడేడ యెసొంటి లంగ దందాలు ఎంతగనం జేశినవనేది యెవలడుగుతరుల్లా!’’ ఎమ్మెల్లే సాబ్‌!‌నమత్తే!’’అనెటోళ్ళు మస్తుమంది మబ్బుల్నే యింటి గల్మకాడ దండం బెట్టెటందుకు జమయితాంటరు. నాలుగు కాంటాక్టులు బట్టుకోని కాయితాలమీద కతమనిపిత్తె సంపుడు పుంజెం బుట్టినట్నేనాయె! సర్కార్‌ ‌బూము లేడున్న యో యెరుకైతె జాలు,అవి మన పాలయైనట్నేనాయే! ఎంతల పని! ఇజ్జెతను కుంటె గివన్న యితయా! మీడియోళ్ళు మనోళ్ళే అయినంక గిసొంటి జోలి టీ.వీ.లల్ల పేపర్ల రాకుంట మాగనే జూత్తరు.కోర్టు కేసులైతె గవాయి లేకుంట జూసుడు మనెంబటి తిరిగెటోళ్ళకు మాగ యెరుకున్నదేనాయె! కేసులు గీసులు పెద్దగైతె పైనోళ్ళు జూసుకుంటరు.

పరాశికాలనుకునేరుల్లా! యెర్కున్న ముచ్చట్లే జెప్పబట్టిన!బేంకులల్ల కోట్లకు కోట్లు అప్పులు జేశి బిందాస్‌ ‌గా గాలిమోటరెక్కి దేశం బొయినోళ్ళు యెంతమంది యెరుకలేదుల్లా! అర్సుకునెటోళ్ళను మంచిగ అర్సుకునే ఇకమ్మ తుండాలె గని మన తానున్న బేంకులన్ని మనయే అనుకోవాలె! ఇజ్జెత్‌ ‌తోని లాఫర్వా నుకుంటె దునియా మనదే పో!మన తాన బేంకు అప్పు ఒక్క కిస్తీ గట్టుడు ఆలిశెమైతె ‘‘యెట్లుల్లా! బేంకోళ్ళచ్చి యింటి మీద బడ్తరు! అని బుగులుతోనుండెటోళ్ళను జూత్తె ఇచ్చంత్రమనిపిత్తది!.ఇజ్జెత్‌ ‌తోని సావంటె గిదేనుల్లా!లచ్చతీర్ల దుమ్ముమన్ను పోశెటోళ్ళుంటరు. గిసొంటియి యిని ఇడిశిపెట్టాలె!కోర్టులు,కాయితాలు గిట్లుంటె సూర్ల జెక్కాలె!మన పెద్దోళ్ళను జూశి గిసొంటియె మంచిగ నేర్సుకోవాలె!. నోటుమీద పోట్వ? లేదుగని అంతకన్న పెద్దోళ్ళున్నరు! గాళ్ళకు పొద్దుకు పదిమల్కల దండం బెట్టాలె!

‘‘కుర్చీ యేసుకోని కూసోని పనులు జేయిస్త! మళ్ళచ్చే పండుగకు మీ కొత్త ఇండ్లల్ల పాలు పొంగియాలె! కల్లు,గుడాల్‌ ‌తోని నాకు దావతి య్యాలె!’’అని జెప్పినోళ్ళు జేశిండ్లా!యేండ్లుదాటినా పాలు పొంగక పాయె!బింకిల కల్లు పాశిపాయె!అతికెం ఆశపడి ఇండ్లు పీక్కున్నోళ్ళను ఆగం జేశిపొయినోళ్ళకు ఇజ్జెత్‌ ‌వుందానుల్లా! గాళ్ళకు లేని ఇజ్జెత్‌ ‌మనకెందుకని అన్ని మరిశి అసొంటోళ్ళను ఎలచ్చన్ల బుజాలెక్కిచ్చుకొని ఓట్లేశి గెలిపిచ్చినోళ్ళకు సుత ఇజ్జెత్‌ ‌లేదాయె! ఇంటికో నౌకరనె, దళితున్ని గద్దెక్కిత్తననె!గాళ్ళకు మూడెకురాలు రాశిత్తననె!ఒక్కటి గాదుల్లా!లచ్చ మాటలు జెప్పి ఒక్కటి సుత జేయకుంట ఎగ్గొట్టి మొకం మాడిశి నోళ్ళకే లేని ఇజ్జెత్‌ ‌వుంటేంది లేకుంటేందుల్లా! నీళ్ళు,నిధులు,నౌకర్ల కోసం ఉద్దెమం జేసి నెత్తుటి వరదల పానాలిచ్చినం. నిధులు,నౌకర్లు ఇంటోళ్ళకిచ్చి మనకు నీళ్ళిడిశిన ఇజ్జెత్‌ ‌తక్కువ బతుకులను జూశినంక సుత ఇజ్జెత్‌ ‌గావాల్నా అనిపిత్తలేదా!. ఇజ్జెత్‌ ‌లేని బతుకులే మంచిగున్నయి. ఇజ్జెత్‌ ‌బడేటి బతుకులే బతుకలేకున్నయి.

