Take a fresh look at your lifestyle.

ఆగని రైతుల నిరసనలు

  • పసుపు, కూరగాయల రైతుల గగ్గోలు
  •  కందులు కొనాల్సిందే రైతుల డిమాండ్‌

రాష్ట్రంలో  పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని ,డిమాండ్‌ ‌చేస్తూ రైతులు రెండోరోజు కూడా రోడ్ల మీదికి వచ్చారు. శుక్రవారం మార్కెట్‌యార్డులు రైతుల నిరసనలతో మార్మోగాయి. మార్కెట్‌ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు నచ్చ చెప్పినా రైతులు తమ నిరసనోద్యమాలను  కొనసాగించారు. కంది,మిర్చి, పత్తి,పసుపు రైతులు ధర్నాలు కొనసాగించారు.  ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని ఉట్నూర్‌, ‌జైనాథ్‌, ‌తలమడు మండలాల మార్కెట్‌ ‌యార్డులో రైతులు ఆందోళనలు చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌సూర్యాపేట మార్కెట్‌యార్డుల్లో కందికొనుగోలు నిలిపివేశారు. మరోవైపున క్వింటాళ్లకొద్ది కందులను తీసుకొచ్చి రైతులు మార్కెట్‌  ‌యార్డులను నింపివేశారు. 50వేల మ్రె ‌టన్నుల కందులను కొనుగోలు చేసేందుకు అనుమతిని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పటికీ కేంద్రం నుంచి  అనుమతి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారమే కందులు కొంటామని  మార్కెఫెడ్‌ అధికారులు రైతులకు నచ్చ చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువలో ఎక్కువ 56వేల మెట్రిక్‌టన్నుల  కందులు కొనుగోలు చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

 

అయితే మార్కెఫెడ్‌ ‌నిబంధనలతో తమకు నిమిత్తం లేదని, క్వింటాల్‌ ‌రూ.5800లు చొప్పున రైతులు పండించిన కందులన్నింటినీ కొనుగోలు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్‌ ‌చేశాయి.వికారాబాద్‌ ‌జిల్లా థారూర్‌మండలంలో, తాండూర్‌లలో రైతులు ఆగకుండా నిరసనలు తెలిపారు. కాగా మిర్చి రైతులు వరంగల్‌ఎనుమాముల మార్కెట్‌ ‌యార్డులో, ఖమ్మం, కరీంనగర్‌, ‌సూర్యాపేట, భువనగిరి, మార్కెట్‌యార్డులలో ఆందోళనలు చేశారు.వేసవికాలం వచ్చిన తర్వాత కూడా పత్తిలో తేమ ఎలా ఉంటుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్‌ అధికారులు శుక్రవారం కూడా ఆధార్‌కార్డు, పాస్‌బుక్‌, ‌బ్యాంక్‌ అకౌంట్‌, ‌వ్యవసాయాధికారి ధృవీకరణ పేరుతో రైతులు నానావిధాలు ఇబ్బందుల పాలు చేశారు.నిజామాబాద్‌, ‌జగిత్యాల, నిర్మల్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాలో పసుపు రైతులు   పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. సుగంధద్రవ్యాల బోర్డు పేరుతో ధరలను పూర్తిగా తగ్గించారని , పెట్టుబడికూడా వచ్చే అవకాశాలు లేకుండా చేశారని, పసుపురైతులను   ముంచుతున్నారని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి,మార్కెట్‌యార్డులు పసుపు రైతుల ఆందోళనతో ప్రతిధ్వనించాయి.2015లో పసుపు ధర క్వింటాల్‌ ‌రూ. 7950లు ఉండగా, ప్రస్తుతం మార్కెట్‌ ‌యార్డులో పసుపు క్వింటాల్‌ ‌రూ. 5000లకు మాత్రమే కొంటామని అధికారులు పేర్కొంటున్నారు.

Leave a Reply