నిన్నటి పొద్దు జరంత ఆలిశెంగ లేశి పోన్‌ ‌దేవులాడి సూడబోతె శాన్నే వాట్సప్‌ ‌ముచ్చట్లచ్చి నయి.మొయినన్న యేందోబంపిండు.అన్ని ఇకమత్తులు యెరికున్నోడాయె,అన్నంటె జర శాన్నె కదర్‌ ‌జేత్త!అన్న పంపిన ముచ్చట జూడబోతె శిత్రంగున్నది. ‘‘బజాట్న గిప్పుడె పేపర్‌ ‌కొని సదువబట్టిన!కని..గిప్పుడే యెరు కైంది,నాకన్న మునుపే గీ పేపర్‌ ఇం‌కోళ్ళు కొన్నరుల్లా!’’ అని బెట్టిండు.కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్న దినం పేపర్ల అమర వీరుల పోట్వలుంటయనుకుంటిమి.ఉద్దెమానికి అప్పుడడ్డంబడి,గిప్పుడు మంత్రులైన ఇజ్జత్‌ ‌లేనోళ్ళ పోట్వలే ముందటి పేజీలల్లున్నయి.గాళ్ళే గా దినం పేపర్ల పేజీలన్ఫి గుత్త బట్టిండ్లు మొయినన్న కైత్వం సమజయింది.’’పేపర్‌ ఇం‌తకు మునుపే ఎవలో కొన్నరు!’’ అనేటి పిడికెడు అచ్చరాలతోని రాజ్జెంకత ఒక్క ముక్కల జెప్పిన మొయినన్నకు సలాం జేయాలె! మీడియా,పేపర్లనే కాదుల్లా! గాళ్ళు మనం కొట్లాడి తెచ్చుకున్న.మన రాష్టాన్ని సుత కొనుక్కున్నరు. ఏం జేద్దాం! ఇజ్జెత్‌ ‌దక్కువ బతుకులు!థూ!

‘‘సూడ్రా! బయ్‌!ఇ‌క్రమార్క్’’!
‘‘ఇప్పటిదాంక యింటివి గదా! ‘‘గింతగనం ఇజ్జత్‌ ‌లేని బతుకులే అయితె నిలువ నీడ లేకుంట బోవాలె కదా! చెప్పెటోళ్ళేంజెప్పినా ఇనెటోళ్ళకు ఇజ్జతుండాలె అంటరు కదా! గీ ఇనెటోళ్ళకు ఇజ్జెత్‌ ఎప్పుడత్తది!?’’నా ప్రశ్నకు జవాబియ్యకుంటె నువు ఎన్ని మల్కల జెప్పినా లగు మరిశే ఇజ్జత్‌ ‌తక్కువోనివని అందరి చెవులేత్త! పైలం!’’అని యెప్పటి తీర్గనే బెదిరిచ్చేటి బేతాళుని శవాన్ని బుజాన్నేసుకొని ‘‘ఇను బేతాళ్‌! ‌బతుకు తోవలబాంఛననుకుంట పింఛన్‌ ‌బిచ్చానికి జోలె వట్టే కాడికి ఎట్లచ్చినయి!?దోతులూడంగ దొరసానితోని కచ్చీర్లెక్కి బలుసాకైన సాలని పట్నాలుర్కి బోయిన దొరలెట్ల ఎన్కకచ్చిరి? కల్వకు దెచ్చిన ఇసిరెలు దొరల బొండికాయల మీద బెట్టిన నాటి ఎర్రవారిన జూపులిప్పుడు బాంచ బతుకు లెట్లాయె!?గీ బతుకులిడిశి పెట్టిన దినమే’ఇజ్జెత్‌’అచ్చిందనుకోవాలె! అని జెప్పుకుంట ఇక్రమార్క్ ‌నడ్వ బట్టిండు..నడ్వ బట్టిండు…
– ఎలమంద – తెలంగాణ.

Leave a Reply